Paper-1

 1. ఎలాన్ మస్క్ ఏఐ - ట్రూత్‌జీపీటీ

2. దేశం వెలుపల అత్యంత ఎత్తయిన అంబేడ్కర్‌ విగ్రహం: భారతదేశం వెలుపల అత్యంత ఎత్తయిన బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహం అమెరికాలోని మేరీలాండ్‌ రాష్ట్రం అకోకీక్‌ పట్టణంలో కొలువుదీరింది. సమతా విగ్రహం (స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ) పేరుతో రూపొందించిన ఈ 19 అడుగుల విగ్రహాన్ని అంబేడ్కర్‌ బుద్ధిజం ఆవిష్కరించారు. గుజరాత్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని రూపొందించిన ప్రముఖ శిల్పి రామ్‌ సుతర్‌ ఈ విగ్రహాన్ని తయారు చేశారు

3. దక్షిణ టెక్సాస్‌లో గోడ నిర్మాణానికి అనుమతి: దక్షిణ టెక్సాస్‌లోని సరిహద్దు ప్రాంతంలో గోడ నిర్మించేందుకు అడ్డుగా ఉన్న 26 కేంద్ర చట్టాలను బైడెన్‌ రద్దు చేశారు. ఇందుకోసం ఆయన తన కార్యనిర్వాహక అధికారాలను వినియోగించుకున్నారు. దీంతో స్టార్‌ కౌంటీలో 32 కిలోమీటర్ల దూరం గోడ నిర్మించేందుకు అవకాశం లభించనుంది. ఈ ఒక్క సరిహద్దు నుంచే ఈ ఆర్థిక ఏడాదిలో ఇప్పటివరకు 11 దేశాల నుంచి 2,45,000 అక్రమ వలసదారులు అమెరికాలో ప్రవేశించారు.

3. కుల వివక్ష నిషేధ నగరంగా ఫ్రెస్నో: కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో నగరం అమెరికాలో కుల వివక్షను నిషేధించిన రెండో నగరంగా నిలిచింది.  గత ఫిబ్రవరిలో సియాటెల్‌ కుల వివక్షను నిషేధిస్తూ తీర్మానం చేసింది. గత సెప్టెంబరులో కాలిఫోర్నియా చట్టసభలో కుల వివక్షను నిషేధిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. 

4. స్విట్జర్లాండ్‌లో బురఖాలపై నిషేధం

5. అమెరికాలో భారతీయులు 47 లక్షలు : అమెరికాలో నివసిస్తున్న భారతీయులు దాదాపు 47 లక్షల మంది అని తేలింది. ఈ మేరకు 2020 నాటి జాతులవారీగా సమగ్ర జనాభా లెక్కల వివరాలను విడుదల చేశారు. పదేళ్లకోసారి రూపొందించే లెక్కల్ని ఈసారి మూడేళ్లు ఆలస్యంగా వెల్లడించారు. కరోనా మహమ్మారి తీవ్రత, గోప్యత పరిరక్షణ చర్యలే దీనికి కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. జనాభా లెక్కల ప్రకారం అమెరికాలో ఉంటున్న విదేశీయుల్లో చైనీయులు ఎక్కువ. ఆ దేశానికి చెందిన వారు 52 లక్షల మంది అగ్రరాజ్యంలో ఉన్నారు. తర్వాత స్థానం భారతీయులదే. ఫిలిప్పీన్స్‌ వారు 44 లక్షలు, వియత్నాం ప్రజలు 22 లక్షల మంది ఉన్నారు. ఉత్తర ఆఫ్రికా, వెనెజువెలాకు చెందినవారు వేగంగా పెరుగుతున్నారనీ, వీరి జనాభా 35 లక్షలు ఉందని తేలింది.

6. సింగపూర్‌ ఎన్నికల్లో షణ్ముగరత్నం ఘన విజయం: భారతీయ సంతతికి చెందిన ఆర్థికవేత్త థర్మన్‌ షణ్ముగరత్నం (66) సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించారు. ఈ మేరకు వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో 70 శాతానికి పైగా ఓట్లు ఆయనకు దక్కటం విశేషం.సింగపూర్‌కు భారతీయ సంతతికి చెందిన మూడో అధ్యక్షుడిగా షణ్ముగరత్నం ఎన్నిక ఖరారైంది. గతంలో భారతీయ సంతతికి చెందిన ఎస్‌.రామనాథన్, దేవన్‌ నాయర్‌ సింగపూర్‌ అధ్యక్షులుగా పనిచేశారు. 

7. బ్రిటన్‌ కేబినెట్‌లోకి భారత సంతతి మహిళ: బ్రిటన్‌ కేబినెట్‌లో మరో భారత సంతతి మహిళ చేరారు. గోవా మూలాలున్న 38 ఏళ్ల క్లెయిర్‌ కౌటినోను ఇంధన శాఖ మంత్రిగా ప్రధాని రిషి సునాక్‌ నియమించారు.

8. జార్జియాలో ‘హిందూ వారసత్వ’ నెలగా అక్టోబరు: మహాత్మా గాంధీ జయంతితో పాటు శరన్నవరాత్రులు, దీపావళి వంటి ప్రముఖ పండగలున్న అక్టోబరును అమెరికాలోని జార్జియా రాష్ట్రం హిందూ వారసత్వ నెలగా ప్రకటించింది. ప్రతిభావంతులైన హిందు-అమెరికన్లకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్‌ బ్రయాన్‌ కెంప్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెలలో హిందూ సంప్రదాయ, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణపై దృష్టి పెడతామని పేర్కొన్నారు.

9. గబోన్‌లో సైన్యం తిరుగుబాటు: ఆఫ్రికాలో మరో సైనిక తిరుగుబాటు జరిగింది. అధ్యక్షుడు అలీ బాంగో (64)ను గబోన్‌లో సైనికులు గృహ నిర్బంధంలోకి తీసుకొని అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. దేశ సరిహద్దులను మూసివేశారు. కొత్త పాలకుడిగా జనరల్‌ బ్రైస్‌ క్లొటైర్‌ ఒలిగు గుయేమాను ఎన్నుకున్నారు.

10. నైగర్‌లో సైన్యం తిరుగుబాటు : పశ్చిమ ఆఫ్రికా దేశం నైగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడు మహ్మద్‌ బజౌమ్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్లు సైన్యం ప్రకటించింది

11. వివాదాస్పద బిల్లుకు ఇజ్రాయెల్‌ ఆమోదం: రాజకీయ అధికారాన్ని న్యాయ వ్యవస్థ నియంత్రించకుండా అడ్డుకునే వివాదాస్పద బిల్లును ప్రజలు, ప్రతిపక్షాల నిరసనల మధ్య ఇజ్రాయెల్‌ పార్లమెంటు కనెస్సెట్‌ ఆమోదించింది. బిల్లుపై తుది ఓటింగ్‌ను ప్రతిపక్షాలు బాయ్‌కాట్‌ చేయడంతో బెంజమిన్‌ నెతన్యాహు ప్రభుత్వం దాన్ని పార్లమెంటులో 64-0 ఓట్లతో ఆమోదింపజేసుకుంది

12. అమెరికా నేవీకి తొలిసారిగా మహిళా అధిపతి! మహిళా అధికారి అడ్మిరల్‌ లీసా ఫ్రాంచెటీని అమెరికా నౌకాదళాధిపతిగా ఎంపిక చేస్తూ అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్ణయం తీసుకున్నారు

13. ధాన్యం ఒప్పందం నుంచి వైదొలగిన రష్యా : క్రిమియా ద్వీపాన్ని, రష్యా ప్రధాన భూభాగాన్ని కలిపే కీలక కెర్చ్‌ వంతెనపై దాడి జరిగింది. ఇది జరిగిన కొన్ని గంటలకే ఐక్యరాజ్యసమితి, తుర్కియే మధ్యవర్తిత్వంతో నిరుడు జులైలో కుదిరిన నల్ల సముద్ర ఆహార ధాన్యాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు మాస్కో కీలక ప్రకటన చేసింది. ఇప్పుడు రష్యా తప్పుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని, ముఖ్యంగా కరవుతో విలవిల్లాడుతున్న కెన్యా, మొరాకో, సోమాలియా, టునీసియా తదితర ఆఫ్రికా దేశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపనుందని నిపుణులు అంటున్నారు. 

14. ఎల్‌నినో పసిఫిక్‌ మహాసముద్ర జలాలను వేడెక్కించి ప్రపంచ వాతావరణాన్ని మారుస్తుంది.

15. నాటోలోకి స్వీడన్‌: అత్యంత కీలకమైన నాటో కూటమిలో 32వ సభ్య దేశంగా అడుగుపెట్టడానికి స్వీడన్‌కు మార్గం సుగమమైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తటస్థంగా ఉంటూ వచ్చిన ఆ దేశం ఇప్పుడు రష్యా వ్యతిరేక బృందంలో చేరనుంది. మరోవైపు నాటోలో ఉక్రెయిన్‌ను చేర్చుకుంటాంగానీ ఇప్పట్లో కాదని నాటో తేల్చి చెప్పింది. 

16. యునెస్కోలోకి అమెరికా పునఃప్రవేశం: ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో)కు దాదాపు ఐదేళ్లు దూరంగా ఉన్న అమెరికా లాంఛనప్రాయంగా సభ్యత్వం తీసుకుంది. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా యునెస్కో నుంచి వైదొలగింది. పారిస్‌ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థలో అమెరికా మళ్లీ చేరేందుకు గత వారం పాలక మండలి ఆమోదం తెలిపింది. 

17. 320 ఏళ్ల వార్తాపత్రిక ‘వీనర్‌ జైటుంగ్‌’ రోజువారీ ముద్రణ నిలిపివేత: ప్రపంచంలోని అత్యంత పురాతన వార్తాపత్రికల్లో ఒకటైన ‘వీనర్‌ జైటుంగ్‌’ రోజువారీ ముద్రణను నిలిపివేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.  ‘వీనర్‌ డయేరియం’ పేరుతో 1703 ఆగస్టు 8న ఈ పత్రిక ప్రారంభమైంది. తర్వాత దాని పేరు ‘వీనర్‌ జైటుంగ్‌’గా మారింది. ఆస్ట్రియా ప్రభుత్వమే దీనికి యాజమాన్యంగా ఉన్నా ఎడిటోరియల్‌ పరంగా స్వతంత్రంగానే కొనసాగింది.  రోజువారీ ప్రింటింగ్‌ను నిలిపివేస్తున్నప్పటికీ ఆన్‌లైన్‌ ఎడిషన్‌ కొనసాగుతుందని యాజమాన్యం వెల్లడించింది.

18. న్యూయార్క్‌ నగర పాఠశాలలకు ఇకపై దీపావళి సెలవు : అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో పాఠశాలలకు ఈ ఏడాది నుంచి దీపావళి రోజున సెలవు ఇవ్వనున్నారు

19. రష్యాలో తిరుగుబాటు: ఉద్రిక్త, నాటకీయ పరిణామాల మధ్య రష్యా దాదాపు అంతర్యుద్ధం అంచుల దాకా వెళ్లింది. అధ్యక్షుడు పుతిన్‌ పెంచి పోషించిన కిరాయి సేన ‘వాగ్నర్‌ గ్రూపు’ ఆయనపైనే తిరుగుబాటు జెండా ఎగురవేసింది. 

20. ఐరాస కార్యాలయంలో చరిత్రాత్మక యోగా దినోత్సవం: ప్రపంచంలోని అత్యధిక దేశస్థులు పాల్గొన్న కార్యక్రమంగా గిన్నిస్‌ బుక్‌లోనూ చోటు సంపాదించింది.  భారత్‌ ప్రతిపాదనతో ఏటా జూన్‌ 21న నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈసారి ప్రపంచం మొత్తాన్ని ఏకం చేసింది. దాదాపు 180 దేశాల ప్రతినిధులు హాజరైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

21. ఎస్టోనియాలో స్వలింగ వివాహం చట్టబద్ధమే: యూరప్‌లోని ఎస్టోనియా దేశం కీలక నిర్ణయం తీసుకుంది. స్వలింగ వివాహానికి అనుమతినిచ్చేలా చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది

22. ఆరుసార్లు టైటిల్‌ గెలిచిన భారత్‌ : ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ సుందరి టైటిల్‌ను భారత్‌ గతంలో ఆరుసార్లు గెలిచింది. రీటా ఫరియా (1966), ఐశ్వర్యారాయ్‌ (1994), డయానా హెడెన్‌ (1997), యుక్తాముఖి (1999), ప్రియాంకా చోప్రా (2000), మానుషి చిల్లర్‌ (2017) ఇప్పటివరకు భారత్‌ నుంచి ప్రపంచ సుందరీమణులుగా నిలిచారు. 

23. హైపర్‌సోనిక్‌ క్షిపణిని ఆవిష్కరించిన ఇరాన్‌ : ధ్వనితో పోలిస్తే ఏకంగా 15 రెట్లు వేగంగా దూసుకెళ్లే హైపర్‌సోనిక్‌ క్షిపణిని రూపొందించినట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఆ అస్త్రాన్ని ఆవిష్కరించింది. ఈ క్షిపణికి ‘ఫత' అని పేరు పెట్టారు.

24.ఐరాస వాతావరణ విభాగం తొలి మహిళా అధిపతిగా అర్జెంటీనా శాస్త్రవేత్త: ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం తొలి మహిళా అధిపతిగా అర్జెంటీనా వాతావరణ శాస్త్రవేత్త సెలెస్టె సౌలో ఎన్నికయ్యారు. 

25. ప్రపంచ వాతావరణ సంస్థ ఉపాధ్యక్షుడిగా మత్యుంజయ్‌ మహాపాత్ర: భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డైరెక్టర్‌ జనరల్‌ మత్యుంజయ్‌ మహాపాత్ర ప్రపంచ వాతావరణ సంస్థ ముగ్గురు ఉపాధ్యక్షుల్లో ఒకరిగా ఎన్నికయ్యారు.

26. ‘లిటిల్‌ ఇండియా’కు శంకుస్థాపన: ఇరు దేశాల మైత్రి, ప్రవాస భారతీయుల సేవలకు గుర్తుగా భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌ ‘లిటిల్‌ ఇండియా’కు శంకుస్థాపన చేశారు. పారామాట నగరంలోని హారిస్‌ పార్క్‌లో ‘లిటిల్‌ ఇండియా’ గేట్‌ వే నిర్మించనున్నారు. ఈ పార్క్‌ వద్ద భారత సంతతి ప్రజలు దీపావళి, ఆస్ట్రేలియా డే వంటి వేడుకలను నిర్వహిస్తుంటారు. హారిస్‌ పార్కు పేరును ‘లిటిల్‌ ఇండియా’గా మార్చినందుకు ఆల్బనీస్‌కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ ఉత్పత్తులు లభించే దుకాణాలు ఇక్కడ ఉన్నాయి.

27. ఐఎస్‌ఐఎల్‌ అంతర్జాతీయ ఉగ్ర సంస్థే [ISIL]: ఆగ్నేయాసియాలోని భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ లేవాంట్‌ (ఐఎస్‌ఐఎల్‌)ను అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకటించింది. మండలిలో 15 సభ్య దేశాలతో కూడిన 1267 కమిటీ ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయాన్ని వెలువరించింది. దీంతో ఆ సంస్థకు చెందిన ఆస్తులను ప్రపంచవ్యాప్తంగా స్తంభింపజేస్తారు. అలాగే ఆ సంస్థ సభ్యుల ప్రయాణాలపైనా, ఆయుధాలపైనా నిషేధం అమలవుతుంది.

28. జనాభాలో భారత్‌ నం-1 : జనాభాలో చైనాను భారత్‌ ఇప్పటికే అధిగమించి తొలి స్థానానికి చేరుకున్నట్లు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. తాజాగా ‘వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ’ కూడా ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించినట్లు పేర్కొంది. చైనాలో జననాల రేటు తగ్గినట్లు ఇటీవలి నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా జనాభాను భారత్‌ ఇప్పటికే దాటి ఉండవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ అంచనాల ప్రకారం.. 2022 చివరినాటికే భారత్‌ జనాభా 141.7 కోట్లు కాగా, తాజాగా ఈ సంఖ్య 142.3 కోట్లకు చేరుకున్నట్లు అంచనా. మరో అంతర్జాతీయ మార్కెట్‌ పరిశోధక సంస్థ మాక్రోట్రెండ్స్‌ సైతం భారత్‌లో ప్రస్తుత జనాభా 142.8 కోట్లుగా లెక్క కట్టింది. చైనా ఇటీవల ప్రకటించిన జనాభా కంటే భారత గణాంకాలే ఎక్కువ. దీంతో ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించినట్లేనని స్పష్టమవుతోంది.  2022 నవంబర్‌ 15న పుట్టిన శిశువుతో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 1974లో ప్రపంచ జనాభా 400 కోట్లు ఉండగా 48 ఏళ్లలో అది రెట్టింపయింది. వైద్యం సహా అనేక రంగాల్లో మానవాళి సాధించిన పురోగతి వల్ల అకాల మరణాలు తగ్గడం, ఆయుర్దాయం పెరగడం జనాభా పెరుగుదలకు ప్రధాన కారణమని ఐరాస వెల్లడించింది.

29. మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన ఐరాస: లష్కరే తోయిబా (LET) డిప్యూటీ చీఫ్‌ అబ్దుల్‌ రెహమాన్‌ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి (ఐరాస) నిర్ణయం తీసుకుంది. భద్రతా మండలికి చెందిన ఐఎస్‌ఐఎల్, ఆల్‌ఖైదా ఆంక్షల కమిటీ మక్కీని ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. భారత్, అమెరికా ఈ మేరకు ప్రతిపాదన చేయగా ఏడు నెలల క్రితం చైనా అడ్డుపడింది. తాజాగా డ్రాగన్‌ తన అభిప్రాయాన్ని మార్చుకోవడంతో ఈ నిర్ణయం వెలువడింది. మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంతో అతడికి సంబంధించిన ఆస్తుల స్వాధీనం, ప్రయాణాలు, ఆయుధాల కొనుగోళ్లపై నిషేధం మొదలైనవి అమలులోకి వస్తాయి. మక్కీ లాహోర్‌లో గృహ నిర్బంధంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐరాస నిషేధిత జాబితాలో పాకిస్థాన్‌కు చెందిన లేదా పాకిస్థాన్‌తో సంబంధాలున్న ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదుల సంఖ్య సుమారు 150కి చేరింది.

30. భారత్‌తో కలిసి క్వాడ్‌ను బలోపేతం చేస్తాం: భారత్, ఆస్ట్రేలియాతో కలిసి ఇండో - పసిఫిక్‌ ప్రాంతానికి ప్రయోజనం కలిగించే ఓ బలమైన శక్తిగా కొనసాగేలా క్వాడ్‌ను బలోపేతం చేస్తామని అమెరికా, జపాన్‌ పేర్కొన్నాయి.  ఇండో - పసిఫిక్, ప్రపంచ ప్రయోజనాల కోసం మేం ఈ ప్రాంతంలో, వెలుపల కూడా ఇతరులతో సహకరిస్తాం. ఆస్ట్రేలియా, భారత్‌తో కలిసి క్వాడ్‌ ఒక శక్తిగా కొనసాగేలా చూస్తామని అందులో పేర్కొన్నారు. క్వాడ్‌లో అమెరికా, జపాన్‌తో పాటు భారత్, ఆస్ట్రేలియాలు సభ్య దేశాలు. ఇండో - పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేస్తూ స్వేచ్ఛాయుత సముద్ర వాణిజ్యం కొనసాగేలా చేయడమే లక్ష్యంగా క్వాడ్‌ ఏర్పడింది.

31. అమెరికాలో సెనేటర్‌గా భారతీయ అమెరికన్‌: డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్‌ ఉషారెడ్డి కాన్సస్‌ రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్‌ 22 సెనేటర్‌గా బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘకాలంగా ఆ పదవిలో ఉన్న టామ్‌ హాక్‌ స్థానంలో ఆమె ఈ పదవిలోకి వచ్చారు. ఎడ్యుకేషనల్‌ లీడర్‌షిప్‌ అంశంపై మాస్టర్స్‌ చేసిన ఉష గతంలో రెండు సార్లు మేయర్‌గా పనిచేశారు.

32. భద్రతా మండలికి జపాన్, స్విట్జర్లాండ్, మొజాంబిక్, ఈక్వెడార్, మాల్టా దేశాలు : భద్రతా మండలి అయిదు [5] కొత్త సభ్య దేశాలకు స్వాగతం పలికింది. జపాన్, స్విట్జర్లాండ్, మొజాంబిక్, ఈక్వెడార్, మాల్టా దేశాలు మండలిలో రెండేళ్ల పాటు సభ్యులుగా ఉంటాయి. భారత్, ఐర్లాండ్, కెన్యా, మెక్సికో, నార్వే దేశాల రెండేళ్ల సభ్యత్వ కాలం డిసెంబరు 31తో ముగిసినందున కొత్త సభ్యులు వాటి స్థానాన్ని భర్తీ చేస్తున్నాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్యులైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌లకు వీటో అధికారం ఉంది. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలోని 193 సభ్య దేశాల నుంచి దఫాల వారీగా 10 దేశాలు రెండేళ్ల పాటు తాత్కాలిక సభ్యత్వం పొందుతాయి. ప్రపంచంలో వివిధ ప్రాంతాల నుంచి వీటిని ఎంపిక చేస్తారు. చిన్న దేశాల వాణి కూడా సమితిలో ప్రతిఫలించేలా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు. అయినా 1946లో భద్రతా మండలి ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు 60 దేశాలు సభ్యత్వానికి నోచుకోలేదు. ఈసారి కొత్త సభ్యులైన అయిదు దేశాలు జూన్‌లో పోటీ లేకుండా ఆ గౌరవం పొందాయి. వీటిలో జపాన్‌ 12 సార్లు మండలి తాత్కాలిక సభ్యత్వం పొందగా, ఈక్వెడార్‌ నాలుగుసార్లు, మాల్టా రెండోసారి పొందాయి. స్విట్జర్లాండ్, మొజాంబిక్‌లు సభ్యత్వం పొందడం ఇదే మొదటిసారి. ప్రపంచంలో సంఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు శాంతి సేనలను భద్రతా మండలి పంపుతుంది. కట్టు తప్పిన దేశాలపై ఆంక్షలు విధిస్తుంది. ఉగ్రవాదం, ఆయుధ నియంత్రణపై కూడా గళమెత్తుతుంది. కొత్తగా ఎదురయ్యే సమస్యలనూ సభ్య దేశాలు మండలిలో ప్రస్తావిస్తాయి. 

33. తొలి డిజిటల్‌ దేశంగా తువాలు దీవి!: రాను రాను సముద్ర మట్టాలు పెరిగి తమ భూభాగం కనుమరుగు అవుతుండటంతో ద్వీప దేశం తువాలు కీలక నిర్ణయం తీసుకుంది. భావితరాలకు సైతం వీరి సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేలా తువాలు డిజిటల్‌ దేశంగా మారనుంది.  కర్బన ఉద్గారాల కారణంగా నీటి మట్టాలు పెరిగిపోతుండటంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని ద్వీప దేశాల భూభాగాలు సముద్రంలో కలిసిపోనున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో తమ దేశాన్ని డిజిటల్‌ దేశంగా మారుస్తామని తువాలు ఐలాండ్‌ ప్రకటించింది. ఆస్ట్రేలియా, హవాయిల మధ్య 9 దీవుల సమూహంగా ఉన్న తువాలులో 12 వేల మంది జనం నివసిస్తున్నారు. ఈ దీవి రాజధాని ప్రాంతం ఇప్పటికే 40 శాతం సముద్రంలో కలిసిపోయింది. ఇదిలాగే కొనసాగితే ఈ దశాబ్దం చివరికి తువాలు పూర్తిగా కనుమరుగు కావడమే కాకుండా, ప్రపంచంలో గ్లోబల్‌ వార్మింగుకు బలయ్యే తొలి ద్వీపం ఇదే కానుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో తువాలు కనుమరుగైనా మెటావర్స్‌ సాంకేతికత ద్వారా తమ దేశ ప్రకృతి అందాలు, ప్రజల జీవనశైలిని పర్యాటకులు చూడొచ్చని ఆ దేశ న్యాయ, సమాచార, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సైమన్‌ కోఫే తెలిపారు. త్వరలోనే తువాలు తొలి వర్చువల్‌ దేశంగా ప్రపంచ ప్రజలకు దర్శనమివ్వబోతోందని చెప్పారు. ది మంకీస్, కొల్లైడర్‌ అనే రెండు సంస్థలు సాంకేతిక పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. ఇందులో తువాలు చరిత్రకు సంబంధించిన డాక్యుమెంట్లు, సంస్కృతీ సంప్రదాయాల వివరాలు, కుటుంబ చిత్రాలు, సంప్రదాయ పాటల వంటి వాటిని నిక్షిప్తం చేయనున్నారు. ఒక దేశం పూర్తిగా మెటావర్స్‌ సాంకేతికతలోకి మారడం ఇదే తొలిసారి కానుంది.

34. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా నామినేటైన‌ అజయ్‌ బంగా: 

35: కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టం చేసిన సియాటెల్‌: అమెరికాలో అమలవుతున్న ‘వివక్ష వ్యతిరేక చట్టంలో’ కులాన్ని కూడా చేర్చిన మొదటి నగరంగా సియాటెల్‌ నిలిచింది. దీనికి సంబంధించి స్థానిక సభలో ప్రవాస భారతీయురాలు, సియాటెల్‌ నగర కౌన్సిల్‌ సభ్యురాలు క్షమా సావంత్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జాత్యహంకారం కంటే కుల వివక్ష భిన్నంగా లేదని అందువల్ల దీనిని కూడా చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరారు. సియాటెల్‌ సిటీ కౌన్సిల్‌ 6-1 ఓట్లతో దాన్ని ఆమోదించింది. ఈ నిర్ణయంతో అమెరికాలోని ప్రవాస భారతీయుల్లోని కొన్ని కులాలకు వివక్ష నుంచి విముక్తి లభిస్తుందని కౌన్సిల్‌ వెల్లడించింది.

36. ఉత్తర కొరియా అణు ప్రయోగాలతో భారీ స్థాయిలో భూగర్భ జలాల కలుషితం: అణ్వాయుధ పరీక్షలతో ఉత్తర కొరియా సొంత ప్రజలనే కాదు, పొరుగున ఉన్న దక్షిణ కొరియా, చైనా, జపాన్‌వాసుల ప్రాణాలనూ ప్రమాదంలో పడేస్తోంది. ఉత్తర కొరియాలోని ‘పుంగేరి’ భూగర్భ అణు పరీక్షా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రయోగాలు ఎంతటి విపత్తును కలిగిస్తున్నాయో సియోల్‌కు చెందిన మానవ హక్కుల సంఘం తాజా అధ్యయనంలో వెల్లడించింది. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, దీంతో ప్రజలకు రేడియోధార్మికత ముప్పు పొంచి ఉందని వెల్లడించింది. 

37. ఐరాసలో చిరుధాన్యాల ప్రదర్శన ఏర్పాటు చేసిన భారత్‌ : అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం - 2023’ సందర్భంగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక చిరుధాన్యాల ప్రదర్శనను భారత్‌ ఏర్పాటు చేసింది. దేశంలో పండే వివిధ రకాలతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిర కాంబోజ్‌ ప్రారంభించారు. వాటి పోషక విలువలు, ఆరోగ్య ఉపయోగాలు, క్యాలరీలు వంటి పూర్తి సమాచారాన్ని ప్రదర్శనలో ఉంచారు. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా స్వీకరించడానికి గల కారణాలను, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో అవి పోషించే భూమికను రుచిర కాంబోజ్‌ వివరించారు.

38. దక్షిణాఫ్రికాలో విపత్తు అత్యయిక స్థితి [స్టేట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌]దక్షిణాఫ్రికాను తీవ్ర విద్యుత్‌ సంక్షోభం చుట్టుముట్టడంతో దేశంలో విపత్తు అత్యయిక స్థితి (స్టేట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌)ని విధిస్తున్నట్లు అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా ప్రకటించారు. ఆస్పత్రులు, తాగు నీటి సరఫరా వ్యవస్థలకు నిరంతరం విద్యుత్‌ సరఫరా ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. దక్షిణాఫ్రికాకు ఏకైక విద్యుత్‌ సరఫరా సంస్థ అయిన ఎస్కామ్‌ దివాళా తీయడంతో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. సమస్యను అధిగమించడానికి ప్రత్యేకంగా విద్యుత్‌ శాఖా మంత్రిని నియమిస్తామని రామఫోసా తెలిపారు. ఎస్కామ్‌ ఇప్పటికే పొరుగు దేశాల నుంచి 300 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకుందని, ప్రైవేటు సంస్థలను కూడా విద్యుదుత్పత్తి కార్యకలాపాలకు అనుమతిస్తున్నామని స్పష్టం చేశారు. 

39. పాకిస్థాన్‌కు రూ.8,250 కోట్ల రుణ సాయం: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) ఉద్దీపన ప్యాకేజీ కోసం ఎదురుచూస్తున్న పాకిస్థాన్‌కు పెద్ద ఊరట లభించింది. పాక్‌ కష్టాలు గట్టెక్కి ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడినపడేలా రూ.8,250 కోట్ల (ఒక బిలియన్‌ డాలర్లు) రుణ సాయం ఆ దేశానికి అందనుంది. 

40. అర్జెంటీనా నూతనాధ్యక్షుడిగా జేవియర్‌ మిలి: అర్జెంటీనాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రజాకర్షక నేత జేవియర్‌ మిలి ఘన విజయం సాధించారు. 

41. అతిపెద్ద రాకెట్‌ ‘స్టార్‌షిప్‌’ ప్రయోగం రెండోసారీ విఫలం: మానవులను అంగారకుడు, చంద్రుడిపైకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన మెగా రాకెట్‌ ‘స్టార్‌షిప్‌’ మళ్లీ నిరాశపరిచింది. రెండోసారి కూడా దీని ప్రయోగం విఫలమైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో స్టార్‌షిప్‌ మొదటి ప్రయోగం జరిగింది. నాడు గాల్లోకి ఎగిరిన 4 నిమిషాలకే గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో అది కూలిపోయింది. స్టార్‌షిప్‌ రాకెట్‌ పొడవు ఏకంగా 121 మీటర్లు (400 అడుగులు) కావడం గమనార్హం. ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌గా పేరుపొందింది. నాసాకు చెందిన స్పేస్‌ లాంచ్‌ సిస్టమ్‌ కన్నా రెట్టింపు శక్తి దీని సొంతం.

42. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ : ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ను చైనా కంపెనీలు ఆవిష్కరించాయి. ఇది సెకనుకు 1.2 టెరాబైట్స్‌ వేగంతో డేటాను ట్రాన్స్‌మిట్‌ చేయగలదని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్టు పత్రిక వెల్లడించింది. 

43. న్యూయార్క్‌ పాఠశాలల్లో ఇక దీపావళికి సెలవు: అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్ర ప్రభుత్వం హిందువులకు తీపి కబురు అందించింది. ప్రభుత్వ పాఠశాలలకు దీపావళిని సెలవు దినంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గవర్నర్‌ కేథీ హోచుల్‌ తాజాగా చట్టంపై సంతకం చేశారు. తద్వారా ఇక నుంచి భారతీయ కేలండర్‌ ప్రకారం పాఠశాలలు దీపావళి సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. న్యూయార్క్‌లో విభిన్న సంస్కృతులకు చెందిన వారు జీవిస్తారు. ఆ భిన్నత్వాన్ని పాఠశాలల్లో సంబరంలా జరుపుకోవడం అవసరమని కేథీ పేర్కొన్నారు.

44. ఫిన్‌లాండ్‌కు ‘డేవిడ్స్‌ స్లింగ్‌’ ఆయుధ వ్యవస్థ: ఒక వైపు హమాస్‌తో యుద్ధం కొనసాగుతున్నా మరోవైపు రక్షణ రంగంలో ఇజ్రాయెల్‌ మరో ఆయుధాల విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నాటో నూతన సభ్య దేశం ఫిన్‌లాండ్‌కు తమ ‘డేవిడ్స్‌ స్లింగ్‌’ గగనతల రక్షణ వ్యవస్థను విక్రయించనున్నట్లు ప్రకటించింది.  ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థలో ‘డేవిడ్స్‌ స్లింగ్‌’ కీలక పాత్ర పోషిస్తోంది. గగనతలంలో శత్రువుల బాలిస్టిక్, క్రూజ్‌ క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్లను గుర్తించి కూల్చివేసే సామర్థ్యం దీనికి ఉంది. ఈ ఆయుధ వ్యవస్థను అమెరికా కంపెనీలతో కలిసి ఇజ్రాయెల్‌ అభివృద్ధి చేసింది

45. త్రిపుర, బంగ్లాదేశ్‌ మధ్య తొలి రైలు మార్గం: భారత్‌ - బంగ్లాదేశ్‌ మధ్య సంబంధాలను పెంపొందించే 3 ప్రాజెక్టులను ఇరు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, షేక్‌ హసీనాలు వర్చువల్‌గా ప్రారంభించారు. ఇందులో త్రిపురలోని నిశ్చింతపుర్, బంగ్లాలోని గంగాసాగర్‌ను కలిపే కీలక రైలు మార్గం ఉంది. ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాను కలిపే తొలి రైలు మార్గమిదే కావడం గమనార్హం

46. 



Who among the following won the record eighth Ballon d’Or 2023 for the best player in the world? Lionel Messi

In November 2023, which of the following Kerala’s cities was officially designated as a Unesco City of Literature? Kozhikode

In November 2023, which of the following countries India has given the Letter of Request for the procurement of 26 Rafale Marine fighter aircraft for the Indian Navy under a government-to-government deal? France

In November 2023, which of the following universities Indian National Space Promotion and Authorization Centre has approved proposal for the development of the varsity’s first satellite? Aligarh Muslim University

Who among the following has bagged the gold in women’s javelin throws in Hangzhou in the Asian Games 2023? Annu Rani

Who among the following has been awarded the Nobel Prize 2023 in Physics for their experimental methods that generate attosecond pulses of light for the study of electron dynamics in matter? Pierre Agostini, Ferenc Krausz, and Anne L’Huillier

In October 2023, which of the following countries will unveil the largest statue of B R Ambedkar outside India on 14th October 2023? Maryland

In October 2023, India and Bangladesh, jointly commenced the 11th edition of an annual joint military exercise, on 3rd October 2023 in Umroi, Meghalaya. What is the name of the exercise? SAMPRITI

Who among the following has been awarded the Nobel Prize 2023 in Chemistry for the discovery and synthesis of quantum dots? Moungi G Bawendi, Louis E Brus, and Alexei I Ekimov

Who among the following bagged gold in Javelin Throw at the Asian Games 2023, held at Hangzhou? Neeraj Chopra

In October 2023, which of the following organizations caught 6 persons with 955 live baby Gangetic turtles of different species at Nagpur, Bhopal, and Chennai? Directorate of Revenue Intelligence

What is the theme of World Teachers’ Day, celebrated every year on October 5 across the globe to recognize and celebrate educators including teachers, researchers, and professors’ work? The teachers we need for the education we want: The global imperative to reverse the teacher shortage

In October 2023, what is the Indian economy’s growth is expected in the FY23 -24 by the World Bank? 6.3%

Who among the following has been appointed as Executive Director of RBI? Muneesh Kapur

In October 2023, which of the following countries with India jointly launched a $600 million fund for climate and environment projects? Japan

What is the rank of India in the Asian Games 2022 held in Hangzhou? 4

In October 2023, which of the following cricketers became the fastest player in the history of the ICC Men’s ODI World Cup to complete 1000 runs? David Warner

In October 2023, which of the following states has declared the Gangetic Dolphin as the state aquatic animal? Uttar Pradesh

Who among the following broke the world record by winning the Chicago Marathon 2023? Kelvin Kiptum

In October 2023, which of the following countries’ first free-standing Gandhi Museum in North America dedicated to the life and legacy of Mahatma Gandhi is open to the public? United States

In October 2023, which of the following countries signed MoU with India ranging in various sectors including digital transformation, maritime sector and sports aiming to enhance cooperation between the two nations? Tanzania

In October 2023, which of the following cities of United states has been inaugurated the largest Hindu temple outside India, Akshardham? New Jersey

Who among the following created the record for the fastest century ever by an Indian in the history of the World Cup? (October 2023) Rohit Sharma

In October 2023, the Ministry of Social Justice & Empowerment has introduced the SHRESHTA to fostering collaboration between grant-in-aid institutions managed by NGOs and residential high schools. What does the SHRESHTA stand for? Scheme for Residential Education for Students in High Schools in Targeted Areas

The International Day for Disaster Reduction (IDDR) is observed every year on _____. 13th Oct

According to Periodic Labour Force Survey Report 2022-23 data, India’s female labour force participation rates was? 37%

Which of the following countries has topped the Global Hunger Index 2023? Belarus

In October 2023, which of the following became the world’s fastest-recovering destination in the services sector? Dubai

In october 2023, which of the following villages awarded the title of “Best Tourism Village of India 2023” by the Union Ministry of Tourism? Dhordo, [Kuch, Gujarat]

What is the percentage growth of the Female Labor Force Participation Rate in the country according to the Periodic Labor Force Survey Report 2022-23? 37%

Which of the following films has been adjudged as the Best Feature Film for the year in the 69th National Film Awards in New Delhi? RRR

In October 2023, which of the following cities became the first women-centric police station across the entire country to be conferred with the International Organization for Standardization certificate? Bhopal

What percentage growth has been forecasted in electric vehicles by 2030 by the Power and New and Renewable Energy Ministry? 45%

In October 2023, which of the following cities Prime Minister Narendra Modi inaugurated the priority section of the Regional Rapid Transit System (RRTS) Corridor? Delhi-Ghaziabad-Meerut

In October 2023, who maong the following has been appointed as India’s next permanent representative to the United Nations and related global bodies in Geneva? Vijay Shekhar Sharma






Comments

Popular posts from this blog

Paper-4

Last Min Prep- P1

MCQs