1. ‘ఫ్లాష్ అండ్ ఫెలోమెన్’ అనే పత్రిక ద్వారా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ప్రజల దృష్టికి తెచ్చినది? ఈవీ పద్మనాభం
2. ‘తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1988, జూలై 14
3. ఎవరి ఆధ్వర్యంలో ‘తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్’ ఏర్పడింది? కె. మనోహర్ రెడ్డి
4. కింది సంస్థల్లో ‘బతుకమ్మ పండుగ కాలాన్ని తెలంగాణ సంస్కృతి పరిరక్షణ దినోత్సవాలు’గా ప్రకటించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు? తెలంగాణ ప్రగతి వేదిక
6. ఎవరి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ‘తెలంగాణ జనసభ’ ఏర్పడింది? ఆకుల భూమయ్య
7. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘మా తెలంగాణ పత్రిక’ను ప్రారంభించారు
9. ఏ సదస్సులో గద్దర్ తొలిసారిగా ‘అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా’ పాట పాడారు? ఫోరం ఫర్ ఫ్రీడం ఆఫ్ ఎక్స్‌ప్రెషన్
10. ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి జ్ఞాపకార్థం ‘ఫోరం ఫర్ ఫ్రీడం ఆఫ్ ఎక్స్‌ప్రెషన్’ సదస్సు నిర్వహించారు? పాశం యాదగిరి, గులాం రసూల్
11. 1997, జూలై 13న ఎవరి ఆధ్వర్యంలో ‘తెలంగాణ ప్రగతి వేదిక’ ఏర్పడింది? రాపోలు ఆనంద భాస్కర్
12. MA తెలుగులో వట్టికోట ఆళ్వారుస్వామి రచించిన ‘ప్రజల మనిషి’ నవలను చేర్చాలని డిమాండ్ చేసి విజయం సాధించింది? తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్
13. ఖైరతాబాద్‌లోని టీ ప్రభాకర్ గారి ప్రింటింగ్ ప్రెస్ పేరు? నాట్యకళా ప్రెస్
16. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ప్రజల దృష్టికి తెచ్చే ‘ఫ్లాష్ అండ్ ఫెలోమెన్’ అనే పత్రిక ఎక్కడ ప్రింట్ అయ్యేది? ఖైరతాబాద్‌లోని టీ ప్రభాకర్ గారి నాట్యకళా ప్రెస్ లో
48. ఏ తేదీన తెలంగాణ ప్రజా సమితి తన సంస్థ యొక్క పరిధిని రాజకీయేతర నుండి రాజకీయ సంస్థగా మార్చాలని నిర్ణయించుకుంది? జూలై 1970
49. పోచంపల్లిలో రామచంద్రా రెడ్డి భూదాన్ ఉద్యమానికి భూమి ఉచితంగా ఇచ్చిన తర్వాత, సేకరించిన భూములను క్రమబద్ధంగా బీదలకు పంచడానికై వినోభా భావే ఒక కమిటీని నియమించాడు. ఈ క్రింది వారిలో ఆ కమిటీ సభ్యుడెవరు ? ఉమ్మెత్తల కేశవరావు
50. టి. ఎన్. సదాలక్ష్మి (1928-2004) తెలంగాణకు మొదటి దళిత మహిళా శాసనసభ్యురాలు మరియు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో పాల్గొన్నారు
52. హైదరాబాద్ రాష్ట్రం విచ్ఛిన్నం కావడాన్ని వ్యతిరేకించని మరియు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీకి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరచిన నాయకుడిని గుర్తించండి. ? కొత్తూరు సీతయ్య గుప్త
58. హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి - MK వెల్లోడి (1950-1952)
59. హైదరాబాద్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి - బూర్గుల రామకృష్ణారావు (1952-1956)
60. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి - నీలం సంజీవ రెడ్డి (1956-1960) (1962-1964)
64. 1969 తెలంగాణ ఉద్యమంలో క్విట్ తెలంగాణ అనే పదాన్ని ఎవరు ఉపయోగించారు? శ్రీధర్ రెడ్డి
66. 1969 ఉద్యమ సమయంలో
సదాలక్ష్మి తన తోటి నిరసనకారులకు మనోహరమైన చర్చలతో స్ఫూర్తినిచ్చింది.
- తెలంగాణ ప్రజా సమితికి అధ్యక్షత వహించిన మహిళగా సదాలక్ష్మి గుర్తింపు పొందారు.
- నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో సదాలక్ష్మి మొదటి మహిళా డిప్యూటీ స్పీకర్.
- తక్కెళ్లపల్లి పురుషోత్తంరావు తెలంగాణ రక్షణ ఉద్యమ సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు.
67. వశిష్ట భార్గవ కమిటీకి సంబంధించి కింది వాటిలో ఏది నిజం?
- భార్గవ్ కమిటీ నివేదికను తెలంగాణ ప్రజాప్రతినిధులు, ప్రాంతీయ కమిటీ వ్యతిరేకించాయి.
- తెలంగాణ మిగులు నిధి విలువ రూ. 1956 మరియు 1968 మధ్య 28.34 కోట్లు.
- ఈ కమిటీ తెలంగాణ మిగులు నిధులను పరిశీలించేందుకు ఏర్పాటైన కమిటీ.
- 1969 ఏప్రిల్ 22న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వశిష్ఠ భార్గవ నేతృత్వంలో తెలంగాణ మిగులు నిధులను పరిశీలించేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత అధికారి కమిటీని నియమించింది.
- ఈ కమిటీకి అధ్యక్షుడు వశిష్ఠ భార్గవ మరియు సభ్యులు విహారి మాథుర్, హరి భూషణ్.
68. కాలక్రమానుసారం అమర్చండి:
- సామూహిక సత్యాగ్రహం
- తెలంగాణ పరిరక్షణ దినోత్సవం
- తెలంగాణ జెండా దినోత్సవం
1969 ఏప్రిల్ 9 న రాష్ట్రవ్యాప్తంగా
విస్తృత సత్యాగ్రహాలకు తెలంగాణ ప్రజా సమితి (TPS) కొత్త అధ్యక్షుడు ఎస్.బి. గిరి పిలుపునిచ్చారు. సత్యాగ్రహులు, ఎస్.బి. గిరిలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎస్.బి. గిరి అరెస్టుతో, TPS నాయకత్వానికి సదా లక్ష్మి ఎంపికయ్యారు.
- తెలంగాణ పరిరక్షణ దినోత్సవం:
ఉద్యమకారులు 1969 జూలై 10 న తెలంగాణ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు.
ఆ రోజున నల్లజెండా దినోత్సవాన్ని కూడా నిర్వహించారు.
తెలంగాణ జెండా దినోత్సవాన్ని జూలై 12, 1969 న జరుపుకున్నారు.
- ఇసామియా బజార్‌లో ప్రత్యేక తెలంగాణ జెండాను ఎగురవేసినందుకు జీ.ఎస్. మెల్కోటే (MP)ని అరెస్టు చేశారు.
- తెలంగాణ భూభాగాన్ని ప్రదర్శిస్తూ జెండాతో మోటారు వాహనాల ఊరేగింపు నిర్వహించారు.
- పాఠశాలల్లో, ప్రభుత్వ భవనాల ముందు, చార్మినార్‌పై కూడా తెలంగాణ జెండాలు రెపరెపలాడాయి.
69. పండిట్ సుందర్‌లాల్ కమిటీ:
- ఆపరేషన్ పోలో పేరుతో జరిగిన సైనిక చర్య సందర్భంగా భారతీయ సైన్యం చేతిలో వేలాది మంది ముస్లింలు మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అప్పటి ప్రధాని నెహ్రూ పండిట్ సుందర్‌లాల్ అధ్యక్షతన ఖాజీ అబ్దుల్ గఫార్, యూనస్ సలీంలు సభ్యులుగా విచారణ కమిటీని నియమించారు.
70. జస్టిస్ జగన్‌మోహన్‌రెడ్డి కమిషన్:
- 1952 ముల్కీ ఉద్యమం సందర్భంగా సెప్టెంబర్ 3, 4 తేదీల్లో సిటీ కాలేజీ, ఉస్మానియా దవాఖాన వద్ద జరిగిన పోలీసు కాల్పులపై విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించడానికి హోంశాఖ 1952, సెప్టెంబర్ 9న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పింగళి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కమిషన్‌ను నియమించింది. ఈ కమిటీ తన నివేదికను 1952, డిసెబర్ 28న ప్రభుత్వానికి సమర్పించింది.
71. పెద్దమనుషుల ఒప్పందం:
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి న్యూఢిల్లీలోని హైదరాబాద్ భవన్‌లో 1956, ఫిబ్రవరి 20న జరిగిన సమావేశంలో తెలంగాణ, సీమాంధ్ర నేతలు చర్చించి ఒప్పందం కుదుర్చుకున్నారు. దీన్నే పెద్ద మనుషుల ఒప్పందం అంటారు. ఈ సమావేశంలో తెలంగాణకు చెందిన బూర్గుల రామకృష్ణారావు, కేవీ రంగారెడ్డి, జేవీ నరసింగరావు, మర్రి చెన్నారెడ్డి, ఆంధ్రప్రాంతం నుంచి బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, అల్లూరి సత్యనారాయణరాజు, గౌతు లచ్చన్న పాల్గొన్నారు.
72. కుమార్ లలిత్ కమిటీ
- తెలంగాణ మిగులు నిధులను లెక్కకట్టడానికి కుమార్ లలిత్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1969, జనవరి 23న కమిటీని నియమించింది. భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఈయన పేరును సూచించింది. 1956, నవంబర్ 1 నుంచి 1968, జనవరి 23 వరకు తెలంగాణ మిగులు నిధులను అంచనావేసి 1969, మార్చి 5లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఈ కమిటీని ఆదేశించింది.
73. జస్టిస్ వాంఛూ కమిటీ
- అష్టసూత్ర పథకం అమలులో భాగంగా 1969, ఏప్రిల్ 19న కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కైలాస్‌నాథ్ వాంఛూ అధ్యక్షతన ఒక న్యాయ నిపుణుల కమిటీని నియమించింది. తెలంగాణ ఉద్యోగుల సమస్యలను అధ్యయనంచేసి రాజ్యాంగపరమైన పరిష్కారాలను సూచించడానికి ఈ కమిటీని నియమించింది. ఇందులో మాజీ అటార్నీ జనరల్ ఎంపీ సెతల్వాడ్, అప్పటి అటార్నీ జనరల్ నిరెన్‌డేలు సభ్యులుగా ఉన్నారు.
- ఈ కమిటీ తన నివేదికను 1969, ఆగస్టులో ప్రభుత్వానికి సమర్పించింది. ముల్కీ నిబంధనల అమలుకోసం రాజ్యాంగాన్ని సవరించే అవకాశం లేదని, గోలక్‌నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 సవరణకు అనుమతించడం లేదని ఇందులో పేర్కొన్నది.
74. వశిష్ట భార్గవ కమిటీ:
- ప్రధాని అష్ట సూత్ర పథకం అమలులో భాగంగా 1969, ఏప్రిల్ 22న తెలంగాణ మిగులు నిధులను అంచనావేయడానికి జస్టిస్ వశిష్ట భార్గవ అధ్యక్షతన ఉన్నతాధికార సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో ప్రొఫెసర్ ముకుట్ విహారీ మాథూర్ (ఆసియాన్ విద్యా ప్లానింగ్ డైరెక్టర్), హరిభూషణ్ భట్ (డిప్యూటీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) సభ్యులు. ఈ కమిటీ కార్యదర్శి టీఎన్ కృష్ణ స్వామి.
- కమిటీ తన నివేదికలో కుమార్ లలిత్ కమిటీ అంచనాలకంటే తక్కువగా రూ. 28.34 కోట్లు తెలంగాణ మిగులు నిధులు ఉన్నాయని చెప్పింది. ఇది తెలంగాణ ప్రాంతీయ కమిటీ నాయకులను, ఉద్యమకారులను మరింత ఆగ్రహానికి గురిచేసింది.
75. తెలంగాణ అభివృద్ధి కమిటీ
- అష్టసూత్ర పథకం అమల్లో భాగంగా 1969, ఏప్రిల్ 25న ముఖ్యమంత్రి అధ్యక్షతన తెలంగాణ అభివృద్ధి కమిటీ ఏర్పడింది. ఇందులో ఆర్ వెంకట్రామన్, వీబీ రాజు, జేవీ నరసింగరావు, పీవీ నరసింహారావు, గురుమూర్తి, అరిగె రామస్వామి, కేవీ నారాయణరెడ్డి మహ్మద్ ఇబ్రహీం అన్సారీ, జే చొక్కారావు సభ్యులుగా ఉన్నారు.
76. జయభారత్‌రెడ్డి లేదా ఆఫీసర్స్ కమిటీ:
- తెలంగాణలో స్థానికేతరుల నియామకాలకు వ్యతిరేకంగా స్వామినాథన్ అధ్యక్షతన టీఎన్‌జీఓ సంఘం నిర్వహించిన ఆందోళనలు, విజ్ఞప్తుల నేపథ్యంలో ఎన్‌టీ రామారావు ప్రభుత్వం 1984లో ఈ కమిటీని నియమించింది. ఇందులో కమలనాథన్, ఉమాపతిరావు సభ్యులుగా ఉన్నారు.
- ఈ కమిటీ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయిన తేదీ 1975, అక్టోబర్ 18 నుంచి 1984 వరకు జరిగిన ఉద్యోగ నియామకాలన్నింటినీ పరిశీలించింది. 1981, జూన్ 30 నాటికి తెలంగాణలో అక్రమంగా 58,962 మంది స్థానికేతరులు నియామకమయ్యారని తన 36 పేజీల నివేదికలో తేల్చింది.
77. సుందరేశన్ కమిటీ:
- ఆఫీసర్స్ కమిటీ నివేదికపై విస్తృత చర్చల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సుందరేశన్ కమిటీని నియమించింది. ఈ కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం 610 జీఓను విడుదల చేసింది.
78. 610 జీఓ- ఆంధ్రప్రదేశ్ అప్పటి గవర్నర్ కుముద్‌బెన్ జోషి పేరుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్ 1985, డిసెంబర్ 30న 610 జీఓ విడుదల చేశారు.
- దీనిప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి వచ్చిన రోజు నుంచి జీఓ 610 జారీ అయ్యే నాటికి తెలంగాణలోని జిల్లాలు, జోన్లలో నిబంధనలకు వ్యతిరేకంగా నియమితులైన స్థానికేతరులందరినీ వారి స్వస్థలాలకు 1986, మార్చి 31 నాటికి పంపించాలని, వారిని బదిలీ చేయడానికి వీలుగా ఆయా ప్రాంతాల్లో అవసరమైతే అదనపు ఉద్యోగాలు కల్పించాలి.
79. ప్రణబ్ ముఖర్జీ కమిటీ
- తెలంగాణపై సంప్రదింపుల కోసం ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన, రఘువంశ్ ప్రసాద్, దయానిధి మారన్ సభ్యులుగా 2005, జనవరి 8న త్రిసభ్య కమిటీని సోనియాగాంధీ నియమించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దేశంలోని వివిధ పార్టీల అభిప్రాయాలను కోరడం ఈ కమిటీ ఉద్దేశం.
80. రోశయ్య కమిటీ
- 2009, ఫిబ్రవరి 12న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ అంశంపై ఆర్థిక మంత్రి రోశయ్య నేతృత్వంలో ఉభయసభల సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, షేక్ హుస్సేన్, ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రుద్రరాజు, అక్బరుద్దీన్ ఓవైసీ మొదలైనవారు సభ్యులుగా ఉన్నారు.
81. ఉత్తమ్‌కుమార్ రెడ్డి కమిటీ
- 610 జీఓ అమలుకోసం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే కమిటీ సభ్యుల్లోని సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో 610 జీఓ అమలుకు విఘాతం కలిగింది.
82. శ్రీకృష్ణ కమిటీ
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు విస్తృత సంప్రదింపుల కోసం 2010, ఫిబ్రవరి 3న కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ (సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి) అధ్యక్షత వహించగా, వినోద్ కుమార్ దుగ్గల్ (హోంశాఖ మాజీ కార్యదర్శి) కార్యదర్శిగా, రవీందర్ కౌర్ (ఐఐటీ ఢిల్లీలో మానవ సామాజిక శాస్ర్తాల విభాగం ప్రొఫెసర్), రణ్‌బీర్ సింగ్ (జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్), అబూ సలే షరీఫ్ (సీనియర్ రిసెర్చ్ ఫెలో, అంతర్జాతీయ ఆహార విధానం పరిశోధక సంస్థ, ఢిల్లీ) సభ్యులుగా ఉన్నారు.
- 2010, డిసెంబర్ 31నాటికి నివేదిక అందించాలని కమిటీకి కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఒక రోజు ముందే అంటే 2010, డిసెంబర్ 30న తన నివేదికను అందించింది. ఇందులో 9 అధ్యాయాలున్నాయి. రాష్ట్ర విభజన విషయంలో 6 సూచనలు చేసింది.
83. అఖిలపక్ష సమావేశం
- చిదంబరం స్థానంలో కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సుశీల్‌కుమార్‌షిండే తెలంగాణ అంశంపై 2012, డిసెంబర్ 28న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో 8 పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
84. ఆంటోనీ కమిటీ
- రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ అధ్యక్షతన విభజన అమలుకు 2013, ఆగస్టు 6న కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇందులో అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలీ, దిగ్విజయ్‌సింగ్ సభ్యులుగా ఉన్నారు.
85. మంత్రుల బృందం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్)
- 2013, అక్టోబర్ 8న రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర రక్షణమంత్రి ఏకే ఆంటోనీ చైర్మన్‌గా మంత్రుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో సుశీల్‌కుమార్ షిండే, చిదంబరం, గులాంనబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, జైరాం రమేష్ సభ్యులుగా ఉన్నారు. దీనికి 6 వారాల గడువు ఇచ్చారు.
86. గిర్‌గ్లానీ కమిషన్
- 610 జీఓ అమలులో వైఫల్యం, స్థానికేతరులను వెనక్కి పంపించాలని టీఎన్‌జీవోల డిమాండ్ల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గిర్‌గ్లానీ అధ్యక్షతన 2001, జూన్ 26న ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల తేదీ నుంచి 2004, సెప్టెంబర్ 30 వరకు జరిగిన అక్రమ నియామకాలు, పదోన్నతులు, బదిలీల గురించి ఈ కమిటీ పరిశీలించింది. 2004, సెప్టెంబర్ 30న నివేదికను సమర్పించింది. అందులో రాష్ట్రపతి ఉత్తర్వులు 126 పద్ధతుల్లో ఉల్లంఘనకు గురయ్యాయని, వాటిని 18 రకాలుగా వర్గీకరించి 35 పరిష్కారాలను సూచించింది.
87. తెలంగాణ ఉమ్మడి కార్యాచరణ సమితి (జాయింట్ యాక్షన్ కమిటీ)ని 2009లో ఎప్పుడు ఏర్పాటు చేశారు? తెలంగాణ ఉమ్మడి కార్యాచరణ సమితి (జాయింట్ యాక్షన్ కమిటీ) 2009లో డిసెంబర్ 24న ఏర్పాటైంది
88. తెలంగాణ జనసమితి అనే రాజకీయ పార్టీని స్థాపించారు.? కోదండరామ్
89. శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏయే రాజకీయ పార్టీలు సమావేశాన్ని బహిష్కరించాయి? TRS,TDP, BJP
- శ్రీకృష్ణ కమిటీ- ఈ కమిటీని భారత ప్రభుత్వం 3 ఫిబ్రవరి 2010న ఏర్పాటు చేసింది మరియు దాని నివేదికను 30 డిసెంబర్ 2010న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించింది.
- శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చించేందుకు చిదంబరం ఆంధ్రప్రదేశ్‌లోని 8 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను ఢిల్లీలో సమావేశానికి ఆహ్వానించారు, అయితే ఈ సమావేశాన్ని బహిష్కరించాలని టిఆర్ఎస్, టిడిపి మరియు బిజెపి నిర్ణయించాయి.
90. తెలంగాణ ప్రజాఫ్రంట్ - గద్దర్
- నగర భేరి - బెల్లయ్య నాయక్
- తుడుం దెబ్బ - నరసింగరావు
- తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్- విమలక్క
91. తెలంగాణ ప్రజా ఫ్రంట్ (TPF):
- 2010 అక్టోబరు 9న హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లోని మారుతీ గార్డెన్స్‌లో జరిగిన సమావేశంలో గద్దర్ అధ్యక్షతన తెలంగాణ ప్రజాఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు.
- TPF సెక్రటరీ జనరల్‌గా నలుమాసు కృష్ణ ఎన్నికయ్యారు.
- తెలంగాణ ఉద్యమ సంస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే లక్ష్యంతో టీపీఎఫ్‌ను స్థాపించినట్లు గద్దర్ తెలిపారు.
- 2012 ఏప్రిల్ 19న ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
92. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్:
- తెలంగాణ ప్రజాఫ్రంట్‌తో విభేదించిన తరువాత, అరుణోదయ విమలక్క తన మద్దతుదారులతో కలిసి 21 ఫిబ్రవరి, 2011న హనుమకొండలోని అంబేద్కర్ భవన్‌లో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్‌ను స్థాపించారు.
- చైర్మన్ - ప్రొఫెసర్ కేశవరావు జాదవ్
- కో-ఛైర్మెన్ - విమలక్క
- సెక్రటరీ జనరల్ - దిలీప్ కుమార్
93. నగర భేరి:
- ఇది లంబాడీ హక్కుల పోరాట సమితి- LHPS (లంబాడీ హక్కుల పోరాట సమితి).
- వ్యవస్థాపక అధ్యక్షుడు - తేజావత్ బెల్లయ్య నాయక్
- ముఖ్య నేతలు - మంగీలాల్, దాసురాం, మిట్టు నాయక్, బాలు చౌహాన్, రాందాస్ నాయక్, వెంకన్న, మోహన్ నాయక్.
94. తుడుం దెబ్బ:
- ఇది ఆదివాసీ హక్కుల పోరాట సమితి (ఆదివాసీ హక్కుల పోరాట సమితి).
- కన్వీనర్ - దుబ్బగట్ల నర్సింగరావు
- ఇతర నాయకులు - గుమ్మడి లక్ష్మీనారాయణ, సిద్దబోయిన లక్ష్మీనారాయణ, కుర్సం సుబ్బారావు.
95. 2012 డిసెంబరు 28 వ తేదీ యు.పి.ఎ ప్రభుత్వం తెలంగాణ విషయంగా ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. క్రింద తెలిపిన పార్టీలు, వాటి నాయకులతో జతపరచుము.
- కాంగ్రెసు- సురేష్ రెడ్డి & గాదె వెంకటరెడ్డి
- వై.సి.పి.- మైసూర రెడ్డి & కె.కె. మహీంద్ర రెడ్డి
- సి.పి.ఐ.- కె. నారాయణ & గుండా మల్లేష్
- సి.పి.యం.-రాఘవులు & జూలకంటి రంగారెడ్డి
- తెలంగాణపై 28-12-2012న ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది.
- సమావేశానికి అధ్యక్షుడు సుశీల్ కుమార్ షిండే .
- సమావేశంలో 8 పార్టీలు పాల్గొనగా ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు సభ్యులు హాజరయ్యారు.
పాల్గొన్న పార్టీలు మరియు సంబంధిత నాయకులు క్రిందివి:
కాంగ్రెసు KR. సురేష్ రెడ్డి, గాదె వెంకట్ రెడ్డి
టీడీపీ యనమల రామకృష్ణుడు, కడియం శ్రీహరి
టీఆర్ఎస్ కేసీఆర్, నాయిని నరసింహా రెడ్డి
వైసీపీ మైసూరా రెడ్డి, కెకె. మహేందర్ రెడ్డి
సి.పి.ఐ నారాయణ, గుండా మల్లేష్
సిపిఎం రాఘవులు, జూలకంటి రంగారెడ్డి
బీజేపీ కిషన్ రెడ్డి, హరిబాబు
MIM అక్బరుద్దీన్, అసరుద్దీన్
మొత్తం 8 పార్టీల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ, సీపీఐలు తెలంగాణకు మద్దతుగా నిలిచాయి.
సమావేశంలో సీపీఐ, ఎంఐఎం తటస్థంగా ఉన్నాయి.
96. జై తెలంగాణ పార్టీ- ఇంద్ర రెడ్డి
97. తెలంగాణ సాధన సమితి- ఆలే నరేంద్ర
98. నవ తెలంగాణ పార్టీ- టి. దేవేందర్ గౌడ్
- జూలై 2008 లో హైదరాబాద్‌లో స్థాపించబడింది
99. తెలంగాణ నగరా సమితి- నాగం జనార్థన్ రెడ్డి
100. 2012 జనవరిలో మహబూబ్నగర్ జిల్లాలో బీజేపీ 'తెలంగాణ పోరు యాత్ర'ని ఎక్కడి నుండి ప్రారంభించింది.? బీజేపీ 2012 జనవరిలో కృష్ణా , మహబూబ్‌నగర్ జిల్లాలో 'తెలంగాణ పోరు యాత్ర' ప్రారంభించింది.
- రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నాయకులు యాత్రను జెండా ఊపి ప్రారంభిస్తారు.
101. తెలంగాణ ముసాయిదా బిల్లు-2013ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించి అభిప్రాయం కోసం అసెంబ్లీకి పంపారు? 11 డిసెంబర్, 2013
102. సాగర హారం:
- 30 సెప్టెంబర్ 2012 న తెలంగాణ మార్చ్ లేదా సాగర హరం నిర్వహించారు.
- నెక్లెస్ రోడ్ వద్ద మాత్రమే "సాగర హరం" అనే తెలంగాణ కవాతుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది మరియు పోలీసులు నిరసనకారులను సికింద్రాబాద్ వైపు నుండి రహదారిలోకి అనుమతించారు.
102. సడక్ బంద్
- హైదరాబాద్-కర్నూలు జాతీయ రహదారిపై ‘సడక్ బంద్’ కోసం పిలుపునిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్), తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ రెండు కలసి ముందుకు సాగాలని నిశ్చయించుకున్నారు.
- టిఆర్ఎస్ మరియు జెఎసి ట్రాఫిక్ ను అడ్డుకోడానికి హైవే వెంట వారి మద్దతుదారులు 7 ప్రధాన దారులను గుర్తించారు.
- రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మరియు షాద్‌నగర్, జడ్చెర్ల, భూతపూర్, అడ్డాకుల, కొత్తకోట, మరియు మహబూబ్‌నగర్ లోని అలంపూర్.
- జెఎసి చైర్మన్ ఎం. కోదండరం మహాబుబ్‌నగర్‌లోని పెబ్బైర్‌లో విలేకరులతో మాట్లాడుతూ లక్ష మంది పోలీసు సిబ్బందిని నియమించినా బంద్ పాటిస్తామని చెప్పారు.
103. మిలియన్ మార్చ్
- మిలియన్ మార్చ్ ను ట్యాంక్ బండ్ పై నిర్వహించారు.
- 10 మార్చి 2011 న, ఈజిప్టు నిరసనల తరువాత రూపొందించిన ‘మిలియన్ మార్చి’ కార్యక్రమం ఆందోళనకారులకు ప్రతిష్టాత్మకమైనదిగా నిలిచింది.
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ లక్షలాది మంది ప్రజలు నెక్లెస్ రోడ్‌లో భారీ వర్షంలో ధర్నా చేశారు.
104. సంసద్ యాత్ర
- 27 ఏప్రిల్ 2013 న సంసద్ యాత్ర ను ప్రారంబించారు.
- ఢిల్లీకి బయలుదేరిన ప్రత్యేక రైలుకు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టారు అదేవిధంగా టిజెఎసి నాయకులు సంసద్ యాత్ర - చలో ఢిల్లీ ప్రారంభానికి గుర్తుగా జెండాను ఊపారు.
- తెలంగాణ సమస్య మరోసారి దేశ రాజధానిలో ప్రతిధ్వనించింది, రెండు రోజుల తెలంగాణ సంసద్ యాత్ర యొక్క తెలంగాణ జాయింట్ యక్టన్ కమిటీ (టిజెఎసి) ఢిల్లీ లోని జంతర్ మంతర్‌లో ‘సత్యాగ్రహ దీక్ష’ తో ప్రారంభమైంది.
- సంసద్ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశ్యం, తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ను అంగీకరించడానికి కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావడం.
105. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు 2013పై చర్చకు ఎన్ని వారాల సమయం ఇచ్చారు? 6 వారాలు
107. మంత్రుల బృందం - జివోఎం:
- కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం మేరకు హైదరాబాద్ సహా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు 2013 అక్టోబర్ 3న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
- 2013 అక్టోబర్ 8న రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ అధ్యక్షతన మంత్రుల బృందం -GMO ఏర్పాటైంది.
- ఈ గ్రూపునకు కేంద్రం 6 వారాల గడువు ఇచ్చింది.
- జివోఎం చైర్మన్ - ఎ.కె.ఆంటోనీ
- సభ్యులు:
- సుశీల్ కుమార్ షిండే (హోం మంత్రి)
- చిదంబరం (ఆర్థిక మంత్రి)
- వీరప్ప మొయిలీ (పెట్రోలియం శాఖ మంత్రి)
- జైరాం రమేష్ (గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి)
- గులాం నబీ ఆజాద్ (ఆరోగ్య శాఖ మంత్రి)
- ప్రత్యేక ఆహ్వానితుడు - వి.నారాయణ స్వామి
- విభజన తర్వాత తలెత్తే సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు.
- సలహాలు, సూచనలు ఇవ్వాలని ఈ కమిటీ రాష్ట్ర రాజకీయ పార్టీలను కోరింది.
- నవంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో కమిటీని కలిసి సలహాలు ఇవ్వాలని కోరారు.
- కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, సీపీఐ, ఎంఐఎం పార్టీలు తమ అభిప్రాయాలతో నివేదికలు సమర్పించాయి.
- కానీ టీడీపీ, సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఎలాంటి నివేదిక ఇవ్వలేదు.
- అదే సమయంలో రాయలసీమ నేతలు జేసీ దివాకర్ రెడ్డి, టీజీ వెంకటేష్ లు రాయల తెలంగాణ కావాలని డిమాండ్ చేశారు.
- కేంద్రం కూడా ఈ డిమాండ్ వైపు మొగ్గు చూపింది.
- రాయల తెలంగాణ డిమాండ్ ను కెసిఆర్, తెలంగాణవాదులు తీవ్రంగా ఖండించారు.
- 2013 డిసెంబరు 4, 5 తేదీల్లో ఇతర నిరసనలతో బంద్ నిర్వహించారు.
- దీంతో రాయల తెలంగాణ ఆలోచనను కేంద్రం విరమించుకుంది.
- 2013 డిసెంబర్ 5న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.
- అదే రోజు కేంద్ర కేబినెట్ తెలంగాణ ముసాయిదా బిల్లు 2013ను ఆమోదించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపింది.
- 2013 డిసెంబర్ 11న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ ముసాయిదా బిల్లు-2013ను ఆమోదించి అభిప్రాయం కోసం అసెంబ్లీకి పంపారు.
- బిల్లుపై చర్చించేందుకు అసెంబ్లీకి 6 వారాల సమయం ఇచ్చారు
108. జనవరి 8, 2014న రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై మొదటి చర్చను కింది వారిలో ఎవరు ప్రారంభించారు? వట్టి వసంత్ కుమార్
- అసెంబ్లీలో తెలంగాణ బిల్లు:
- అప్పటి శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- అప్పటి డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క
- రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
- కిరణ్ కుమార్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే శాసనసభా వ్యవహారాల శాఖను శ్రీధర్ బాబు (కాంగ్రెస్) నుంచి సీమాంధ్రకు చెందిన శైలజానాథ్ కు బదిలీ చేశారు.
- 2014 జనవరి 3న రెండో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి
- 2014 జనవరి 6న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుపై చర్చ మొదలైందా లేదా అని ప్రశ్నించగా... చర్చ మొదలైందని అప్పటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు.
- జనవరి 8, 2014: బిల్లుపై తొలి చర్చను మంత్రి వట్టి వసంత్ కుమార్ ప్రారంభించారు
- 2014 జనవరి 22న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఈ బిల్లును ఉద్దేశించి ప్రసంగిస్తూ తాను ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు
- రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును వెనక్కి పంపాలని రూల్ 77 కింద అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన తీర్మానానికి సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు.
- 2014 జనవరి 30న 87 మంది శాసన సభ్యులు బిల్లుపై ప్రసంగించారు.
- మిగిలిన వారు తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఇలా సభ్యులందరి అభిప్రాయాలను నమోదు చేశారు.
- తెలంగాణ బిల్లుపై 9072 సవరణలు ప్రతిపాదించినట్లు స్పీకర్ తెలిపారు.
109. తెలంగాణ బిల్లు గురించిన కింది ప్రకటనలను పరిశీలించండి:
- డిసెంబర్ 13, 2013న బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి చేరింది.
- 15వ తేదీన బిల్లు పత్రాలను ఎమ్మెల్యేలకు అందించారు.
- డిసెంబర్ 12, 2013న ఢిల్లీ నుంచి ప్రత్యేక ఫ్లైట్ లో రాష్ట్రపతి పంపిన బిల్లును అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి పి.కె.మొహంతికి అందజేశారు.
- అప్పటి డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క చర్చను ప్రారంభించారు
110. దేశ్ ముఖ్ లు- ఆదాయ సేకరణ కలెక్టర్
- సర్బస్తదార్లు- రెవెన్యూ కాంట్రాక్టరు
111. సదర్-ఉస్-సుదుర్- మత విభాగం
- ఖాజి-ఇ-సుబహ్- ప్రజల మరియు నేరస్తుల పాలనా నిర్వహణ
112. నిజాంలు 1
724 నుండి 1948 వరకు 224 సంవత్సరాలు హైదరాబాద్ రాజ్యాన్ని రాచరిక పద్ధతిలో పరిపాలించారు.
- నిజాం అనే పదం 1719 నుండి భారతదేశంలోని హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన స్థానిక సార్వభౌమాధికారుల బిరుదుగా ఉన్నది.
- నిజాంలు అసఫ్ జాహి రాజవంశానికి చెందినవారు. మొఘల్ చక్రవర్తుల ఆధ్వర్యంలో 1713 నుండి 1721 వరకు దక్కన్ వైస్రాయ్ గా పనిచేసిన మీర్ కమర్-ఉద్-దిన్ సిద్దిఖీ ఈ రాజవంశాన్ని స్థాపించాడు.
- తన పాలన ముగిసిన తరువాత కూడా అసఫ్ జాహి తన బిరుదును నిలుపుకోవటానికి అనుమతించబడ్డాడు.
113. దేశ్ ముఖ్ లు- ఆదాయ సేకరణ కలెక్టర్
- సర్బస్తదార్లు- రెవెన్యూ కాంట్రాక్టరు
- సదర్-ఉస్-సుదుర్-మతవిభాగం
- ఖాజీ-ఇ-సుబహ్-ప్రజల మరియు నేరస్తుల పాలనా నిర్వహణ
114. కింది వాటిని కాలక్రమానుసారం అమర్చండి:
- ఎనిమిది పాయింట్ల సూత్రం
- ముల్కీ నియమాలపై సుప్రీంకోర్టు తీర్పు
- ఆరు పాయింట్ల సూత్రం
- రాజ్యాంగం 32 అధికరణం 371-Dకి సవరణ
ఎనిమిది పాయింట్ల ఫార్ములా
1969 ఏప్రిల్ 11న, ప్రధాని ఎనిమిది పాయింట్ల ప్రణాళికను అభివృద్ధి చేశారు.
ముల్కీ నియమాలపై సుప్రీంకోర్టు తీర్పు
1972 అక్టోబరు 3న ముల్కీ నియమాలపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
ఆరు పాయింట్ల ప్రణాళిక
1973 సెప్టెంబరు 21న ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలు మరియు భారతదేశ ప్రభుత్వం మధ్య ఆరు పాయింట్ల ప్రణాళికతో రాజకీయ ఒప్పందం జరిగింది.
భవిష్యత్తులో ఇలాంటి ఆందోళనలు జరగకుండా చూసుకుంటామని రెండు ప్రాంతాల నేతలు అంగీకారానికి వచ్చారు.
రాజ్యాంగం 32 అధికరణం 371-డి సవరణ
భారత రాజ్యాంగంలో అధికరణం 371 (డి) ఒక భాగం.
ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళనల తర్వాత విద్య, ఉద్యోగాల్లో స్థానికుల హక్కులను కాపాడటం కోసం దీన్ని సృష్టించారు.
1974లో 32వ రాజ్యాంగ సవరణలో దీన్ని చేర్చారు.
తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన ప్రాంతం ఏది? బైరాన్‌పల్లి
- తెలంగాణ సాయుధ పోరాటం 1946లో ప్రారంభమైంది.
- 1951 సంవత్సరం వరకు కొనసాగింది.
- కడవెండి గ్రామంలో స్థానిక రైతు నాయకుడు హత్యకు గురికావడంతో తిరుగుబాటు ప్రారంభమైంది.
- ఇది వరంగల్ జిల్లాలో ఉంది.
- నిజాం పాలనలో రెండు రకాల పదవీకాల వ్యవస్థలు ఉండేవి. అవి:రైత్వారీ & జాగీర్దారీలు
తెలంగాణ సాయుధ పోరాటానికి కొన్ని కారణాలు :
- జాగీర్దార్ల వంటి దళారులు రైతుల నుంచి పన్నులు వసూలు చేయడం.
- బడా రైతుల దోపిడీ..
- భాగేలా మొదలైన పేర్లతో పిలువబడే వ్యవస్థ బానిసత్వం.
- తెలంగాణ సాయుధ పోరాటంలో భారత కమ్యూనిస్టు పార్టీ కీలక పాత్ర పోషించింది.
- తెలంగాణ సాయుధ పోరాటంలో బైరాన్‌పల్లి బుర్జ్ కీలక పాత్ర పోషించింది.
- వంతెనపై రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు.
- ఈ విప్లవ సమయంలో సుమారు 100 మంది కమ్యూనిస్టులు అమరులయ్యారు.
- సుమారు 25 మంది రజాకార్లు కూడా మరణించారు.
విశాలాంధ్ర లో ప్రజారాజ్యం రచయిత ఎవరు? పుచ్చలపల్లి సుందరయ్య
- 1946లో పుచ్చలపల్లి సుందరయ్య విజయనగర రాజ్యం గురించి విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకాన్ని వెలువరించారు.
- ఆ పుస్తకంలో హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని, మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతాన్ని కలపడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
- 1911లో కాంగ్రెస్ నేత కొండా వెంకటప్పయ్య విశాలాంధ్ర పటాన్ని రూపొందించారు.
- 1937లో ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య ఆంధ్ర విశ్వవిద్యాలయం వార్షికోత్సవ సంచికలో ఒక వ్యాసంలో నిజాం రాజ్యంలోని తెలంగాణను, ఆంధ్రను విశాలాంధ్రగా, నిజాంను రాజుగా ఏర్పాటు చేయాలని రాశారు.
- 1949 చివర్లో విజయవాడలో జరిగిన సమావేశంలో అయ్యదేవర కాళేశ్వరరావు విశాలాంధ్ర మహాసభల ఏర్పాటుకు పిలుపునిచ్చారు.
- విశాలాంధ్ర ఉద్యమానికి మద్దతిచ్చిన పత్రికలు విశాలాంధ్ర, కాకతీయ, ఆంధ్రజన, ఆంధ్రపత్రిక.
- ఆంధ్ర పత్రిక కృషితో విశాలాంధ్ర ఏర్పడింది.
తెలంగాణలో 2023-24 బడ్జెట్ ప్రతిపాదిత బడ్జెట్ గురించి కింది ప్రకటనలను పరిశీలించండి:
A. ఆసరా పింఛన్లు - రూ.12,000 కోట్లు
B. గృహ మంత్రిత్వ శాఖ - రూ.9,599 కోట్లు
C. పంచాయతీరాజ్ శాఖ - రూ.31,426 కోట్లు
D. నీటిపారుదల రంగం - రూ.26,885 కోట్లు
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు
- ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, 2013" ను లోక్ సభలో ప్రవేశపెట్టారు- 13 ఫిబ్రవరి, 2014
- 2014 జూన్ 2వ తేదీని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా కేంద్రం ప్రకటించింది.- 2 మార్చి, 2014
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు- 9, ఫిబ్రవరి, 2014
- తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర- మార్చి 1, 2014
- 2014 ఫిబ్రవరి 7న కేంద్ర కేబినెట్ తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపింది.
- ఫిబ్రవరి 13, 2014: "ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, 2013"ను కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే లోక్ సభలో ప్రవేశపెట్టారు.
- అదే రోజు బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజ్ గోపాల్ పెప్పర్ స్ప్రే తెరవడంతో గందరగోళం మధ్య లోక్ సభ వాయిదా పడింది.
- పెప్పర్ స్ప్రే కారణంగా ఎంపీ పొన్నం ప్రభాకర్ అస్వస్థతకు గురయ్యారు. ఈ గందరగోళానికి కారణమైన 14 మంది సీమాంధ్ర ఎంపీలను 5 రోజుల పాటు సస్పెండ్ చేశారు.
- తాము విశాలాంధ్రకు మద్దతిస్తున్నామని, బిల్లును వ్యతిరేకిస్తున్నామని సిపిఎం నేత ఏచూరి ప్రకటించారు.
- మార్చి 1, 2014: తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసి, అదే రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించారు.
- రాష్ట్రపతి ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు-2013ను ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014గా మార్చారు.
- 2014 మార్చి 4: 2014 జూన్ 2వ తేదీని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా కేంద్రం ప్రకటించింది.
తెలంగాణను కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు ఏ కమిటీని నియమించారు? శ్రీకృష్ణ కమిటీ / ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులపై సంప్రదింపుల కమిటీ (CCSAP) అని పిలుస్తారు.
- ఈ కమిటీని భారత ప్రభుత్వం 3 ఫిబ్రవరి 2010న ఏర్పాటు చేసింది మరియు దాని నివేదికను 30 డిసెంబర్ 2010న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించింది.
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌తో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న ప్రస్తుత స్థితిని కొనసాగించాలనే డిమాండ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిస్థితిని పరిశీలించడం దీని ప్రధాన లక్ష్యం.
- కమిటీలోని ఇతర సభ్యులలో కొందరు ప్రొఫెసర్ (డా.) రణబీర్ సింగ్, డాక్టర్. అబుసలేహ్ షరీఫ్, రవీందర్ కౌర్|డా. మాజీ హోం సెక్రటరీ వినోద్ కె దుగ్గల్ దాని సభ్య కార్యదర్శిగా కూడా పనిచేశారు.
మక్కా మసీదు, హైదరాబాదు వీరిచే పూర్తీ చేయబడింది : ఔరంగజేబ్
- ముహమ్మద్ కులీ కుతుబ్ షా 1614 లో మక్కా మసీదు నిర్మాణాన్ని ప్రారంభించారు (1693 లో ఔరంగజేబ్ పూర్తి చేశారు) .
- సౌదీ అరేబియాలోని మక్కా నుండి తెచ్చిన మట్టి నుండి ఇటుకలను తయారు చేయాలని ఆదేశించారు.
పాకాల వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది? వరంగల్
- పాకాల వన్యప్రాణుల అభయారణ్యం పాకాల సరస్సు పక్కన ఉంది, ఇది ఒక కృత్రిమ సరస్సు.
- మానవ నిర్మిత పాకాల సరస్సును 13వ శతాబ్దం (క్రీ.శ. 1213) మొదటి దశాబ్దంలో కాకతీయ పాలకుడు గణపతి దేవ నిర్మించాడు
- పాకాల వన్యప్రాణుల అభయారణ్యం పేరు ఆ సరస్సును తవ్విన వ్యక్తి పేరు నుండి వచ్చింది.
- వన్యప్రాణులను లేదా దాని పర్యావరణాన్ని రక్షించడం, ప్రచారం చేయడం లేదా అభివృద్ధి చేయడం కోసం ఆ ప్రాంతాలను అభయారణ్యాలుగా ప్రకటిస్తారు. అభయారణ్యంలో నివసించే వ్యక్తులకు కొన్ని ప్రత్యేక హక్కులు కూడా అనుమతించబడతాయి.
- భారతదేశంలోని వన్యప్రాణుల అభయారణ్యాలు ఐయూసీఎన్ (IUCN) కేటగిరీ IV రక్షిత ప్రాంతాలుగా వర్గీకరించబడ్డాయి.
- ఒక ప్రాంతంలో తగిన పర్యావరణ, భూస్వరూపం మరియు సహజ ప్రాముఖ్యత కలిగి ఉందని భావిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతాలను వన్యప్రాణుల అభయారణ్యాలుగా ప్రకటించేందుకు వన్యప్రాణుల (రక్షణ) చట్టం 1972 అనుమతిస్తుంది.
- తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై సమీపంలోని వేదంతంగల్ పక్షుల అభయారణ్యం అతిపురాతన పక్షి అభయారణ్యం. దీన్ని 1796లో స్థాపించారు.
భారతదేశం యొక్క భౌగోళిక సరిహద్దులలో ఉన్న 552 రాచరిక రాష్ట్రాలలో, 549 భారతదేశంలో చేరాయి మరియు మిగిలిన 3 (హైదరాబాద్, జునాగఢ్ మరియు కాశ్మీర్) భారతదేశంలో చేరడానికి నిరాకరించాయి.
- అయితే, కాలక్రమేణా, వారు పోలీసు చర్య ద్వారా -హైదరాబాద్‌తో, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా జునాఘర్‌తో మరియు ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ద్వారా కాశ్మీర్‌తో కూడా విలీనం చేయబడ్డాయి.
సున్నం మరియు పటిక ఉపయోగించి నీటి నుండి ఫ్లోరైడ్ను తొలగించే సాంకేతికతను ________ అంటారు? నల్గొండ టెక్నిక్.
డాక్టర్ మర్రి చెన్నా రెడ్డిని జూలై 1969 లో నివారణ నిర్భంధ చట్టం కింద అరెస్టు చేసిన తరువాత, ఈ క్రింది మహిళలలో T.P.S (టి.పి.ఎస్) ఆందోళనకు నాయకత్వం వహించారు? సదాలక్ష్మి
- డాక్టర్ మారీ చన్నా రెడ్డి ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు ఈయాన 1978 నుండి 1980 వరకు మరియు 1989 నుండి 1990 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
- టి. ఎన్. సదలక్ష్మి (1928-2004) తెలంగాణకు మొదటి దళిత మహిళా శాసనసభ్యురాలు మరియు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో పాల్గొన్నారు.
నివారణ నిర్భంధం అనేది రాష్ట్రంలో ఒక చట్టబద్ధమైన అధికారం, దీని కింద రాష్ట్రం ఒక వ్యక్తిని అరెస్టు చేయగలరు. అలాంటి వ్యక్తిని ప్రభుత్వం 3 నెలలు మాత్రమే జైలులో ఉంచగలదు. నివారణ నిర్బంధంలో ఒక వ్యక్తిని అరెస్టు చేస్తే, ప్రకరణ 22 (1) మరియు 22 (2) కింద పొందిన అరెస్టు మరియు నిర్బంధానికి వ్యతిరేకంగా రక్షణ పొందే హక్కు అతనికి ఉండదు. ప్రకరణ -19 మరియు ప్రకరణ -21 కింద అందించిన వ్యక్తిగత స్వేచ్ఛలను కూడా వ్యక్తి పొందలేరు.
తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన కింది నిరసనలను అవి జరిగిన కాలక్రమానుసారం అమర్చండి:
పల్లె పల్లె పట్టాల పైకి
మిలియన్ మార్చ్
సకల జనుల సమ్మె ప్రారంభం
సాగర హారం
పల్లె పల్లె పట్టాల పైకి - 1 మార్చి, 2011
మిలియన్ మార్చ్ - 10 మార్చి, 2011
సకల జనుల సమ్మె - 13, సెప్టెంబర్, 2011
సాగర హారం - 30, సెప్టెంబర్, 2012
తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎల్‌బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఎల్‌బీ నగర్ ప్రాంతంలో ఉద్యమానికి నాయకత్వం వహించిందిఎవరు? కాచం సత్యనారాయణ
హైదరాబాద్‌లో ఎవరి ఇంట్లో జరిగిన సభలో ఆంధ్ర జనసంఘం ఏర్పడింది? టేకుమాను రంగారావు
నిజాం సైన్యాధికారి ఇద్రూస్ భారత సైన్యాధికారి జేఎన్ చౌదరి ముందు ఎప్పుడు లొంగిపోయాడు? 1948 సెప్టెంబర్ 17
మహా కూటమి ఎప్పుడు ఏర్పడింది? 2009 జనవరి 31
తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని పార్లమెంటులో ప్రకటించింది ఎవరు? చిదంబరం
204 ప్రభుత్వ శాఖల్లో గిరగ్లానీ కమిటీకి సమాచారం అందించిన శాఖలు ఎన్ని?
52
అంజయ్య తర్వాత ముఖ్యమంత్రి పదవిని అధిష్టించింది ఎవరు? భవనం వెంకట్రామిరెడ్డి
2009లో కేసీఆర్ ఎక్కడి నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యాడు? మహబూబ్‌నగర్
మన్మోహన్‌సింగ్ క్యాబినెట్‌లో కేసీఆర్‌కు రెండోసారి కేటాయించిన శాఖ? కార్మిక, ఉపాధి శాఖ
తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం
- తెలంగాణ అమరవీరుల స్థూపం: 1969 తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి స్మృత్యర్థం(In Memory) గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మించారు
- ఈ స్తూపాన్ని చెక్కిన శిల్పి- ఎక్కా యాదగిరి
- అమరవీరుల స్తూపం అడుగుభాగం నల్ల రాయి తో తయారు చేశారు
- నాలుగు వైపులా 9 చొప్పున చిన్న రంధ్రాలు ఉన్నాయి. ఇది అమరవీరుల శరీరంలో దూసుకుపోయిన బుల్లెట్స్
- స్థూపాన్ని ఎరుపు రాయి తో నిర్మించారు. ఇది త్యాగానికి, సాహసానికి నిదర్శనం
- స్థూపం మధ్య భాగంలో ఒక స్థంభం ఉంటుంది. ఏ వైపు చూసినా దానిపై 9 గీతలు కనిపిస్తాయి. ఇది తొమ్మిది జిల్లాలకు నిదర్శనం
- పై భాగంలో అశోకుని ధర్మచక్రం ఉంటుంది. ఇది ధర్మం, శాంతి, సహనానికి గుర్తు.
తెలంగాణ తల్లి విగ్రహం:
- తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించడంలో ముఖ్య పాత్ర పోషించిన వారు బి ఎన్ రాములు, బి.వి.ఆర్ చారి, ప్రొఫెసర్ గంగాధర్
- పసునూరి దయాకర్ తయారుచేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ భవన్ లో 2007 నవంబర్ 15న కేసీఆర్ ఆవిష్కరించారు
ఈ విగ్రహం ప్రత్యేకతలు
- కిరీటంలో, వడ్డానం లో ప్రసిద్ధి చెందిన కోహినూరు, జాకబ్ వజ్రాలను పోలి ఉంటాయి
- పట్టుచీర - పోచంపల్లి, గద్వాల చీరలకు గుర్తుగా
- కాలి మెట్టెలు - ముత్తయిదువుకు చిహ్నంగా
- వెండి మెట్టలు - కరీంనగర్ ఫిలిగ్రీ ఆభరణాలకు చిహ్నంగా
- చేతిలో మొక్కజొన్న - తెలంగాణ మెట్ట ప్రాంతాలకు గుర్తుగా
- ఇంకో చేతిలో బతుకమ్మ - తెలంగాణ పండుగకు గుర్తుగా
తెలంగాణ జాగృతి:
- తెలంగాణ ప్రాంతంలోని సంస్కృతి, కళా రూపాల, జానపదులు, సాహిత్యం, తెలంగాణ ప్రాంతం మాండలికం మొదలైనవి పరిరక్షించడానికి తెలంగాణ జాగృతి సాంఘిక-సాంస్కృతిక సంస్థ 2008 జూన్ లో ఏర్పడింది
- దీనిని కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసింది.
- పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించడానికి తెలంగాణ జాగృతి బతుకమ్మ పండుగ ఉత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది
- తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాల్లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించి, వాటికి విశిష్ట ముగింపుగా హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ పై లక్షలాది మంది ప్రజలతో బతుకమ్మ పండుగ జరిపి సాంస్కృతిక కవాతు నిర్వహిస్తారు.
తెలంగాణ సాంస్కృతిక సారథి
- తెలంగాణ సాంస్కృతిక సారథి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్ధ. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సాంస్కృతిక కళాకారులకు గుర్తింపును ఉపాధిని కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అందులోభాగంగా 550 మంది కళాకారులతో తెలంగాణ సాంస్కృతిక సారథిని 2014 సెప్టెంబర్ 30న ప్రభుత్వం ఏర్పాటు చేసింది
- సాంస్కృతిక సారథికి క్యాబినెట్ హోదా కల్పించారు
- తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గా మానకొండూర్ ఎమ్మెల్యే, ప్రముఖ కళాకారుడు ఏర్పుల (రసమయి) బాలకిషన్ ను ప్రభుత్వం నియమించింది. రసమయి బాలకిషన్‌ను తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా నియమిస్తూ 13 జులై 2021న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన హైదరాబాద్‌లోని సాంస్కృతిక సారథిభవన్‌లో 19 జులై 2021న చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు
కాసు బ్రహ్మానందరెడ్డి 1969 ఉద్యమ సమయంలో అఖిలపక్ష సమావేశం [All Party Accord] ఏ తేదీన నిర్వహించాడు? 1969 జనవరి 19న.
- ఉద్యమం వేడి తగ్గియ్యడానికి ఒక అఖిలపక్ష సమావేశం[ఆల్ పార్టీ అకార్డ్] ఏర్పాటు చేశాడు. దీనిలో ముఖ్యంగా 1) ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగుల లెక్క తేల్చడం, 2) తెలంగాణ మిగులు నిధుల లెక్క తేల్చడం అనే విషయాలపైన చర్చించారు.
అలంపూర్ ఏ నది ఒడ్డున ఉన్నది? తుంగభద్ర
Jogulamba temple is a Hindu temple dedicated to Goddess Jogulamba, a form of Shakti located in Alampur, Telangana, India. The temple is one of the Maha Shakti Peethas, a group of eighteen (Ashtadasa) temples considered the most significant shrines and pilgrimage destinations in Shaktism. Alampur is located on the banks of the Tungabhadra river near its confluence with Krishna river. Jogulamba temple is located in the same complex as that of the Navabrahma Temples, a group of nine Shiva temples built in the seventh-eighth century CE.
చిత్తారమ్మ జాతర’ ఏ ప్రాంతంలో జరుపుతారు? గాజుల రామారం, హైదరాబాద్
ఫ్లోరింగ్, పై కప్పులకు ఉపయోగపడే భీమా గ్రూప్ సున్నపురాయి రాష్ట్రంలో ఎక్కడ
లభిస్తుంది? తాండూర్, వికారాబాద్ జిల్లా
మన్నెంకొండ క్షేత్ర ప్రధాన దేవుడు? వేంకటేశ్వరస్వామి
తెలంగాణకి ఏ రాష్ట్రాలతో సరిహద్దు కలదు? ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్
మా-సాహెబ్ ట్యాంక్‌ను నిర్మించింది ఎవరు? హయత్ భక్ష్ బేగం
కింది వాటిలో సరైనది గుర్తించండి?
1) చౌమొహల్లా ప్యాలెస్ (హైదరాబాద్)- లాడ్‌బజార్
2) రామప్ప దేవాలయం- పాలంపేట గ్రామం
3) ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని నిర్మించినది- సూరితి అప్పయ్య
All are correct
ఎంకే వెల్లోడి ఏ రాష్ట్రానికి చెందిన ఐసీఎస్ అధికారి? కేరళ
జిల్లా కలెక్టర్లను తొలగించి, వారి స్థానంలో ఆంధ్రా అధికారులను చీఫ్ అడ్మినిస్ట్రేటర్ల పేరుతో నియమించింది? ఎంకే వెల్లోడి, కేరళ
హైదరాబాద్ రాష్ట్రంలో పౌర ప్రభుత్వం ఏర్పడి నిజాం ‘కానిస్టిట్యూషనల్ నీడ్’గా ఉన్నాడని UNOలో ప్రకటించింది? రామస్వామి మొదలియార్
హైదరాబాద్ రాజ్యంలో నియమితులైన ఆంధ్రా అధికారుల లంచగొండితనాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించింది?పద్మజానాయుడు
హైదరాబాద్ రాజ్యంలో వెల్లోడి పౌరపరిపాలన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? 1950, జనవరి 1-1952, జనవరి 31
జేఎన్ చౌధరి మిలిటరీ పాలనలో చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసింది? డీఎస్ బాక్లే
- తెలంగాణ ఉద్యమానికి ఖమ్మం జిల్లా పాల్వంచ వేదికయ్యింది. కొత్తగూడెం థర్మల్‌పవర్ స్టేషన్[KTPS]లో తెలంగాణ ప్రాంతం వారిని కాకుండా ఆంధ్రకు చెందిన ఉద్యోగులను ఎక్కువ మందిని తీసుకున్నారు. ఈ అన్యాయాన్ని నిలదీసిన ఖమ్మం జిల్లా ఇల్లెందు వాసి? రామదాసు [200/1200 TG 130 contract, 70 regular where as all 1000 regular jobs are for Seemandhra residents]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుచ్ఛక్తి బోర్డులో గల ఉద్యోగాలు తెలంగాణ రక్షణల కిందకు, ముల్కీ నిబంధనల కిందకు రావని హైకోర్టు తీర్పు ఇచ్చింది. 1968 జూలై 10ని ‘తెలంగాణ పరిరక్షణ దినం’గా పాటించారు.
ఖమ్మం జిల్లాలోని గాంధీచౌక్ వద్ద రవీంద్రనాథ్ అనే విద్యార్థి నిరవధిక దీక్షను ఎప్పుడు ప్రారంభించారు? జనవరి 8, 1969
ఖమ్మం జిల్లాలోని గాంధీచౌక్ వద్ద నిరవధిక దీక్షను జనవరి 8, 1969న ప్రారంభించిన విధ్యార్థి నాయకుడు? రవీంద్రనాథ్
తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి ఎప్పుడు ఏర్పాటయ్యింది? జనవరి 13, 1969 [జనవరి 15 నుంచి సమ్మె చేయాలని నిర్ణయించారు]
హైదరాబాద్‌లో తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి ఏర్పడినాక కొందరు ప్రముఖులు సమావేశమై, "తెలంగాణ పరిరక్షణల కమిటీని" ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకున్నారు? కాటం లక్ష్మీనారాయణ
1969 జనవరిలో జరిగిన వరుస సంఘటనల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తాత్కాలికంగా వేడిని తగ్గించడానికి అఖిలపక్ష సమావేశం ఏ తేదీన నిర్వహించాడు? 1969 జనవరి 18, 19న [?]
జనవరి 18, 19 అఖిలపక్ష సమావేశం యొక్క ఫలితం జీవో 36. ఈ జీవో 36ను ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేసింది? జనవరి 21, 1969
జీవో 36 యొక్క సారాంశం?
- ఫిబ్రవరి 28 లోపు నాన్‌ముల్కీలను వెనక్కి పంపుతామని ప్రభుత్వం జీవో 36లో స్పష్టంగా చెప్పింది [సీఎం బ్రహ్మానందరెడ్డి ప్రోత్సాహంతో 1969 జనవరి 31న జీవో 36కు వ్యతిరేకంగా హైకోర్టులో తెలంగాణ ఉద్యోగినులు రిట్ దాఖలు చేశారు. తమ భర్తలు ఆంధ్రోళ్లని, జీవో 36ను అమలు చేస్తే తమ కుటుంబాలు ఇబ్బంది పడతాయని వాదించారు]
జీవో 36కి వ్యతిరేకంగా తెలంగాణా ఉద్యోగినులు హైకోర్ట్‌లో రిట్ దాఖలు చేసిన నేపథ్యంలో, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ "కుమార్ లలిత్" కమిటీ. ఈ కమిటీ ప్రకారం ఎంత మంది ఆంధ్ర ఉద్యోగులు ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో పనిచేస్తున్నారని అదే నెల మార్చిలో రిపోర్ట్ ఇచ్చింది? 4500 మంది
జీవో 36 రాజ్యాంగ విరుద్ధమని చెప్పిన హైకోర్ట్ తీర్పు ఎప్పుడు వెలుబడింది? ఫిబ్రవరి 3, 1969
సుప్రీంకోర్టు జీవో 36 అమలు నిలిపేయాలని స్టే ఇస్తూ ఎప్పుడు తీర్పు ఇచ్చింది? ఫిబ్రవరి 18, 1969
[హైకోర్ట్ తీర్పు తర్వాత సరిగ్గా 15 రోజుల తర్వాత ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టు జీవో 36 అమలు నిలిపేయాలని స్టే ఇచ్చింది]
ముల్కీ నిబంధనలు రాజ్యాంగ సమ్మతమే అని హైకోర్ట్ మరో తీర్పు తెలంగాణకి అనుకూలంగా ఎప్పుడు ఇచ్చింది? 20 ఫిబ్రవరి, 1969న [ఫిబ్రవరి 18న సుప్రీం కోర్ట్ జీవో 36 పైన స్టే ఇచ్చిన 2 రోజుల తర్వాత ఈ తీర్పు వచ్చింది. అయితే అక్రమంగా తెలంగాణలో ఉద్యోగాల్లో చేరిన ఆంధ్ర ఉద్యోగులను వెనుకకు పంపొద్దని ఆ పోస్టులకు సమానంగా తెలంగాణ కోసం సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలని ఆదేశించింది]
విద్యార్థి నాయకుడు రవీంద్రనాథ్ ఎన్ని రోజులు దీక్ష చేశాడు? 17 రోజులు
దీక్ష చేపట్టిన రవీంద్రనాథ్ ఆరోగ్యం క్షీణించడంతో 17 రోజుల తర్వాత ఎవరి చొరవతో దీక్ష విరమించాడు? వెంకట హైమారెడ్డి
జనవరి 24న సదాశివపేటలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడి చనిపోయిన యువకుడు? శంకర్
సదాశివపేటలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన కాల్పులలో యువకుడు శంకర్ చనిపోయాడు. ఇది తొలిదశ ఉద్యమంలో మొదటి ప్రాణ త్యాగం. ఇది ఏ తేదీన జరిగింది? జనవరి 24, 1969న
మదన్‌మోహన్ అధ్యక్షుడిగా తెలంగాణ ప్రజా సమితి ఎప్పుడు ఏర్పడింది? 1969 ఫిబ్రవరి 28న
1969 ఫిబ్రవరి 28న ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితికి అధ్యక్షుడిగా ఎవర్ని ఎన్నుకున్నారు? మదన్‌మోహన్
1969 మార్చి 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్‌లో జరిగిన సమావేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరించించింది? T పురుషోత్తమరావు
1969 మార్చి 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో ఎక్కడ జరిగిన సమావేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ చిత్రపటాన్ని టీ పురుషోత్తమరావు ఆవిష్కరించించారు? రెడ్డి హాస్టల్‌లో
వాంఛూ అధ్యక్షతన కమిటీని వేసింది ఎవరి ప్రభుత్వం? కాసు బ్రహ్మానదరెడ్డి ప్రభుత్వం [1964-71]. [1969 మార్చి 28న సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణవాదులు అసహనానికి గురయ్యారు.
- ఆ రోజే బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం వాంఛూ అధ్యక్షతన కమిటీని వేసింది.
- అదే రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
- ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని ఏర్పాటు చేశారు]
ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని ఏర్పాటు చేసింది? కొండా లక్ష్మణ్ బాపు [1969 మార్చి 29]
తెలంగాణ ఉద్యమం 1969లో, మొదటగా వేయబడ్డ కమీషన్? కుమార్ లలిత్ కమిటీ
ముల్కీ నిబంధనలని సుప్రీంకోర్ట్ మార్చి 28, 1969లో కొట్టి వేసిన సందర్భంగా కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం, ముల్కీ అమలు సాధ్యాసాధ్యాలపైన వేసిన కమిటీ? వాంఛూ కమిటీ
కుమార్ లలిత్ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై విచారణకు కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం ఏ కమిటీని 1969, ఏప్రిల్‌లో నియమించింది? జస్టిస్ భార్గవ కమిటీ [ కమిటీల మీద కమిటీలు తెలంగాణ ప్రజలకు ఆగ్రహం కలిగించాయి. ఉద్యమం ఊపందుకుంది. విద్యార్థులు, ఉద్యోగులు ఉద్యమంలోకి వచ్చారు]
కుమార్ లలిత్ కమిటీ>వాంఛూ కమిటీ >జస్టిస్ భార్గవ కమిటీ [
1969లో ఏప్రిల్ 11లోగా తెలంగాణ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టినది? ఆదిరాజు వెంకటేశ్వరరావు
1969 ఏప్రిల్‌లో తెలంగాణవాదులకు, కమ్యూనిస్టులకు[రాష్ట్ర సమైక్యతను కోరుతూనే తెలంగాణ రక్షణలు అమలు చేయాలని డిమాండ్ చేసింది] మధ్య గొడవ జరిగినపుడు పోలీసులు లాఠీచార్జి చేస్తే 27 మందికి దెబ్బలు తగిలాయి. తెలంగాణవాదులను పీడీ యాక్టు కింద అరెస్టు చేశారు. తెలంగాణవాదుల అరెస్టులకు నిరసనగా హైదరాబాద్‌లో సామూహిక సత్యాగ్రహం చేపట్టారు. ఇందులో పాల్గొన్నవారు?
అచ్యుతరెడ్డి, టీ-అంజయ్య, మాణిక్‌రావు, హషీమ్ [వీరిని పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ఉద్యమం మరింత తీవ్రమైంది. ఉద్యమ తీవ్రత ఢిల్లీకి చేరింది]
8 సూత్ర పథకం ఎప్పుడు ప్రకటించబడింది? ఏప్రిల్ 12న [1969]
అష్టసూత్రాలు ఏవి?
1) ఆంధ్ర ప్రాంతానికి తరలించిన తెలంగాణ మిగులు నిధుల లెక్కలు తీయడానికి ఉన్నతాధికారి సంఘం ఏర్పాటు.
2) కోల్పోయిన తెలంగాణ నిధులు సమకూర్చాలి.
3) తెలంగాణప్రాంత అభివృద్ధికి సీఎం అధ్యక్షతన ప్రణాళికలు రూపొందించాలి.
4) ప్రణాళిక సంఘం సలహాదారు అధ్యక్షతన అధికారుల కమిటీ ఏర్పాటు.
5) కమిటీలో అధికారులకు ఎక్కువ అధికారాలను ఇచ్చారు.
6) తెలంగాణలో ఉద్యోగాలు స్థానికులకే చెందాలి.
7) తెలంగాణ ఉద్యోగుల సర్వీస్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారం.
8) తెలంగాణ అభివృద్ధికి కేంద్రం శ్రద్ధ వహిస్తుంది
మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ నాయకుడిగా ప్రత్యేక తెలంగాణను సమర్థిస్తూ ప్రకటన చేసి ఉద్యమంలోకి వచ్చింది ఏ రోజు? ఏప్రిల్ 21, 1969 [తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడు మదన్‌మోహన్ పదవి నుంచి తప్పుకోవడంతో 1969 మే 22న అధ్యక్షుడిగా మర్రి చెన్నారెడ్డి ఎన్నికయ్యాడు]
1969 మే 25న జరిగిన ఒక బహిరంగ సభలో సీఎం బ్రహ్మానందరెడ్డి ప్రసంగం ఉద్రేకాలను రెచ్చగొట్టింది. సీఎం తిరిగి హైదరాబాద్ వస్తుంటే అడుగడుగునా నిరసన తెలిపారు. ఆ రోజు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. ఇది ఎక్కడ జరిగింది? మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలులో
1969లో తెలంగాణ ప్రజాసమితి నిరసనగా సామూహిక సత్యాగ్రహాలు కొనసాగించింది. కారణం? మే 26న కాల్పులకు నిరసనగా [ఇదే సందర్భంలో కాసు బ్రహ్మానందరెడ్డి ఎన్జీవో నాయకుడు ఆమోస్‌ను డిస్మిస్ చేసి ఉపాధ్యాయ సంఘాన్ని రద్దు చేశాడు. ప్రభుత్వం సమ్మెలను నిషేధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ సందర్భంలో చంచల్‌గూడ జైల్లో సత్యాగ్రహ ఖైదీలకు ఆంధ్రా ఖైదీలకు గొడవ జరిగింది. సత్యాగ్రహ ఖైదీలను పరామర్శించడానికెళ్లిన తెలంగాణ సమితి నాయకులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ వార్త తెలంగాణ అంతటా వ్యాపించింది]
1969 మే 1న [మే-డే] పోలీసులు లాఠీచార్జి చేశారు. పోలీసులు కాల్పులు జరిపితే 20 మంది ఉద్యమకారులు చనిపోయారు. ఈ సంఘటన ఏ సందర్భంలో? గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించడానికెళ్లిన సందర్భంలో జరిగినాయి.
ప్రభుత్వ దమనకాండకు నిరసనగా తొలిదశ ఉద్యమంలో తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ సంపూర్ణంగా జరిగింది. ఇది ఏ తేదీన ఇచ్చారు? 1969 జూన్ 2న [తెలంగాణా ఫార్మేషన్ డే]
1969 జూన్ 3ను ఏ దినంగా జరపాలని తెలంగాణ ప్రజాసమితి నిర్ణయించింది? గూండాయిజం వ్యతిరేక దినం
తొలిదశ ఉద్యమ సమయంలో ఒకనాడు హైదరాబాద్ యుద్ధభూమిగా మారింది. పోలీసులు అనేకచోట్ల కాల్పులు జరిపారు. అనేకమంది తెలంగాణవాదులు చనిపోయారు. హైదరాబాద్ నగరమంతా కర్ఫ్యూ విధించారు. ఆ రోజు సాయంత్రం ప్రధాని ఇందిరాగాంధీ విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు. అధికారులు, తెలంగాణ నాయకులతో ప్రధాని పరిస్థితిని సమీక్షించారు. ఇది ఏ రోజు జరిగిన సంఘటన? జూన్ 4, 1969 [గూండాయిజం వ్యతిరేక దినం తెల్లవారి]
1969 ఉద్యమకాలంలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మె ఎప్పుడు ప్రారంభించారు? జూన్ 7 [ఎన్జీవోలు 1969 జూన్ 11 నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించారు. సమ్మె చరిత్రాత్మకంగా 35 రోజులు కొనసాగింది. కేంద్రం స్పందించకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ప్రజాసమితి నిర్ణయించింది. సత్యాగ్రహాలు, సహాయ నిరాకరణ చేయాలని, ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని నిర్ణయించారు]
1969 జూన్ 7 న విద్యుత్ ఉద్యోగులతో మొదలై, ఎన్జీవోలు కూడా పాల్గొనడంతో ఎన్ని రోజులు చారిత్రాత్మకంగా సమ్మె జరిగింది? 45 రోజులు
1971లో లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి పార్టీ ఎన్ని MP సీట్స్ గెలుచుకున్నది? 10/17
తెలంగాణ ప్రజాసమితి పార్టీని ఏ పార్టీలో విలీనం చేశారు? కాంగ్రెస్‌లో [లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో గెలిచి 6 నెలలు దాటకముందే తెలంగాణ ప్రజాసమితి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. దీంతో తెలంగాణవాదుల్లో అసంతృప్తి రగిలింది. దీన్ని చల్లార్చడానికి ఇందిరాగాంధీ 5 సూత్ర పథకం రూపొందించారు]
5 సూత్రాల పథకం ఏ సంవత్సరంలో ప్రకటించారు? 1971 [తెలంగాణ ప్రజా సమితి కాంగ్రెస్‌లో విలీనం అయ్యక, తెలంగాణ ప్రజల కోపం చల్లర్చడానికి]
8>5>6
పంచసూత్ర పథకం -1971:
1) ముల్కీ నిబంధనలు తెలంగాణ ప్రాంతంలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు, తహసీల్దార్, అసిస్టెంట్ సర్జన్, జూనియర్ ఇంజినీర్ పదవులకు వర్తిస్తాయని పేర్కొన్నారు.
2) ముల్కీ రక్షణలు హైదరాబాద్‌కు 1977 వరకు, తెలంగాణ ప్రాంత జిల్లాలకు 1980 వరకు అమలవుతాయని చెప్పారు.
3) ఉద్యోగాల్లో ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
4) సాంకేతిక, వృత్తిపరమైన విద్యాలయాల్లో తెలంగాణవారు అదనంగా కొన్ని స్థానాలు పొందడం.
5) జంటనగరాల్లో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల పోలీసులు ఉంటారు. ఇది నామమాత్రపు పథకంగానే మిగిలింది. అసలు ఈ పథకం అమల్లోకే రాలేదు.
పీవీ నర్సింహారావుకు సీఎం బాధ్యతలు స్వీకరించింది ఎప్పుడు? 1971 సెప్టెంబర్ 30న
1972 ఉద్యమ సమయంలో హైకోర్టు ముల్కీ నిబంధనలు చెల్లవని తీర్పునిచ్చింది. ఈ తీర్పు ఎప్పుడొచ్చింది? ఫిబ్రవరి 14న [సీఎం పీవీ నర్సింహారావు తెలంగాణ రక్షణలను కాపాడాలని సంకల్పించి హైకోర్టు తీర్పును తిరిగి పరిశీలించాలని ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టుకు పంపాడు]
ముల్కీ నిబంధనలకి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును ప్రకటించిన తేదీ? అక్టోబర్ 3, 1972
ఇందిరాగాంధీ సూచన మేరకు ఏ తేదీన పీవీ నర్సింహారావు సీఎం పదవికి రాజీనామా చేశారు? జనవరి 11, 1973
ఆంధ్రావాళ్లను సంతృప్తిపర్చడానికి ఇందిరాగాంధీ ఏ తేదీన 6 సూత్రాల పథకం ప్రకటించారు? సెప్టెంబర్ 21, 1973
610 జీవో ప్రకారం 1976 అక్టోబర్ 18 నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా 5, 6 జోన్లలో నియమితులైన వారిని ఏ తేదీ నాటికి వెనుకకు పంపి వారి స్థానంలో తెలంగాణవారిని నియమించాలి? 1986 మార్చి 31
తెలంగాణ జనసభ ఎప్పుడు ఆవిర్భవించింది? 1998
- ప్రత్యేక రాష్ట్రం కోసం 1997లో గాదె ఇన్నయ్య ‘తెలంగాణ ప్రజాపార్టీ’ని స్థాపించారు. ఈ సమయంలో వచ్చిన లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో తెలంగాణ ప్రజా పార్టీ తెలంగాణ వాదంతో పోటీచేసినా ఓడిపోయింది. ఈ ఓటమితో నిరాశ చెందిన ప్రజాసంఘాల నాయకులు రాజకీయాలకు, ఎన్నికలకు అతీతంగా తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టాలని భావించారు. అలా భావించినవారిలో ఆకుల భూమయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రాణా ప్రతాప్ ఫంక్షన్ హాలులో 1998, జూలై 5, 6 తేదీల్లో సదస్సును నిర్వహించారు.
- ఈ సమావేశానికి హాజరైన ఉపాధ్యాయులు, లాయర్లు, జర్నలిస్టులు, ఇతర తెలంగాణ ఉద్యమకారులు కలిసి సదస్సు రెండోరోజున తెలంగాణ జనసభను ఏర్పాటు చేశారు.
- తెలంగాణ జనసభ అంబర్‌పేటలో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభ ఆహ్వాన సంఘానికి అధ్యక్షుడు ఎంటీ ఖాన్. ఈ సభలోనే ‘జన తెలంగాణ’ మాస పత్రిక కాళోజీ నారాయణ రావు ఆవిష్కరించారు.
- ఈ మాసపత్రిక ఆవిష్కరణ అనంతరం కాళోజీ మాట్లాడుతూ తెలంగాణ వనరులను కొల్లగొడుతున్న కోస్తాంధ్ర పాలక వర్గాలకు ‘క్విట్ తెలంగాణ’ అనే నినాదాన్నిచ్చారు.
కాళోజీ ‘క్విట్ తెలంగాణ’ అనే నినాదాన్ని ఏ సందర్భంగా ఇచ్చారు? తెలంగాణ జనసభ అంబర్‌పేటలో నిర్వహించిన బహిరంగ సభలో
- ఈ తెలంగాణ జనసభకు అనుబంధంగా జహంగీర్ కన్వీనర్‌గా ‘తెలంగాణ కళాసమితి’ ఏర్పడింది. ఈ తెలంగాణ కళాసమితి కో కన్వీనర్‌గా ఉన్న బెల్లి లలితను కొంతమంది దుండగులు 1999, మేలో భువనగిరిలో హత్య చేశారు.
1987లో తెలంగాణ ప్రజా సమితి మళ్లీ ఆవిర్భవించింది. ఈసారి ఎవరి అధ్యక్షతన ప్రాణం పోసుకుంది? భూపతి కృష్ణమూర్తి-వరంగల్
భూపతి కృష్ణమూర్తి అధ్యక్షతన మళ్లీ ప్రాణం పోసుకుని తెలంగాణ ప్రజా సమితి ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది? 1987
1990లో ఏర్పడ్డ తెలంగాణ ఫోరంకి కన్వీనర్‌గా ఎన్నిక అయ్యింది? జానారెడ్డి
టీడీపీ నుంచి పటోళ్ల ఇంద్రారెడ్డి బయటకు వచ్చి 1997లో పెట్టిన పార్టీ? జై తెలంగాణ
1997లో జై తెలంగాణ పార్టీ పెట్టిన పటోళ్ల ఇంద్రారెడ్డి, ఏ పార్టీ నుండి విడిపోయాక ఏ పార్టీ స్థాపించాడు? తెలుగుదేశం పార్టీ
ఏ సంవత్సరంలో పటోళ్ల ఇంద్రారెడ్డి అధ్యక్షతన జై తెలంగాణ పార్టీ ఆవిర్భవించింది? 1997లో [కొద్ది రోజులకే ఇంద్రారెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు]
1998 మార్చిలో లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ ఎన్ని పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది? 12 [టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చింది]
1997 చివరలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని ఎవరు ప్రకటించారు? అటల్ బిహారీ వాజ్‌పేయి
1998లో చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బీజేపీ అనుకూలమని ఏ సభలో తీర్మానం చేసింది? కాకినాడ సభలో
1999లో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు.
బీజేపీ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ తో పాటూ ఏ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది? తెలంగాణ [తెలంగాణ ఏర్పాటు ఆలోచనను మానుకోవాలని బీజేపీని చంద్రబాబు బ్లాక్‌మెయిల్ చేసి రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారు]
సోనియాగాంధీకి 38 మంది కాంగ్రెస్ నాయకులతో తెలంగాణ ఏర్పాటు గురించి వినతిపత్రం సమర్పించింది? YSR
1999లో ఏర్పడ్డ తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి కన్వీనర్‌గా ఏర్పాటయ్యింది ఎవరు? చిన్నారెడ్డి
6 సూత్రాల్లోని ఎన్నవ సూత్రం ప్రకారం రాజ్యాంగ సవరణ చేసి 371d అధికరణం చేర్చారు? 5వ సూత్రం [5వ సూత్రం: ఫిర్యాదులను పరిష్కరించే రీతిలో రాజ్యాంగ సవరణ అవసరమైతే ఆ అధికారం రాష్ట్రపతికి ఉండాలి]
6వ సూత్రం ఆధారంగా చేయబడ్డ 371d 36వ సవరణని చట్టబద్ధమైనదిగా ధృవీకరిస్తూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎప్పుడు విడుదల అయ్యింది? 1975 అక్టోబర్ 18న [ఈ ఉత్తర్వులను అనుసరించి రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించారు. ఆంధ్రప్రాంతాన్ని 1, 2, 3 జోన్లుగా, రాయలసీమను 4వ జోన్‌గా, తెలంగాణను 5, 6 జోన్లుగా విభజించారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌తో ఆంధ్రలో ఉద్యమం చల్లారింది]
6 సూత్రాలలోని ఎన్నవ సూత్రం ప్రకారం ముల్కీ నిబంధనలు, ప్రాంతీయ కమిటీ రద్దు అవుతాయి? 6వ సూత్రం
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన ఎప్పుడు ఎత్తివేసింది? 1973 డిసెంబర్ 10న
1973 డిసెంబర్ 10న రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన తర్వాత కొత్త సీఎంగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? జలగం వెంగళరావు
మర్రి చెన్నారెడ్డికి ఇందిరాగాంధీ సీఎం బాధ్యతలు ఎప్పుడు అప్పగించారు? 1978లో
1980 అక్టోబర్ 11న సీఎం గా ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు? టంగుటూరి అంజయ్య [1982లో భవనం వెంకట్రామ్‌కు సీఎం పదవిని కట్టబెట్టారు]
[CMs from 1973]
జలగం వెంగళరావు> మర్రి చెన్నారెడ్డి> T అంజయ్య> భవనం వెంకట్రామ్
నీలం 1956-60
దామోదరం 1960-62
నీలం 1962-64
కాసు బ్రహ్మానందరెడ్డి - 1964-71 [1969 Movement]
పీవీ నరసింహారావు [మంథని నియోజకవర్గం] 1971-73
రాష్ట్రపతి పాలన 1973 జనవరి- 1973 డిసెంబర్
జలగం వెంగళరావు 1973- 78
మర్రి చెన్నారెడ్డి [మేడ్చల్ నియోజకవర్గం] -1978-1980[అక్టోబర్]
టి.అంజయ్య 1980-82 MLC
భవనం వెంకటరామిరెడ్డి 1982-82
కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1982-83
ఎంటీఆర్- 1983-84
జయభారత్‌రెడ్డి నాయకత్వాన 3 IAS అధికారులతో ఒక కమిటీని[Officers Committee] 1984లో నియమించిన సీఎం? ఎన్.టీ రామారావు
రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఎన్ని వేల మంది స్థానికేతరులు ఉద్యోగాల్లో ఉన్నట్టు జయభారత్‌రెడ్డి కమిటీ తేల్చింది? 59 వేలు
సుందరేశన్‌తో ఏకసభ్య కమిటీని నియమించినది? ఎన్.టీ రామారావు
సుందరేశన్‌తో ఏకసభ్య కమిటీని ఎందుకు వేసారు? జయభారత్ కమిటీ రిపోర్ట్‌లోని నిజాలు తేల్చడానికి
జయభారత్‌రెడ్డి కమిటీ> సుందరేశన్ కమిటీ> గిర్‌గ్లానీ కమిటీ
ఏ కమిటీ సిఫారసులతో రామారావు ప్రభుత్వం 1985 డిసెంబర్ 30న జీవో 610ని జారీచేసి, 1986 మార్చి 31లోపు ఈ జీవో అమలు కావాలని పేర్కొన్నది? సుందరేశన్ ఏకసభ్య కమిటీ
సుందరేశన్ కమిటీ సిఫారసులతో వచ్చిన జీవో 610 అమలును పరిశీలించడానికి 2001 జూన్ 5న ఏ కమిటీఎని ప్రభుత్వం నియమించింది? జీఎం గిర్‌గ్లానీ కమిటీ
జయభారత్‌రెడ్డి కమిటీ> సుందరేశన్ కమిటీ> గిర్‌గ్లానీ కమిటీ
గిర్‌గ్లానీ కమిటీ ఎప్పుడు ఏర్పడ్డది? జూన్ 5, 2001 [2001 అక్టోబర్ 6న గిర్‌గ్లానీ కమిటీ ప్రభుత్వానికి తొలి నివేదిక[మధ్యంతర] అందజేసింది] [తుది నివేదికను 2004 సెప్టెంబర్ 30న ప్రభుత్వానికి అందజేసింది]
1975 నుంచి 2001 మధ్యన ఎన్ని రకాల ఉల్లంఘనలు జరిగాయని కమీషన్ పేర్కొన్నది? 18 రకాలుగా [126 విషయాల్లో ఉల్లంఘనలు జరిగాయని కమిటీ ప్రకటించింది]
1988లో ప్రొ.హరనాథ్ నేతృత్వంలో తెలంగాణ జాగృతి పేరుతో తీసిన డాక్యుమెంటరీ? పర్‌స్పెక్టివ్స్ ఆన్ తెలంగాణ
1988లో ఎవరి నేతృత్వంలో తెలంగాణ జాగృతి పేరుతో పర్‌స్పెక్టివ్స్ ఆన్ తెలంగాణ అనే డాక్యుమెంటరీని తీసారు ? ప్రొ.హరనాథ్
1988లో ప్రొ.హరనాథ్ నేతృత్వంలో ఏ పేరుతో పర్‌స్పెక్టివ్స్ ఆన్ తెలంగాణ అనే డాక్యుమెంటరీని నిర్మించారు? తెలంగాణ జాగృతి
1989లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడింది? టి.ప్రభాకర్
ఏ సంవత్సరంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను బయటపెట్టేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు ఏర్పాటు చేశారు? 1989లో
1989లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను బయటపెట్టేందుకు ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. దాని పేరు? తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు-TIT
1997లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎవరి అధ్యక్ష్తన జరిగిన సెమినార్ మలిదశ ఉద్యమానికి బీజాలు వేసింది? ప్రొఫెసర్ జి.లక్ష్మణ్ [ఆ సెమినార్‌లో తెలంగాణకు సంబంధించిన అనేక సమస్యలను విభిన్న కోణాల్లో విశ్లేషించారు. అది ఒక రకంగా బుద్ధి జీవుల ఆలోచనల్లో మంటలు రేపింది]
1990లో ఏ జిల్లాలో జరిగిన రైతు కూలీ సంఘం సభ ఆ నాటికి దేశంలోనే అతి పెద్ద సభగా రికార్డయ్యింది? వరంగల్‌లో [అన్నం రాశులు పోసి నిర్వాహకులు ఈ సభను నిర్వహించారు. వరంగల్‌లో జరిగిన రైతు కూలీ సంఘం మహాసభకు 20 లక్షల దాకా జనం వచ్చారనే అంచనాలున్నాయి]
1988 ఆగస్టు నెలలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ (TSF) ఏర్పడింది. దీనికి కన్వీనర్‌గా ఎవరిని ఎన్నుకున్నారు? కిషోర్‌రెడ్డిని
1996 ఆగస్టు 15న ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన అప్పటి ప్రధానమంత్రి? దేవగౌడ
1996 నవంబర్ 1న విద్రోహదిన సభ వరంగల్‌లో ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? భూపతి కృష్ణమూర్తి, జయశంకర్
1997 జనవరిలో హైదరాబాద్ జాంబాగ్‌లోని అశోక టాకీస్‌లో జరిగిన సభలో గద్దర్ పాడిన పాట? అమ్మా తెలంగాణమా [పాట కొన్ని చరణాలను పాడారు]
1997 జనవరిలో హైదరాబాద్ లో ఎక్కడ జరిగిన సభలో గద్దర్ అమ్మా తెలంగాణమా అన్న పాట మొదటిసారిగా పాడారు? జాంబాగ్‌లోని అశోక టాకీస్‌లో
గద్దర్ జయశంకర్‌తో చర్చల అనంతరం, "అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా" అన్న పాటను పూర్తిగా రాసి ఏ సభలో పాడారు? భువనగిరి సభలో
నందిని సిధారెడ్డి రాసిన "నాగేటి సాళ్లల్ల నా తెలంగాణ" అన్న పాటను తొలిసారిగా షేక్ బాబా, దేశపతి శ్రీనివాస్‌లు కలిసి ఎక్కడ పాడారు? 1997 ఆగస్టు 17న సిద్దిపేటలో మంజీరా రచయితల సంఘం ఏర్పాటు చేసిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సదస్సులో
1996లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించబోతున్నట్లు ప్రకటించిన పీపుల్స్‌వార్ అగ్రనేత? నల్లా ఆదిరెడ్డి
తెలంగాణ మహాసభ ఎవరి నేతృత్వంలో ఆవిర్భవించింది? మారోజు వీరన్న [1997 ఆగస్టు 11న నల్లగొండ జిల్లా, సూర్యాపేటలో 30 వేల మంది సమక్షంలో ఆవిర్భవించింది] [మారోజు వీరన్న ఎన్‌కౌంటర్‌కి గురయ్యారు]
1997 అక్టోబర్ 28న జయశంకర్, కేశవరావ్ జాదవ్‌ల నేతృత్వంలో 28 సంస్థలు కలిసి ఏర్పడిన సంస్థ? తెలంగాణ ఐక్య వేదిక [1997లోనే మాజీ హోంమంత్రి P. ఇంద్రారెడ్డి నేతృత్వంలో జై తెలంగాణ పార్టీ ఏర్పడింది]
1997 అక్టోబర్ 28న జయశంకర్, కేశవరావ్ జాదవ్‌ల నేతృత్వంలో ఎన్ని సంస్థలతో కలిసి తెలంగాణ ఐక్య వేదిక ఏర్పడింది? 28
28 సంస్థలతో కలిసి 1997 అక్టోబర్ 28న తెలంగాణ ఐక్య వేదిక ఎవరి నేతృత్వంలో ఆవిర్భవించింది? జయశంకర్, కేశవరావ్ జాదవ్‌ల నేతృత్వంలో
జయశంకర్, కేశవరావ్ జాదవ్‌ల నేతృత్వంలో 28 సంస్థలు కలిసి ఏర్పడిన సంస్థ తెలంగాణ ఐక్య వేదిక. ఇది ఎప్పుడు ఆవిర్భవించింది? అక్టోబర్ 28, 1997
విప్లవ రచయితల సంఘం, ఇతర ప్రజాసంఘాల నేతృత్వంలో అతి పెద్ద సభ వరంగల్‌లో జరిగింది. ఆ సభలోనే కాళోజి వంటి కవులు, కొన్ని సంస్థలు కలిసి వరంగల్ డిక్లరేషన్‌ను విడుదల చేశాయి. ఇది ఏ తేదీన విడుదల చేశాయి? 1997 డిసెంబర్ 28
1997:
తెలంగాణ ఐక్య వేదిక
జై తెలంగాణ పార్టీ
వరంగల్ డిక్లరేషన్
1998లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో వెలుబడ్డ మాసపత్రిక? మా తెలంగాణ
1998లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో వెలువడిన మా తెలంగాణ పత్రిక ఏ రకమైన పత్రిక? మాసపత్రిక
ఏ సంవత్సరంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో మా తెలంగాణ మాసపత్రిక వెలువడింది? 1998లో [ఈ పత్రికను నగరంలోని బసంత్ టాకీస్‌లో జస్టిస్ కొండా మాధవరెడ్డి ఆవిష్కరించారు]
సరైనవి:
i) CPI (ML) ప్రజాపంథా పార్టీ 2008లో తెలంగాణకు అనుకూలంగా కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంది
ii) CPI 1969 నాటి అవగాహనను మార్చుకుని 2011లో ఉద్యమంలోకి ప్రత్యక్షంగా దూకింది
iii) CPM మాత్రం తన విధానాన్ని మార్చుకోలేదు. భాషా ప్రయుక్త రాష్ట్రాల విధానాలకు కట్టుబడి ఉన్నామని ఆ సిద్ధాంతాన్నే చెప్పుకుంటూ వచ్చింది.
1998లో ఆకుల భూమయ్య కన్వీనర్‌గా ఏర్పడిన పార్టీ? తెలంగాణ జనసభ
1998లో ఎవరు కన్వీనర్‌గా తెలంగాణ జనసభ ఏర్పరచారు? ఆకుల భూమయ్య
2000 సంవత్సరం ఆగస్టు 11న ఎంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుతూ ఆ పార్టీ అధినేత, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి విన్నవించారు? 41
1996లో ప్రారంభమైన మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని వరంగల్ డిక్లరేషన్ ద్వారా ముందుకు తీసుకువచ్చింది ఏ పార్టీ? పీపుల్స్‌వార్ పార్టీ
ఒక్క ఓటు-రెండు రాష్ట్రాలు అని ప్రకటించిన పార్టీ- బీజేపీ
తెలంగాణ జనసభ సదస్సులో కాళోజి ‘క్విట్ తెలంగాణ’ పిలుపునిచ్చారు
- ఈ సదస్సులో కాళోజి జన తెలంగాణ పత్రికను ఆవిష్కరించారు
- ముఖ్య అతిథి/అతిథులు? యాసిన్ మాలిక్, ఖగేన్
- తెలంగాణ జనసభ సదస్సు అంబర్‌పేట్‌లో జరిగింది
వరంగల్ డిక్లరేషన్స్ సదస్సు ఎన్ని డిమాండ్స్ ఆమోదించింది? 50
- 1997, డిసెంబర్ 28, 29 తేదీల్లో ప్రొ.సాయిబాబ ఎవరి అధ్యక్షతన జరిగింది
తెలంగాణ ఐక్య వేదిక ప్రధాన కార్యాలయం? జల దృశ్యం
- తెలంగాణ ఐక్యవేదిక ప్రధాన ఉద్దేశం – సమష్టి నాయకత్వం, ప్రాధాన్యతతో తెలంగాణ రాష్ట్రమే సమస్యలకు పరిష్కారం
- ఐక్యవేదిక ఉద్యమ కార్యాచరణ కోసం 2 కమిటీలు ఏర్పాటు
తెలంగాణ ఐక్యవేదిక ఎన్ని ప్రజా సంఘాల కూటమిగా ఏర్పడింది? 28
1997లో ప్రాంతీయ అసమానతలు, అభివృద్ధి ప్రత్యామ్నాయాల పేరుతో నిర్వహించిన సదస్సుకు ఎవరు కన్వీనర్లు? ప్రొ.విశ్వేశ్వరరావు & బి) ప్రొ.సింహాద్రి
ప్రాంతీయ అసమానతలు, అభివృద్ధి ప్రత్యామ్నాయాల పేరుతో సదస్సు ఎక్కడ నిర్వహించారు? ఓయూ
- సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్– మల్లేపల్లి లక్ష్మయ్య
- 1 నవంబర్, 1996 తెలంగాణ సదస్సు – భూపతికృష్ణమూర్తి
తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించినవారు? నాగారం అంజయ్య
జై తెలంగాణ పార్టీ ఎవరు స్థాపించారు? ఇంద్రారెడ్డి
జై తెలంగాణ పార్టీ సన్నాహక సమావేశం ఎక్కడ నిర్వహించారు? చంపాపేట్
జై తెలంగాణ పార్టీ సన్నాహక సమావేశం ముఖ్య అతిథి - శిబూసోరెన్
- 1997లో తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్‌గా ఇంద్రారెడ్డి నియామకం
- జయశంకర్, కేశవరావుజాదవ్ ముఖ్యులు
తెలంగాణ మహాసభకు చెరుకు సుధాకర్ అధ్యక్షత వహించారు
తెలంగాణ మహాసభ పత్రిక వి.ప్రకాశ్ సంపాదకులు
తెలంగాణ మహాసభ సమావేశానికి సంబంధించి:
- 1997, ఆగస్టు 11న జరిగింది
- ధోఖాతిన్న తెలంగాణ సదస్సు పేరుతో నిర్వహించారు
- చెరుకు సుధాకర్ అధ్యక్షుడు
తెలంగాణ మహాసభ సమావేశం ఎక్కడ జరిగింది? సూర్యాపేట
తెలంగాణ ప్రగతి వేదిక కన్వీనర్? రాపోలు ఆనందభాస్కర్
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, తెలంగాణ అభివృద్ధి మా కార్యక్రమం పేరుతో ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన సంస్థ? పీపుల్స్‌వార్
గద్దర్‌పై కాల్పులు జరిగిన రోజు? 6 ఏప్రిల్, 1997
భువనగిరి సమావేశానికి సంబంధించి:
- గద్దర్ తన బృందం ఆట పాటలతో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించారు
- సభను కాళోజి ప్రారంభించారు
- గాదె ఇన్నయ్య ప్రవేశపెట్టిన తీర్మానాలు ఆమోదం
- భువనగిరి సభ మొదటి రోజు సమావేశానికి ప్రొ.విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించారు
- 1997, మార్చి 8, 9 తేదీల్లో భువనగిరి సభ జరిగింది
తెలంగాణ హక్కుల పోరాట సభ దగాపడ్డ తెలంగాణ పేరుతో నిర్వహణ
- సాగు, తాగు నీటిలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి గాదె ఇన్నయ్య తీర్మానం చేశారు
‘తెలంగాణలో ఏం జరుగుతోంది’ అనే పుస్తకం ఎవరు ఆవిష్కరించారు? జయశంకర్
అశోక టాకీస్ సదస్సు:
- అశోక టాకీస్ సదస్సులో తెలంగాణ సంస్కృతి వివక్షపై చర్చ
- అశోక టాకీస్ సదస్సు కరపత్రం- సొంత గడ్డపై పరాయి బిడ్డలుగా బతుకుతున్న సోదరుల ఆత్మగౌరవ సభ
- 19 జనవరి, 1997లో అశోక టాకీస్ సదుస్సు గులాం రసూల్ స్మారకార్థం పాశం యాదగిరి ఏర్పాటు చేశారు
1997, ఫిబ్రవరిలో విద్యా రంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన శాసనసభ్యుడు? జీవన్‌రెడ్డి
మల్లెపల్లి రాజాం ట్రస్ట్ వారు ఎక్కడి నుంచి స్మారక ఉపన్యాసాలు నిర్వహిస్తారు? జనగామ (గోదావరిఖని)
తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని పునః ప్రారంభించాలని ఏ సమావేశంలో నిర్ణయించారు- నిజామాబాద్
1996లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ఏ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది? ఉత్తరాఖండ్
Telangana Legislators Forum:
- 1993లో Telangana Legislators Forum ఏర్పాటు
- TLF ఏర్పాటులో వెలిచాల జగపతిరావు ముఖ్యుడు
- TLF కన్వీనర్‌గా జానారెడ్డి నియామకం
జలసాధన సమితి:
- జల సాధన సమితి 1992, ఆగస్టులో ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో సభ ఏర్పాటు చేశారు
- ఈ సంస్థ ఆధ్వర్యంలో 1992లో నల్లగొండ నుంచి హైదరాబాద్‌కు పాదయాత్రగా వచ్చారు
- దుశ్చర్ల సత్యనారాయణ జలసాధన సమితి స్థాపించారు
తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్: TLSO
- 1992లో ఓయూలో తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ మనోహర్‌రెడ్డి ఏర్పాటు
- ఈ సంస్థ ఆధ్వర్యంలో ఓయూలో చిన్న రాష్ట్రాల సదస్సు నిర్వహించారు
- ముఖ్యఅతిథి జార్జ్ ఫెర్నాండెజ్
ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ అనే సంస్థ ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు? ప్రొ.లక్ష్మణ్
తెలంగాణ ఇంఫ్రర్మేషన్ ట్రస్ట్:
- తెలంగాణ ఇంఫ్రర్మేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వచ్చిన పత్రిక? మా తెలంగాణ
- తెలంగాణ ఇంఫ్రర్మేషన్ ట్రస్ట్ ఏర్పాటులో నాట్యకళా ప్రభాకర్ ప్రముఖుడు
- తెలంగాణ ఇంఫ్రర్మేషన్ ట్రస్ట్ ఏర్పాటులో జయశంకర్ కృషి ఉంది
1987లో టీపీఎస్ పునరుద్ధరణలో భూపతికృష్ణమూర్తి ముఖ్య పాత్ర పోషించారు
కేసీఆర్ ఏ తేదీన సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు? 2009 నవంబర్ 29న
కేసీఆర్ దీక్షకు సంఘీభావంగా తెలంగాణ విద్యార్థులు ఐక్య కార్యాచరణ సంఘంగా ఎప్పుడు ఏర్పడ్డారు? నవంబర్ 16న
కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష కాలం? 2009 నవంబర్ 29 - డిసెంబర్ 9 [11 రోజుల పాటు]
తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్- తెలంగాణ ప్రభాకర్
తెలంగాణ స్టూడెంట్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్- కె. మనోహర్ రెడ్డి
సెంటర్ ఫర్ దళిత స్టడీస్- మల్లేపల్లి లక్ష్మయ్య
తెలంగాణ ప్రగతి వేదిక- రాపోలు ఆనంద భాస్కర్
తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్
- తెలంగాణకు జరిగిన అన్యాయాలపై సమాచారం తెచ్చేందుకు దీనిని 1989లో తెలంగాణ ప్రభాకర్ ఏర్పాటు చేశారు.
- నవంబర్ 1, 1996న, తెలంగాణ విద్రోహం సమావేశాన్ని వరంగల్‌లో మేధావుల బృందం నిర్వహించింది.
- ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ అనేక సంస్థల ఏర్పాటుకు దారితీసిన అనేక ప్రజాదరణ పొందిన సమావేశాలకు దారితీసింది.
తెలంగాణ స్టూడెంట్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్
- ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్, తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ప్రారంభించబడ్డాయి.
- 1992లో తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్ యొక్క కాకతీయ యూనిట్ ఏర్పడింది.
- ఆగష్టు 1993లో ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్ మరియు ఠాగూర్ ఆడిటోరియంలో చిన్న రాష్ట్రంపై జాతీయ సదస్సు జరిగింది.
- ఈ సమావేశాన్ని సురేంద్ర మోహన్ ప్రారంభించారు, జస్టిస్ మాధవ్ రెడ్డి సభలో ప్రసంగించారు.
సెంటర్ ఫర్ దళిత స్టడీస్ (సిడిఎస్)
- ఇది 1999లో లాభాపేక్షలేని సంస్థగా స్థాపించబడింది, ఇది దళిత వర్గాల సామాజిక, రాజకీయ మరియు ఆర్ధిక హక్కులపై అవగాహన కల్పించడం మరియు సామాజిక మరియు ఆర్ధిక అడ్డంకులను మరియు లేమిని అధిగమించే మార్గంగా వారి నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో.
- సెమినార్లు, వర్క్‌షాపులు, సమావేశాలు, డాక్యుమెంటరీ సినిమాలు, మీడియా సెన్సిటైజేషన్, శిక్షణ, సామర్థ్యం పెంపొందించడం, న్యాయవాద మరియు లాబీయింగ్ వంటి వివిధ వ్యూహాల ద్వారా సిడిఎస్ గత 15 సంవత్సరాలుగా దళిత సమాజాల సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సాధికారత కోసం ప్రయత్నిస్తోంది.
- సెంటర్ ఫర్ దళిత స్టడీస్ చైర్‌పర్సన్ మల్లెపల్లి లక్ష్మయ్య.
తెలంగాణ ప్రగతి వేదిక
- దీనిని 13 జూలై 1997న రాపోలు ఆనంద్ భాస్కర్ స్థాపించారు.
- జర్నలిస్ట్ అయిన రాపోలు ఆనంద భస్కర్, 1994 నుండి ప్రజా కార్యకర్తగా మారారు, ప్రత్యేక రాష్ట్రత్వం యొక్క అవసరాన్ని అర్థం చేసుకోవడంలో, బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి ప్రజలను జ్ఞానోదయం చేయడంలో మరియు సన్నద్ధం చేయడంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాన పాత్రధారులలో ఒకరైన, 1996 నుండి తెలంగాణ కోసం ఆనంద భస్కర్ యొక్క నమూనా మరియు ఎజెండా తన ముందుకు కనిపించే విధానాన్ని తెలియజేస్తుంది.
1971 ఎన్నికలలో తెలంగాణ ప్రజా సమితి ఎన్నిక గుర్తు ఏది? సల్కెపార/ హ్యాండ్ హో
- మార్చి 5, 1971 న, ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగిన లోక్‌సభ ఉపఎన్నికలలో , చెన్నారెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రజా సమితి , పార లేదా చేతి తొట్టి (సల్కెపర) గుర్తుతో ఒంటరిగా పోటీ చేసింది.
- ఇందిరా కాంగ్రెస్ ఆవు - దూడ గుర్తుతో పోటీ చేసింది.
- 1971 లోక్‌సభ ఎన్నికలలో , తెలంగాణ ప్రజా సమితి తెలంగాణలోని 14 లోక్‌సభ స్థానాల్లో 10 లోక్‌సభ స్థానాలను 47.5% ఓట్లతో గెలుచుకుంది.
తెలంగాణ ప్రజా సమితి
- మార్చి 25, 1969 న, ఫిబ్రవరి 1969 లో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమ్మేళనం , తెలంగాణ ప్రజా సమితిగా పేరు మార్చబడింది .
- మదన్ మోహన్ తెలంగాణ ప్రజా సమితి మొదటి అధ్యక్షుడు (సిద్దిపేట న్యాయవాది).
- వెంకట్రామి రెడ్డి ప్రధాన కార్యదర్శి.
- కోశాధికారిగా నగరి కృష్ణ ఉన్నారు .
- తెలంగాణ ప్రజా సమితి మే 1వ తేదీని తెలంగాణ డిమాండ్స్ డే / తెలంగాణ డిజైర్స్ డేగా ప్రకటించాలని ప్రతిపాదించింది.
ఎవరు తెలంగాణ జీవన విధానాన్ని తన చిత్రలేఖనాలలో ప్రతిబింబింప చేశారు ? కె. లక్ష్మణ్ గౌడ్
- కె.లక్ష్మణ్ గౌడ్ తన చిత్రాల ద్వారా తెలంగాణ జీవన విధానాన్ని చిత్రించారు
- ఆయన స్వస్థలం మెదక్ జిల్లా నిజాంపూర్.
భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ఆరు సూత్రాల పథకాన్ని సూచిస్తుంది? 371-D
- సెప్టెంబరు 21, 1973 న ప్రకటించిన ఆరు-సూత్రాల పధకంకు రాజ్యాంగబద్ధత కల్పించేందుకు మే 1974 లో పార్లమెంటు 32వ రాజ్యాంగ సవరణను ఆమోదించింది.
- రాష్ట్రపతి 32వ రాజ్యాంగ సవరణ బిల్లుపై మే 3, 1974 న సంతకం చేశారు మరియు సవరణ చట్టం జూలై 1, 1974 నుంచి అమల్లోకి వచ్చింది .
- 32వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగానికి 371 (D) మరియు 371 (E) అధికరణలను జోడించింది.
- అధికరణ 371 (E) ప్రకారం, పార్లమెంటు ప్రత్యేక చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయవచ్చు.
- అక్టోబరు 18, 1975 న అప్పటి రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్ అధికరణ 371(D) ద్వారా తనకు మంజూరు చేసిన అధికారం కింద GSR - 524 (E) ప్రకటనను జారీ చేశారు. దీనిని రాష్ట్రపతి ఉత్తర్వులుగా పేర్కొంటారు.
- ఈ రాష్ట్రపతి ఉత్తర్వును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యాగాలలో (స్థానిక శ్రేణిల సంస్థ & డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ రెగ్యులరైజేషన్) ఉత్తర్వు - 1975గా కూడా సూచిస్తారు.
ప్రతిపాదన (A) : ఆంధ్ర ప్రాంతంలోని ప్రజలు ముల్కీ నిబంధనలు తమకు వ్యతిరేకకరమైనవని "జై ఆంధ్ర ఉద్యమాన్ని" ప్రారంభించారు.
కారణం (R) : 1972 లో సుప్రీం కోర్టు ముల్కి నిబంధనలు రాజ్యాంగపరంగా సక్రమమేనని ప్రకటించింది.
(A) మరియు (R) రెండూ నిజము, మరియు (R) (A) కు సరియైన వివరణ
- 3 అక్టోబర్ 1972న, జస్టిస్ సిక్రీ ధర్మాసనం 5 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధమైనవని తీర్పును వెలువరించింది.
- 1972 అక్టోబరు 4న తీర్పు తమకు వ్యతిరేకమని భావించిన ఆంధ్ర ప్రజలు జై ఆంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించారు .
- జై ఆంధ్ర ఉద్యమానికి బివి సుబ్బారావు, కాకాని వెంకట రత్నం, వసంత నాగేశ్వర్ రావు నాయకత్వం వహించారు.
- ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి సిక్రీ, జస్టిస్ AN రే, జస్టిస్ YD దువా, జస్టిస్ DG పాలేకర్, జస్టిస్ MH బేగ్ ఉన్నారు .
- ఈ తీర్పులో గతంలో 1972 ఫిబ్రవరి 14న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది .
- తీర్పును ఆంధ్రప్రదేశ్ సీఎం పీవీ నరసింహారావు స్వాగతించారు .
తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి బోర్డును రద్దు చేసిన ముఖ్యమంత్రి ఎవరు? NTR
- ఎన్టీఆర్‌రామారావు- నందమూరి తారక రామారావు ఒక భారతీయ నటుడు మరియు రాజకీయ నాయకుడు, అతను 7 సంవత్సరాల పాటు 3 సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు
రాష్ట్ర ప్రభుత్వం 2004లో పీపుల్స్ వార్ గ్రూప్పై నిషేధాన్ని ఎందుకు ఎత్తివేసింది? ప్రభుత్వంతో చర్చలు
- పీపుల్స్ వార్ గ్రూప్ (పిడబ్ల్యుజి) 1980 ఏప్రిల్ 22 న భారతదేశంలోని దక్షిణ భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో స్థాపించబడింది.
- దీని స్థాపకుడు కొండపల్లి సీతారామయ్య ఆంధ్ర ప్రదేశ్ లోని అత్యంత ప్రభావవంతమైన నక్సలైట్ నాయకులలో ఒకరు.
- ఇది మావో సే తుంగ్ యొక్క భావజాలాన్ని అనుసరిస్తుంది.
- ఈ బృందం భారతదేశంలో ప్రజాస్వామ్యం మరియు పార్లమెంటరీ ప్రక్రియ యొక్క ఆలోచనలను తిరస్కరించింది మరియు భూమిని మరియు సంపదను సమానంగా పునఃపంపిణీ చేయడానికి సాయుధ పోరాటం ఒక్కటే మార్గమని అభిప్రాయపడింది.
- మావోయిస్ట్ కమ్యూనిజాన్ని సమర్థించే సాయుధ విప్లవ బృందంలో ఒక సభ్యుడిని నక్సలైట్ అని పిలుస్తారు.
ఏ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జగిత్యాల మరియు సిరిసిల్ల ప్రాంతాలను చెదిరిన ప్రాంతాలుగా ప్రకటించింది? : 1978
- రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల అనే పేరు శిరీష నుంచి వచ్చింది, అంటే సంపద అని అర్థం.
- ఇది సిరిసిల్ల మండలంలోని మానేరు నది ఒడ్డున ఉంది.
- పెద్ద సంఖ్యలో పవర్ లూమ్, టెక్స్ టైల్ ప్రాసెసింగ్ మరియు డై-కటింగ్ యూనిట్లు ఉండటం వల్ల ఇది టెక్స్ టైల్ సిటీగా ప్రసిద్ధి చెందింది.
డిస్టర్బ్డ్ ఏరియాస్ యాక్ట్ 1976 ప్రకారం:
అధికారిక గెజిట్ లో నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా వివిధ మత, జాతి, భాష లేదా ప్రాంతీయ సమూహాలు, కులాలు లేదా కమ్యూనిటీల మధ్య విభేదాలు లేదా వివాదాల వల్ల ప్రజాశాంతి మరియు ప్రశాంతతకు విస్తృతంగా అంతరాయం కలిగితే డిస్టర్బ్ అయినట్లుగా ప్రకటించవచ్చు.
శ్రీకృష్ణ కమిటీలో సభ్యుడిగా ఉన్న న్యాయశాస్త్ర ప్రొఫెసర్ను గుర్తింపుము - ప్రొఫెసర్ రణబీర్ సింగ్
- ప్రొ. రణ్‌బీర్ సింగ్ శ్రీకృష్ణ కమిటీలో సభ్యుడిగా ఉన్న లా ప్రొఫెసర్.
- తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ, దీనిని ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులపై సంప్రదింపుల కమిటీ (CCSAP) అని కూడా పిలుస్తారు.
- ఇది మాజీ ప్రధాన న్యాయమూర్తి BN శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ, ఇది తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ లేదా పరిరక్షణపై దర్యాప్తు చేసింది.
- ఈ కమిటీని 3 ఫిబ్రవరి 2010న భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది మరియు దాని నివేదికను 30 డిసెంబర్ 2010న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించింది.
ఆంధ్ర మహాసభ, తెలంగాణ రైతాంగ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి? రావి నారాయణ రెడ్డి
- రావి నారాయణ రెడ్డి (5 జూన్ 1908 - 7 సెప్టెంబర్ 1991) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక సభ్యుడు మరియు రైతు నాయకుడు.
- అతను ఉస్మాన్ అలీ ఖాన్ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ తిరుగుబాటులో నాయకుడు.
- 1941లో ఆంధ్రమహాసభ ఛైర్మన్‌గా రావి నారాయణరెడ్డి కూడా కీలక పాత్ర పోషించారు .
- రావి నారాయణ రెడ్డి మరియు బద్దం ఎల్లారెడ్డి 1940 లో హైదరాబాద్ కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారు .
- రావి నారాయణ రెడ్డి వీర తెలంగాణా మరియు నా అనుభవాలు జ్ఞాపకాలు రాశారు.
- చిల్కూరు , భువనగిరి , ఖమ్మం ఆంధ్ర మహాసభలకు ఆయన అధ్యక్షత వహించారు
సురవరం ప్రతాప రెడ్డి
- జోగిపేటలో జరిగిన తొలి ఆంధ్రమహాసభకు ఆయన నాయకత్వం వహించారు.
- సురవరం ప్రతాప్ రెడ్డి గ్రంథాలయ ఉద్యమాన్ని తెలంగాణలో మొదటి ఉద్యమంగా అభివర్ణించారు.
- సురవరం ప్రతాప్ రెడ్డి గ్రంథాలయ కార్యకర్తలు, గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న వారి కోసం తెలంగాణ ఆంధ్రుల కర్తవ్యం అనే పుస్తకాన్ని రచించారు.
- సురవరం ప్రతాప్ రెడ్డి 1934 లో 354 తెలంగాణ కవులతో కూడిన గోల్కొండ కవుల సంచీకను ప్రచురించారు
డాక్టర్ మర్రి చెన్నా రెడ్డి
- 1967 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో గెలుపొందిన చెన్నారెడ్డి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు.
- మర్రి చెన్నారెడ్డిని రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంచేందుకు ఇందిరా గాంధీ కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రిగా నియమించారు.
- ఆ సమయంలో ఆయన పార్లమెంటు సభ్యుడు కాదు, కానీ తరువాత రాజ్యసభకు ఎన్నికయ్యారు.
- 1967 అసెంబ్లీ ఎన్నికల్లో వందేమాతరం రామచంద్రరావుపై మర్రి చెన్నా రెడ్డి విజయం సాధించారు.
1969లో జి.ఓ.నెం: 36ను రద్దు చేసిన సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్కు నేతృత్వం వహించారు.? జస్టిస్ ఎం. హిదాయతుల్లా
పి.వి. నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? 1971, సెప్టెంబర్ 30
- ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన మొదటి తెలంగాణ ప్రాంత వ్యక్తి పి.వి. నర్సింహారావు.
- 1968లో స్థాపించబడిన తెలుగు అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు.
- మంథని నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ 1957లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు.
- 1969 ఉద్యమ సమయంలో కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వంలో పి.వి. నర్సింహారావు న్యాయ, సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు.
- 1977లో హనుమకొండ నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు
- కేంద్ర ప్రభుత్వంలో హోం, రక్షణ, ప్రణాళికా సంఘం, విదేశాంగ మంత్రిగా పనిచేశారు.
- అతని ఆత్మకథ ది ఇన్‌సైడర్
- 1991లో భారత ప్రధాని అయ్యాడు.
- పి.వి. నర్సింహారావు భారతదేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టిన మొదటి దక్షిణ భారతీయుడు మరియు ఏకైక తెలుగు వ్యక్తి.
ఫ్లోరోసిస్ పీడిత నల్గొండ జిల్లాకు తాగు నీటిని అందించాలంటూ ఉద్యమం చేసిన దుశ్చర్ల సత్యనారాయణ ఏ సంస్థను స్థాపించి దీని కోసం పోరాడారు? జల సాధన సమితి
- నల్గొండలో జల సాధన సమితి ఉద్యమాన్ని దుశ్చర్ల సత్యనారాయణ నిర్వహించారు .
- జల సాధన సమితి ఉద్యమంలో భాగంగా నల్గొండ నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర (పాదయాత్ర) లో జగపతిరావు పాల్గొన్నారు.
- 1992 ఆగస్టులో దుశ్చర్ల సత్యనారాయణ నేతృత్వంలో జల సాధన సమితి చేపట్టిన పాదయాత్ర (మార్చి) ఉస్మానియా యూనివర్శిటీకి చేరుకోగానే ఆర్ట్స్ కాలేజీలో TLSO సమావేశం ఏర్పాటు చేసింది.
- 1993 ఫిబ్రవరి 15 న ఈ సంస్థ ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం జాతీయ నాయకులకు మెమోరాండం అందించింది .
దేనిని పరిశీలించుటకు గిర్గ్లాని కమిటీని నియమించారు? 610 జి.ఓ. ఉల్లంఘనలు
- జీవో 610 దరఖాస్తుపై విచారణ జరిపేందుకు జె.ఎం.గిర్గ్లానీ కమిటీని ఏర్పాటు చేశారు.
- గిర్గ్లానీ కమిషన్ 2001 అక్టోబర్ 6న తన ప్రాథమిక నివేదికను వెలువరించింది.
- 2001 డిసెంబర్ 29న అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చ జరిగింది.
- 2004 సెప్టెంబర్ 30న ప్రభుత్వానికి తుది నివేదిక అందింది.
- 2002 ఫిబ్రవరిలో ప్రభుత్వం తాత్కాలిక గిర్గ్లానీ కమిషన్ నివేదికపై రేవూరి ప్రకాశరావు అధ్యక్షతన హౌస్ కమిటీని ఏర్పాటు చేసింది.
- 2004 సెప్టెంబర్ 30న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి జేఎం గిర్గ్లానీ కమిషన్ తుది నివేదిక అందింది.
- జీవో 610ని సక్రమంగా అమలు చేయకపోవడంతో తెలంగాణలో ఉద్యోగులు మరింత నిరాశ, ఆగ్రహంతో ఉన్నారు.
- తెలంగాణలో స్థానికేతరులను స్వస్థలాలకు పంపించాలని తెలంగాణ ఎన్జీవో అసోసియేషన్ తరచూ ప్రభుత్వాన్ని కోరుతోంది .
- దీనిని గమనించిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం 2001 జూన్ 25న జీవో 270 ద్వారా (జీవో 610 అమలును అంచనా వేయడానికి) జె.ఎం.గిర్గ్లానీ ( గిర్గ్లానీ)ని నియమించింది.
- ఇది ఏకసభ్య కమిషన్.
- కమిషన్ తన ప్రాథమిక ఫలితాలను సమర్పించడానికి 90 రోజుల (3 నెలల) గడువు విధించింది.
- 2001 అక్టోబర్ 6న గిర్గ్లానీ కమిషన్ మధ్యంతర నివేదిక సమర్పించింది.
27 ఏప్రిల్, 2001- టి.ఆర్.ఎస్. స్థాపన
29 నవంబర్, 2009- కె.సి.ఆర్. ఆమరణ నిరాహార దీక్ష
10 మార్చి, 2011- మిలియన్ మార్చ్
2 జూన్, 2014- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు
మిలియన్ మార్చి
- ఈ సంఘటన 2011 మార్చి 10న హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో జరిగింది.
- ఈజిప్టులోని తహ్రిక్ స్క్వేర్ కైరోను దిగ్బంధించడం ఈ మిలియన్ మార్చ్ కార్యక్రమానికి ప్రేరణగా నిలిచింది.
- ఆందోళనకారుల దాడిలో 16 కట్టడాలను కూల్చివేశారు.
- హుస్సేన్ సాగర్ లో అమరులైన వారిలో సిద్ధేంద్ర యోగి, సర్ ఆర్థర్ కాటన్, కందుకూరి వీరేశలింగం, ముట్నూరి రామారావు, అన్నమాచార్య, ఎర్రప్రగడ, బళ్లారి రాఘవరావు, శ్రీకృష్ణదేవరాయలు, బ్రహ్మనాయుడు, గురజాడ అప్పారావు, రఘుపతి వెంకట రత్నం నాయుడు, ఆంధ్రకు చెందిన త్రిపురనేని రామస్వామి తదితరులు ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి
- ఇది ఒక భారతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీ, ఇది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీలకంగా ఉంది.
- హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే సింగిల్ పాయింట్ ఎజెండాతో 2001 ఏప్రిల్ 27న కె.చంద్రశేఖర్ రావు దీనిని స్థాపించారు.
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నిరంతర ఉద్యమాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.
- అందుకు అనుగుణంగానే తెలంగాణలో రెండు సార్లు టీఆర్ఎస్ విజయం సాధించి ప్రస్తుత అధికార పార్టీగా ఉంది.
- తాజాగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చారు.
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని ప్రకటించిన కేసీఆర్ 2009 నవంబర్ 29 నుంచి నిరాహార దీక్షకు దిగారు.
కేసీఆర్ నిరాహార దీక్ష - రంగధామ్ పల్లి, సిద్దిపేట.
- నవంబర్ 29న కేసీఆర్ కరీంనగర్ నుంచి రంగధామ్ పల్లికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు.
- ఖమ్మం జైలులోనే ఆయన నిరాహార దీక్ష ప్రారంభించారు.
- ఈ పరిణామాలతో ఎల్బీనగర్ చౌరస్తాలో శ్రీకాంత్ చారి అనే యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
- 2009 డిసెంబర్ 4న శ్రీకాంత్ చారి కన్నుమూశారు.
- ఈ ఉద్యమ తీవ్రతను గ్రహించిన ముఖ్యమంత్రి రోశయ్య 2009 డిసెంబర్ 7న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
- ఆ తర్వాత 2009 డిసెంబర్ 9న రాత్రి 11.30 గంటలకు కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటుపై ఈ కింది ప్రకటన చేశారు.
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతామని ఆ ప్రకటనలో చిదంబరం పేర్కొన్నారు.
- ఈ ప్రకటనతో నిమ్స్ ఆస్పత్రిలో 12 రోజులుగా కొనసాగుతున్న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు తెరపడింది.
తెలంగాణపై రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి యు.పి.ఎ. ఏర్పాటు చేసిన మంత్రిమండలి ఉప సంఘం అధ్యక్షులు ఎవరు? ప్రణబ్ ముఖర్జీ
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో యూపీఏ ప్రభుత్వం జాప్యం చేస్తోందని, యూపీఏ సమావేశాల్లో కేసీఆర్ , ఆలె నరేంద్ర సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్‌లకు తమ నిరసనలను పదేపదే చూపించారు.
- టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థన మేరకు యుపిఎ ప్రభుత్వం 2005 జనవరిలో అప్పటి రక్షణ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆధ్వర్యంలో తెలంగాణ అంశంపై ఇతర పార్టీలతో విస్తృత చర్చలు, ఏకాభిప్రాయం కోసం ఒక ఉప సంఘంని నియమించింది.
- ప్రణబ్ ముఖర్జీ కమిటీ సభ్యులు డీఎంకే పార్టీకి చెందిన దయానిధి మారన్ మరియు రఘువంశ ప్రసాద్ సింగ్ ఆర్జేడీ పార్టీకి చెందినవారు .
- ఈ ఇద్దరు సభ్యులు యుపిఎ ప్రభుత్వంలో మంత్రిమండలి మంత్రులుగా పనిచేశారు.
- తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ఆగస్టు 5, 2013 న కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం పార్లమెంటులో అధికారికంగా ప్రకటించారు.
- ఎ.కె. ఆంటోనీ కమిటీని ఆగస్టు 6, 2013 న ఏర్పాటు చేశారు.
- దిగ్విజయ్ సింగ్ , వీరప్ప మొయిలీ , అహ్మద్ పటేల్ సభ్యులు.
- విభజన కమిటీ అంటే ఆంటోనీ కమిటీకి మరో పేరు.
నిరసన తెలపడానికి తెలంగాణ ప్రజలు రోడ్లపైకి వచ్చి తినడానికి ఉపయోగించిన ప్రముఖ రకం ఏది? వంటా వార్పు
- వంటా వార్పు తెలంగాణ ఉద్యమంలో ఒక వినూత్నమైన, శాంతియుత నిరసన రూపం.
- వంటా వార్పు నిరసన సందర్భంగా, ప్రజలు సామూహికంగా రోడ్లపై వంటలు చేసి, రోడ్లపై భోజనం చేయడానికి గుమిగూడారు , తద్వారా రోడ్లను దిగ్బంధించి రవాణా వ్యవస్థకు అంతరాయం కలిగింది .
- రోజంతా పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ, ధూమ్-ధామ్ చేస్తూ రోడ్డుపైనే గడిపి ప్రజలు తమ అసంతృప్తిని ప్రదర్శించారు.
- మొదటి వంట-వార్పు నిరసన ఫిబ్రవరి 3, 2010 న జరిగింది.
- కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు మరియు ఏకాభిప్రాయం కోసం శ్రీకృష్ణ కమిషన్‌ను నియమించిన ఫిబ్రవరి 3వ తేదీన వంట-వార్పు కార్యక్రమం ప్రారంభమైంది.
- అదే రోజు హైదరాబాద్ నుంచి కరీంనగర్, హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే రోడ్డులో వంటావార్పు కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు.
రాస్తా రోకో
- సెప్టెంబర్ 13, 2011 న ప్రారంభమైన సకల జనుల సమ్మేళనానికి తెలంగాణ బంద్ మరియు రాస్తారోకో మద్దతు లభించింది.
బోనాలు
- తెలంగాణలో ఆషాఢమాసంలో బోనాలు జరుపుకుంటారు, గరగ నృత్యం చేస్తారు.
- బోనం అనేది భోజనం అనే పదానికి సంక్షిప్త పదం , అంటే భోజనం లేదా విందు అని అర్థం.
- ఈ పండుగ గ్రామ మాత దేవతకు భోజనం పెట్టడాన్ని గుర్తు చేస్తుంది .
- ఊరది బోనాలు పండుగ ప్రక్రియను సూచిస్తుంది.
- పోతురాజు తన దంతాలను ఉపయోగించి మేకను చంపి శరీరం మరియు తల వేరు చేస్తాడు. దీనికి గావు పట్టడం అని పేరు.
- గోల్కొండ కోటలోని ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢమాసం మొదటి ఆదివారం నాడు బోనాల పండుగ ప్రారంభమవుతుంది .
శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకున్న సందర్భం? కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష కాలంలో
112. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేయకపోతే ఏ తేదీన శాసనసభను ముట్టడిస్తామని విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి ప్రకటన చేసింది? 2009 డిసెంబర్ 10
113. చిదంబరం డిసెంబర్ 9న హుటాహుటిన తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటించడానికి కారణం? తెల్లవారితే డిసెంబర్ 10, విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేయకపోతే డిసెంబర్ 10న శాసనసభను ముట్టడిస్తామని హెచ్చరించినందువల్ల
114. 1996 నవంబర్ 1న విద్రోహదిన సభ వరంగల్‌లో ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? భూపతి కృష్ణమూర్తి, జయశంకర్
115. అమ్మా తెలంగాణమా పాటను రాసిందెవరు? గద్దర్
116. 1997 అక్టోబర్ 28న ఎవరి నేతృత్వంలో 28 సంస్థలు కలిసి తెలంగాణ ఐక్య వేదికగా ఏర్పడ్డాయి? జయశంకర్, కేశవరావ్ జాదవ్‌ల
117. 1997, డిసెంబర్ 28న పలు సంఘాలు కలిసి ఒక డిక్లరేషన్‌ను విడుదల చేశాయి. దాని పేరు? వరంగల్ డిక్లరేషన్
118. 1998లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెలువడిన మాసపత్రిక ఏది? మా తెలంగాణ
119. తెలంగాణ జనసభ ఎప్పుడు ఏర్పడింది? 1998 [ఆకుల భూమయ్య]
120. 2000 సంవత్సరంలో ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రాష్ట్రపతికి మెమొరాండం సమర్పించారు? 41
121. తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1988
122. జై తెలంగాణ పార్టీని ఇంద్రారెడ్డి ఎప్పుడు ప్రారంభించారు? 1997
123. రాష్ట్ర ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాజకీయ జేఏసీ మిలియన్ మార్చ్‌ను ఏ రోజున నిర్వహించింది? 2011, మార్చి 10
124. సడక్ బంద్ ఆందోళనా కార్యక్రమాన్ని తెలంగాణలో ఏ ప్రదేశం నుంచి ఏ ప్రదేశం వరకు నిర్వహించారు? శంషాబాద్ నుంచి అలంపూర్
125. 2013, జూన్ 14న జరిగిన అసెంబ్లీ ముట్టడి ఆందోళనా కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్‌సీసీ గేట్ దగ్గర ఒంటికి నిప్పంటించుకొని ఆత్మబలిదానం చేసుకొన్న విద్యార్థి ఎవరు? యాదయ్య
126. జనగణమన అధినాయక జయహే భారత భాగ్య విధాత అనే గీతానికి అనుకరణలో జనగణమన తెలంగాణకు జయహే వీరుల విజయ పతాకా అన్న గీతం రాసింది ఎవరు? - నెకోరా
127. 1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమంలో భాగంగా ఖమ్మంలో అన్నాబత్తుల రవీంద్రనాథ్ దీక్షతో (1969 జనవరి 8) పాటుగా పాల్వంచలో జనవరి 10 నుంచి 23 వరకు KTPS ఉద్యోగాల కోసం నిరాహారదీక్షలో ఎవరు కూర్చున్నారు? పోటు కృష్ణమూర్తిని
128. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో తొలి బాంబు కేసు ఖమ్మంలో రవీంద్రనాథ్ దీక్షను భగ్నం చేయాలనుకున్న నాటి హోంమంత్రి జలగం వెంగళరావుపై వేయటం. ఈ బాంబ్ ప్రయోగం చేసింది ఎవరు? గట్టు మోహన్‌రావు [విద్యార్థి సంఘం నాయకుడు]
129. విద్యార్థి సంఘం నాయకుడు గట్టు మోహన్‌రావు నాయకత్వంలో తొలి దశ తెలంగాణ ఉద్యమంలో తొలి బాంబు కేసు నమోదు అయ్యింది. ఈ బాంబ్ ప్రయోగం ఎవరిపైన జరిగింది? హోంమంత్రి జలగం వెంగళరావుపై
130. 1969 మార్చి 28న విద్యార్థులు తగులబెట్టిన రైల్వే స్టేషన్ పేరు? జామియా ఇస్లామియా రైల్వే స్టేషన్‌ను [ఈ సందర్భంగా పోలీసులు ఇద్దరు విద్యార్థులను మంటల్లోకి తోశారు. ఆ ఇద్దరూ ఉస్మానియా ఆస్పత్రిలో మృతిచెందా రు. 1. ఖమ్మం జిల్లా గార్లకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ప్రకాశ్ జైన్ కాగా, 2. సర్వారెడ్డి]
131. తరతరాల స్వప్నాల సుందరఫలం, స్వైర భారత భూమి చూపడెనోలేదో, విషం గుప్పించి నొప్పించినాడు, మా నిజాం రాజు జన్మ జన్మల బూజు అని రాసినది? దాశరథి కృష్ణమాచార్య
132. 1952లో ముల్కీ ఉద్యమాన్ని స్పందించిన తొలి వ్యక్తి? జి.రామాచారి [డ్రామాచారి] [ఆయన గుల్బర్గా జిల్లాకు చెందినవాడు]
133. తెలంగాణ రైతు సంఘం ప్రథమ మహాసభ 1954 సెప్టెంబర్‌లో ఎక్కడ జరిగింది? హన్మకొండలో
[ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి అధ్యక్షులు. ఆరుట్ల రామచంద్రారెడ్డి కార్యదర్శి]
134. తెలంగాణ రైతు సంఘం ప్రథమ మహాసభ 1954 సెప్టెంబర్‌లో హన్మకొండలో జరిగింది. దీని అధ్యక్షుడు? ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి అధ్యక్షులు [ఆరుట్ల రామచంద్రారెడ్డి కార్యదర్శి]
135. హన్మకొండలో జరిగిన ప్రథమ తెలంగాణ రైతు సంఘం మహాసభకి కార్యదర్శి? ఆరుట్ల రామచంద్రారెడ్డి
136. తెలంగాణ రైతు సంఘం ప్రథమ మహాసభ ఎక్కడ జరిగింది? హన్మకొండలో
137. 1980లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జలగం వెంగళరావుపై పోటీ చేసి ఓటమి చెందిన కవి? కాళోజీ
138. హైదరాబాద్ రాష్ట్రంలో మిలిటరీ పరిపాలన జరిగిన కాలం? 1948 సెప్టెంబర్ 18- 1949 డిసెంబర్ 1
139. 1951 జనాభా లెక్కల ప్రకారం నైజాం రాజ్యంలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య? 90 లక్షలు
140. ఇనాం భూమి రకాలలో కుదిరి మాన్యం అంటే? గుర్రం రక్షణకు ఇచ్చేది (కన్నడంలో కుదిరి అంటే గుర్రం)
141. హైదరాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని (ఆర్ట్స్ కాలేజీ -1918) ఎవరి జాగీరులో స్థాపించారు? చందాబాయి మహల్లేఖ [ఆమె జమీందారిణి, గొప్ప నర్తకి]
142. అందెశ్రీ తెలంగాణ గీతం జయజయహే తెలంగాణ జననీ జయకేతనంను ప్రప్రథమంగా 2003లో జరిగిన ఏ సభలో పాడారు? "ఆదిలాబాద్" తెలంగాణ రచయితల వేదికపై
143. నా తెలంగాణ కోటి రతనాల వీణ అను కవితల సంకలనం ఎవరి సంపాదకత్వంలో విడుదల అయ్యింది? డా. గంటా జలంధర్‌రెడ్డి [తెలంగాణ సాంస్కృతిక మండలి, హైదరాబాద్]
144. హైదరాబాద్‌లో మెహదీపట్నం అనే పేరు ఎవరి పేరు మీదుగా వచ్చింది? నవాబు మెహదీ నవాజ్ జంగ్ [6వ నిజాం మహబూబ్ అలీఖాన్ ప్రధాని అయిన కిషన్ ప్రసాద్ మిత్రుడు]
145. అక్బర్ ఆస్థాన విదూషకుడు? రాజా తోడర్‌మల్ [6వ నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ ప్రధాని అయిన కిషన్ ప్రసాద్ అక్బర్ ఆస్థాన విదూషకుడు తోడర్‌మల్ వారసుడు]
146. మృత్యుంజయులు పేరుతో తెలంగాణ ప్రజల జీవితాల్ని, వారి పోరాట ప్రారంభ దశను చిత్రించి మొదటి నవల రాసింది? బొల్లిముంత శివరామకృష్ణ
147. తెలంగాణ ప్రజల జీవితాల్ని, వారి పోరాట ప్రారంభదశను చిత్రిస్తూ వచ్చిన మొదటి నవల? మృత్యుంజయులు
148. సలాం హైదరాబాద్ నవలా రచయిత ఎవరు? పరవస్తు లోకేశ్వర్
149. కొలిమంటుకున్నది అనే విప్లవ నవలా రచయిత ఎవరు? అల్లం రాజయ్య
150. దాశరథి కృష్ణమాచార్యులు వరంగల్‌లో అరెస్ట్ అయి ఏ జిల్లా జైలుకి తరలించినప్పుడు ఖిల్లా జైలు గోడపై నా తెలంగాణ కోటి రతనాల వీణ అని బొగ్గుతో రాశారు? నిజామాబాద్ జైలుకు
151. 6వ నిజాం కాలంలోని కట్టడాలు? హైదరాబాద్‌లో పబ్లిక్ గార్డెన్ (బాగ్-ఏ-ఆం), నిజాం కాలేజీ - 1887, చంచల్‌గూడ జైలు, నాంపల్లి రైల్వే స్టేషన్, ఫలక్‌నుమా ప్యాలెస్, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్
152. పొక్కిలి కవితలు ఎవరి సంపాదకీయంలో 2002లో అచ్చు అయ్యాయి? జూలూరి గౌరీశంకర్
153. దేశంలో తొలి ముస్లిం మహిళా మంత్రి? మసూమా బేగం [దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో పనిచేసి తొలి ముస్లిం మహిళా మంత్రిగా పేరు తెచ్చుకున్నారు]
154. 2013, సెప్టెంబర్ 29న సకల జనభేరి ఎక్కడ నిర్వహించారు? హైదరాబాద్ నిజాం కళాశాలలో
155. గులాంకీ జిందగీ సే మౌత్ అచ్చాహై (బానిస బతుకు కంటే చావు మేలు) అని పిలుపు ఇచ్చింది? కేవీ రంగారెడ్డి
156. "తెలంగాణ ప్రజ సింహం వంటిది. అది నిద్రిస్తూనే ఉంటుంది. లేచిందా పంజాతో కొడుతుంది" అన్నది ఎవరు? దాశరథి కృష్ణమాచార్య
157. ఇబ్రహీం 1592లో గోల్కొండ నుంచి రాజధానిని ఎక్కడికి మార్చాడు? హైదరాబాద్‌కు
158. ఇబ్రహీం గోల్కొండ నుంచి హైదరాబాద్‌కు రాజధానిని ఎప్పుడు మార్చాడు? 1592లో
159. ఆది హిందూ భవన్‌ను ఎక్కడ స్థాపించారు? ఛాదర్ ఘాట్
160. శ్రీ కృష్ణ కమిటీ ఎప్పుడు ఏర్పడింది? 2010, ఫిబ్రవరి 3న
161. ఆదిలాబాద్ గోండ్‌లపై అధ్యయనం చేయడానికి నిజాం రాజు పిలిపించిన జర్మన్ మానవ శాస్త్రవేత్త ఎవరు? హైమన్ డార్ఫ్
162. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో మునగాల జమీందార్ ఎవరు? నాయని వెంకట రంగారావు బహద్దూర్ (1875-1958)
163. తెలంగాణ తొలి ఉద్యమ కాలంలో 1969లో తెలంగాణ పటాన్ని ఆవిష్కరించింది ఎవరు? T పురుషోత్తమరావు
164. గూండాయిజం వ్యతిరేక దినం ఎప్పుడు జరిగింది? 1969, జూన్ 3న
165. సికింద్రాబాద్‌లోని సర్దార్ పటేల్ రోడ్డును[ఎస్‌పీ రోడ్] ఒకప్పుడు ఇంగ్లిష్‌వారు ఏమని పిలిచేవారు? "అలెగ్జాండర్ రోడ్"
166. 3వ అసఫ్‌జా ఎవరు? సికిందర్‌జా [సికందరాబాద్]
167. రవీంద్రభారతి 1961లో ఎవరి చేతులమీదుగా ప్రారంభమైంది? రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్
168. హైదరాబాద్‌లో మొదటి రైల్వే లైన్? వాడి - హైదరాబాద్
169. చేతు జాగీరు అంటే? గ్రామంలోని 1/4వ వంతు ఆదాయం ప్రభుత్వానికి చేరే జాగీరు
170. జాగీర్ మదదమాష్ అంటే? మత సంస్థలను సంరక్షించే వారికి ఇచ్చే జాగీర్
171. మఖ్తాలు అంటే ఏమిటి? కొందరు సంస్థాన గ్రామాల్లోని భూమిలో కొంత భాగాన్ని పొందేవారు. వీరిని మఖ్తేదార్ అంటారు. మఖ్తాలు రెండు రకాలు. 1. పన్‌మఖ్తా - మఖ్తేదార్ కొంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 2. మాఫీమఖ్తా - పన్ను చెల్లించాల్సిన అవసరం లేని మఖ్తా జాగీరు.
172. హైదరాబాద్‌లో ఆంధ్ర భాషా నిలయాన్ని స్థాపించింది ఎవరు? కొమర్రాజు లక్ష్మణరావు
173. 'జాయిన్ ఇండియా' ఉద్యమ నేత ఎవరు? రామానంద తీర్థ
174. ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు స్థాపించారు? 1918
175. హైదరాబాద్ రాజ్యంలో పేపర్ కరెన్సీని ప్రవేశపెట్టిన సంవత్సరం? 1918
176. 'ఉస్మానియా సిర్కా'ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1919
177. హైదరాబాద్ రాజ్యంలో పోలీస్ శాఖను ఎప్పుడు నెలకొల్పారు? 1865
178. సాలార్జంగ్ భూమి శిస్తు కోసం సర్వేలు, సెటిల్‌మెంట్‌ను ప్రవేశపెట్టిన సంవత్సరం? 1875 [పోలీస్ శాఖను నెలకొల్పిన 10 సం.ల తర్వాత]
179. ఏ పాలకుడి కాలంలో మూసీనదికి భారీ వరదలు వచ్చాయి? మహబూబ్ అలీఖాన్
180. 'మర్కెంటైల్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్' స్థాపకులు ఎవరు? రాజా పన్నాలాల్
181. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ నిజాం ఎవరు? అఫ్జల్ ఉద్దౌలా
182. 1766లో బ్రిటిషర్లకు ఉత్తర సర్కారులను అప్పగించిన అసఫ్‌జాహీ పాలకుడు? నిజాం అలీ
182. 1766లో ఒక ఒప్పందం ద్వారా [త్రిచినోపలి యుద్ధం] నిజాం బ్రిటీష్ వారికి ఇచ్చిన ప్రాతం? ఉత్తర సర్కారులు
182. బేరార్, రాయచూర్ జిల్లాలను బ్రిటిషర్లకు అప్పగించిన అసఫ్‌జాహీ పాలకుడెవరు? నాజర్ ఉద్దౌలా
183. మొదటి సాలార్జంగ్ ఏ సంవత్సరంలో 'నిజాం దివాన్'గా నియమితుడయ్యాడు? 1853
184. హైదరాబాద్‌లో వహాబీ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు? ముబారిజ్ ఉద్దౌలా
185. వహాబీ ఉద్యమం ఎవరి పాలనా కాలంలో ప్రారంభమైంది? నాజర్ ఉద్దౌలా
186. అసఫ్‌జాహీల రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్‌కు మార్చినవారు? నిజాం అలీ
187. చందూలాల్ ఏ అసఫ్‌జాహీ పాలకుడి వద్ద పేష్కారుగా పనిచేశాడు? సికిందర్ జా
188. భోపాల్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? మరాఠాలు, నిజాం రాజు
189. ఫాల్కేడ్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? నిజాం రాజు, మరాఠాలు
190. రెండో కర్ణాటక యుద్ధంలో నాజర్ జంగ్‌కు మద్దతు ఇచ్చినవారు? డచ్చివారు
191. నాజర్‌జంగ్‌ను హత్య చేసిందెవరు? హిమ్మత్‌ఖాన్
192. హైదరాబాద్‌పై ఆధిపత్యం కోసం జరిగిన పోరాటంలో ముజఫర్ జంగ్‌కు మద్దతు ఇచ్చినవారు? ఫ్రెంచ్‌వారు
193. లక్కిరెడ్డిపల్లిలో ముజఫర్ జంగ్‌ను హత్య చేసిందెవరు? కర్నూలు, కడప నవాబులు
194. అసఫ్‌జాహీల మొట్టమొదటి రాజధాని? ఔరంగాబాద్ [1763లో 2వ నిజాం అయిన నిజాం అలీఖాన్ రాజధానిని ఔరంగాబాద్ నుండి హైదరాబాద్‌కి మార్చాడు]
195. నిజాం రాష్ట్రం ఆవిర్భవించిన సంవత్సరం? 1724
196. నిజాం రాజ్యంలో North West వాయవ్య మండలానికి కేంద్ర స్థానం ఏది? ఔరంగాబాద్
197. రోహెల్లా సైన్యాన్ని రూపొందించినవారు? వాసుదేవ ఫడ్వే
198. హైదరాబాద్‌లో తొలి 'బ్రిటిష్ రెసిడెంట్' ఎవరు? కిర్క్ పాట్రిక్
199. సరైంది ఏది? 1862 - పోస్టల్ శాఖ ప్రారంభం
200. 'హలిసిక్కా' ప్రాంతీయ ముద్రణాలయం ఎక్కడ ఉంది? గద్వాల్
201. మొదటి సాలార్జంగ్ (తురాబ్ ఆలీఖాన్) ఎక్కడ జన్మించారు? బీజాపూర్ [బీజాపూర్/విజయపుర, కర్ణాటక]
202. హైదరాబాద్‌లో భూమిశిస్తు సంస్కరణలకు కారకుడైన బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు? మెట్‌కాఫ్
203. సికందర్ జా కాలంలో హైదరాబద్‌లో ల్యాండ్ రెవెన్యూ రీఫాంస్ తీస్కొచ్చిన బ్రిటీష్ రెసిడెంట్ ఎవరు? మెట్‌కాఫ్
204. "దారుషిఫా"[జనరల్ హాస్పిటల్] కట్టించిన కుతుబ్‌షాహి సుల్తాన్ ఎవరు? మహ్మద్/ మహ్మద్ కులీ కుతుబ్ షా [హైదరాబాద్ నిర్మాత]
205. గోల్కొండ కోటపైన అత్యంత ఎత్తైన ప్రదేశానికి పేరు? బాల్ హిస్సార్
1. హైదరాబాద్ రాజ్యాన్ని నిజాంలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు పరిపాలించారు? 1724 నుంచి 1948
2. సాలార్జంగ్-1 ప్రధానిగా పనిచేసిన కాలం? 1853 నుంచి 1883
3. మొదటి సాలార్‌జంగ్ అసలు పేరు? తురబ్ అలీఖాన్
4. సాలార్జంగ్-1 జీతంపై పనిచేసే తాలూక్‌దార్లను (కలెక్టర్లు) ఏ సంవత్సరంలో నియమించాడు? 1855లో
5. హాలీసిక్కాని ముద్రించే కార్యాలయాన్ని సాలార్జంగ్-1 ఎక్కడ ఏర్పాటు చేశాడు? హైదరాబాద్‌లో
6. సాలార్జంగ్ జిలాబందీ పద్ధతిని ఎప్పుడు ప్రవేశపెట్టాడు? 1865లో [దీని ప్రకారం రాజ్యాన్ని 14 జిల్లాలుగా విభజించాడు]
7. తాలూక్‌దార్ల పని విధానాన్ని పర్యవేక్షించడానికి సాలార్జంగ్ ఏర్పాటు చేసిన బోర్డ్? మజ్లిస్-ఎ-మల్‌గుజారి
8. 1868లో మొదటి సాలార్‌జంగ్ నలుగురు మంత్రులను నియమించాడు. ఈ మంత్రిమండలిని ఏమని అని పిలిచేవారు? సాదర్-ఉల్ మహం
9. దారుల్-ఉల్-ఉలూమ్ అనే ఆంగ్ల పాఠశాలను ఎప్పుడు స్థాపించబడింది? 1855లో
10. రాజ కుటుంబ పిల్లల కోసం స్థాపించిన బడి? మదర్సా-ఇ-ఐజా
11. సాలార్జంగ్ ఏర్పాటు చైసిన పోలీస్ శాఖను పేరు? మహకామ-ఇ-కొత్వాలి
12. ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ చేత నీటి పారుదల ఇంజినీర్‌గా నియమించబడినవాడు? అలీ నవాజ్ జంగ్
13. 1908లో హైదరాబాద్లో మూసీకి వరదలు వచ్చిన తర్వాత ఎవరి సూచనల మేరకు మూసీపై ఆనకట్టల నిర్మాణం చేశారు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య
14. మీర్ ఆలం ట్యాంక్ 1810లో ఎవరిచే చేత నిర్మించబడింది? మీర్‌ఆలం
15. గండిపేట ఉస్మాన్ సాగర్ (1919), హిమాయత్ సాగర్ (1927) నిర్మించినది? మీర్ ఉస్మాన్ అలీఖాన్
16. నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తి అయ్యింది? 1932 ఇది ఏడో నిజాం నిర్మించాడు [1923 అక్టోబర్ నుంచి 1930 వరకు నిర్మాణం జరిగి,32లో పూర్తి అయ్యింది]
17. పాలేరు రిజర్వాయర్‌ను ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెం గ్రామంలో నిర్మించారు. ఈ నిర్మాణం ఎప్పుడు పూర్తి అయ్యింది? 1929లో [వైరా ప్రాజెక్టు 1923లో పూర్తయ్యింది]
18. దక్షిణ భారతంలో బ్రిటిష్ సైన్యానికి కేంద్రం? బొల్లారం
19. నిజాం గ్యారంటీడ్ రైల్వే వ్యవస్థ 1883లో వచ్చిన తర్వాత వాడీ-సికింద్రాబాద్-రైల్వేలైన్ ఎక్కడి నుండి బెజవాడ వరకు పొడిగించబడింది? వరంగల్ నుంచి బెజవాడ
20. నాంపల్లి రైల్వేస్టేషన్‌ను నిజాం ఎప్పుడు నిర్మించాడు? 1907లో [దీన్ని పూర్వం హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషన్ అని పిలిచేవారు]
[ఉర్ధూ బాషలో నామ్ అంటే తడి అని, పల్లి అంటే ప్రాంతం అని అర్థం] [ముందు గూడ్స్ రైల్లు నడిచేవి. మొదటి ప్యాసింజర్ రైలు 1921లో ప్రారంభమైంది]
21. కాచిగూడ రైల్వే స్టేషన్ ఎప్పుడు నిర్మించారు? 1916లో [ఇది 1950 వరకు నిజాం రాజ్య గ్యారంటీడ్ రైల్వేస్టేషన్ హెడ్ క్వార్టర్‌గా ఉంది. గోథిక్ ఆర్కిటెక్చర్‌తో నిర్మించబడింది]
22. హైదరాబాద్ సంస్థానానికి సొంత విమానయాన వ్యవస్థ ఉంది. దీని హెడ్‌క్వార్టర్? బేగంపేట [1930 నుంచి నిజాం గ్యారంటీడ్ స్కీం కింద పనిచేసి తర్వాత, 1938 నుంచి రైల్వే బోర్డు ఆధీనంలోకి వచ్చింది]
23. హైదరాబాద్‌లో మొదటి టెలిఫోన్ సౌకర్యాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1885లో
24. 1920లో కార్ఖానా జిందా తిలిస్మాత్‌ను హైదరాబాద్‌లో నిర్మించినది ఎవరు? మొహినుద్దీన్ ఫారూకీ [దీని నుంచి జిందా తిలిస్మాత్, ఫారూకీ దంత్‌మంజన్ ఉత్పత్తి అవుతున్నాయి]
1.క్రొనలాజికల్ ఆర్డర్:
- నిజాం అలీఖాన్
- సికందర్ జా
- నాసిరుద్దౌలా
- మహబూబ్ అలీఖాన్
1857 తిరుగుబాటు సమయంలో హైదరబాద్ నిజాంకి సహాయపడ్డ సంస్థానాదీశుడు? రాజారామేశ్వర్ రావు - వనపర్తి
హైదరాబాద్ పైన జరిగిన పోలీస్ ఆక్షన్‌కి ఇంకో పేరు? గొడార్డ్ ప్లాన్
ఏ లంబాడా నాయకుడు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో "విసునూర్ దొరకి" వ్యతిరేకంగా పోరాడాడు? జాతోత్ థానూ నాయక్
తెలంగాణతల్లి విగ్రహ రూపకల్పనలో భాగస్వాములు ఎవరు? బీ.ఎస్ రాములు, పసునూరి దయాకర్, ఆచార్య గంగాధర్
1969 జైతెలంగాణ ఉద్యమ కాలంలో ఎవరు ముందు ఆమరణ దీక్ష ప్రారంభించారు? రవీంద్రనాథ్/అన్నాబత్తుల రవీంద్రనాథ్
జతపరచండి:
- తెలంగాణ ఇంఫర్మేషన్ ట్రస్ట్= 1986
- తెలంగాణ స్టూడెంట్స్ ఫోరం= 1991
- తెలంగాణ ఐక్యవేదిక= 1997
- తెలంగాణ జనసభ= 1998
క్రొనలాజికల్ ఆర్డర్:
సకలజనులసమ్మె
మిలియన్ మార్చ్
సడక్‌బంద్
సాగరహారం
తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ ఎవరు? ఎం. రాజేందర్ రెడ్డి
సరి అయిన జత:
- బెల్లయ్య నాయక్= లంబాడి హక్కుల పోరాట సమితి
- బెల్లి కృష్ణ= గొల్ల, కురుమ హక్కుల పోరాట సమితి
- వాలిగి ప్రభాకర్= ఎరుకల హక్కుల పోరాట సమితి
సకలజనుల సమ్మెకి పిలుపునిచ్చింది? తెలంగాణ జేఏసీ
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుని సుశీల్‌కుమార్ శిండే లోక్‌సభలో ఎప్పుడు ప్రవేశ పెట్టాడు? ఫిబ్రవరి 13, 2014
25. వరంగల్‌లో అజమ్‌జాహీ మిల్స్‌ను ఎప్పుడు స్థాపించారు? 1934లో
26. 1941లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో ప్రభుత్వ బ్యాంక్ ఏది? హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ [ప్రస్తుతం దానిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అని పిలుస్తున్నారు]
27. 1887లో నిజాం కళాశాలను స్థాపించారు. దీని మొదటి ప్రిన్సిపల్? డా. అఘోరనాథ ఛటోపాధ్యాయ
28. తెలంగాణకు రక్షణలు అమలైతే చాలంటూ 'భావ సమైక్యత ప్రజా సంఘటన' అనే సంస్థను 1969లో ఎవరు స్థాపించారు? స్వామి రామానంద తీర్థ
29. 1969 ఉద్యమ సమయంలో 8 సూత్రాల పథకంకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలపైన అధికార పార్టీ వారితో కాకుండా ఉద్యమంలో ఉన్నవారితో చర్చలు జరిపితే ఫలితం ఉంటుందంటూ ఇందిరాకి లేఖ రాసిన పాత్రికేయులు? పొత్తూరి వెంకటేశ్వరరావు
30. తెలంగాణ కోర్కెల దినం/ Demands? మే 1
31. తెలంగాణలో ఉద్యోగులు సార్వత్రిక సమ్మె ఎప్పుడు చేశారు? జూన్ 10 నుంచి జులై 16 [37 రోజులు]
32. అసెంబ్లీ ముందు తెలంగాణ ఇవ్వాలంటూ దీక్ష చేసిన ఆంధ్ర మాజీ ఎమ్మెల్యే? పట్టాభిరామయ్య
33. 1969 మార్చిలో ముల్కీ నిబంధనలపై పార్లమెంటులో చర్చకు రాగా, తెలంగాణకు మద్దతుగా ప్రసంగించిన ఆంధ్ర నేత, అప్పటి సోషలిస్టు పార్టీ ఎంపీ? ఎన్‌జీ రంగా [హిందీ మాట్లాడేవారికి నాలుగు రాష్ట్రాలున్నప్పుడు తెలుగు మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేంటని రంగా చాలా బలంగా వాదించారు. తెలంగాణ ఎంపీల కంటే బలంగా ఆయన మాట్లాడటం విశేషం] [[1969, జనవరి 15న ఉస్మానియాలో మొదలైన ఉద్యమం 1969, నవంబరు 25న విరామం పొందింది. నవంబరు 25న చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ, వీబీ రాజు ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించారు]
34. గన్‌పార్క్‌లో అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన ఎప్పుడు చేశారు? ఫిబ్రవరి 23న
[గన్‌పార్క్: 1969 ఉద్యమంలో చనిపోయిన 369 విద్యార్థుల బలిదానాన్ని గుర్తు చేసుకునేందుకు పబ్లిక్ గార్డెన్స్ దగ్గర ఏర్పాటు చేశారు. ప్రతీ సంవత్సరం జూన్ 2న తెలంగాణ అమరవీరుల దినోత్సవం అన్ని జిల్లాలలో జరుపుకుంటారు. చెక్కింది ఎక్కా యాదగిరి రావు.దీన్ని ప్రారంభం చేసింది అప్పటి హైదరాబాద్ మునిసిపల్ మేయర్ లక్ష్మీ నారాయణ ]
35. "వాడవాడలా పొట్టి శ్రీరాములు విగ్రహాలు పెట్టంగా లేనిది, అమరుల స్తూపం కడితే అభ్యంతరం ఎందుకు" అన్నది? ఈశ్వరీబాయి
36. 1944 భువనగిరి ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు? రావి నారాయణ రెడ్డి
37. హైదరాబాద్ రాష్ట్రంలో 1947లో భారత ప్రభుత్వం తరపున ఏజెంట్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరిని నియమించింది? జే.ఎన్ చౌదరి
38. తెలంగాణలో Marginal, Small Farmers హోల్డింగ్స్ మొత్తం అగ్రికల్చర్ హోల్డింగ్‌లో ఎంత శాతం? 70/78/86/90?
39. ‘మహ్మద్ గవాన్’ దక్కనీలకు వ్యతిరేకంగా అఫాఖీలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ముల్కీ సమస్య మొదటిసారిగా తలెత్తినట్టు కనిపిస్తుంది. ఇతడు ఎవరి ప్రధానిగా పని చేశాడు? మూడో అహ్మద్‌షా
40. ప్రముఖ చరిత్ర కారులు ‘రోమిళ్లా థాపర్’ రచనల ప్రకారం దక్షిణ భారతదేశానికి సింహద్వారమైన ప్రాంతం? దక్కన్ ప్రాంతం
41. ఉర్దూ భాషలో దక్కనీలను ఏమని పిలిచేవారు? ముల్కీలు [అఫాఖీలను గైర్ ముల్కీలుగా పిలిచేవారు]
42. సాలార్‌జంగ్(1853-1883) సంస్కరణలలో భాగంగా అప్పటి వరకు అమల్లో ఉన్న సర్‌బస్తా వ్యవస్థను రద్దు చేసి, నూతన ప్రభుత్వ యంత్రాంగాన్ని క్రమంగా ఏర్పాటు చేశాడు. అయితే ఈ యంత్రాంగంలో ముల్కీలకు కాకుండా, గైర్ ముల్కీలకు ఉద్యోగ అవకాశాలు అధికంగా లభించాయి. సర్‌బస్తా అంటే? మధ్య దళారీ వ్యవస్థ
43. తొలిసారిగా ‘ముల్కీ’ అనే పదం వాడుకలోకి తెచ్చిన గెజిట్ ఏది? 1888 గెజిట్
44. ముల్కీ అనే పదం వాడుకలోకి తెచ్చిన నిజాం? మహబూబ్ [6వ నిజాం]
45. నిజాం సంస్థానంలో ఆర్థిక కార్యదర్శిగా, ఆర్థిక మంత్రిగా విధులు నిర్వహిస్తూ ఇంగ్లీష్ భాష నిపుణత పేరుతో గైర్ ముల్కీలను అనేక కీలకమైన ఉద్యోగాల్లో నియమించిన బ్రిటీషర్? కాసన్ వాకర్ [దీన్ని కిషన్ పెర్షాద్ తీవ్రంగా వ్యతిరేకించి, ఆ ఉద్యోగాలు తాత్కాలికమేనని రాజుతో ప్రకటన చేయించాడు]
46. ఏ సంవత్సరంలో ఉద్యోగ నియామకాలకు రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ తొలి ముల్కీ ఉద్యమ స్ఫూర్తి దాతగా కిషన్ పెర్షాద్ నిలిచాడు? 1910లో
47. "హైదరాబాద్ స్టేట్ సర్వీసుల" పూర్తి స్థాయి సర్వీసు నిబంధనలను ఏ సంవత్సరంలో ఉస్మాన్ నేతృత్వంలో రూపొందించారు? 1919లో
48. హైదరాబాద్ సివిల్ సర్వీస్ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1919లో
49. 7వ నిజాం ఉస్మాన్ తన ప్రధాని సహకారంతో ముల్కీ నిబంధనలను 1919 ఫర్మానా ద్వారా విడుదల చేశాడు. అప్పటి ప్రధాని పేరు? అలీ ఇమామ్
50. ఉస్మాన్ తన రెండో ముల్కీ ఫర్మానాను ఏ సంవత్సరంలో ప్రకటించాడు? 1933
51. 1935లో ‘జామియత్ ఎ రిఫాయమ్ నిజాం లేదా నిజాం సబ్జెక్ట్స్ లీగ్‌ను ఏర్పాటు చేశారు. దీని అధ్యక్షులు ఎవరు? నిజామత్ జంగ్
52. 1935లో ‘జామియత్ ఎ రిఫాయమ్ నిజాం లేదా నిజాం సబ్జెక్ట్స్ లీగ్‌ను ఏర్పాటు చేశారు. దీని కార్యదర్శిగా భాద్యత స్వీకరించింది? బూర్గుల రామకృష్ణారావు
53. ‘హైద్రాబాద్ ఫర్ హైద్రాబాదీస్’ ఎవరి నినాదం? నిజాం సబ్జెక్ట్స్ లీగ్
54. నిజాం రాజ్యాంలోని రాజ్యాంగ సవరణ కోసం ఏర్పడిన కమిటీ? అరవముడు అయ్యంగార్ కమిటీ
55. ముల్కీ నిబంధనలకు అవకాశం ఇచ్చిన ఎంప్లాయ్‌మెంట్ చట్టంలోని 3వ సెక్షన్ అమలు చేయవద్దంటూ తీర్పు చెప్పిన హైకోర్ట్ న్యాయమూర్తి? చిన్నప్పరెడ్డి
56. ముల్కీ నిబంధనలకు అవకాశం ఇచ్చిన ఎంప్లాయ్‌మెంట్ చట్టంలోని 3వ సెక్షన్ అమలు చేయవద్దంటూ హైకోర్టు న్యాయమూర్తి చిన్నప్పరెడ్డి తీర్పు చెప్పిన తేదీ? 1969, ఫిబ్రవరి 3 [ఆర్టికల్ 16(3)ని సంకుచిత ప్రయోజనాలకు అవకాశం ఇచ్చే కోణంలో ఉపయోగించరాదని పేర్కొన్నాడు][మానవహారం జరిగింది కూడా ఫిబ్రవరి 3నే]
57. 1969 ఫిబ్రవరి 3న అప్పటి హైకోర్టు న్యాయమూర్తి చిన్నప్పరెడ్డి, ముల్కీ నిబంధనలకు అవకాశం ఇచ్చిన ఎంప్లాయ్‌మెంట్ చట్టంలోని 3వ సెక్షన్ అమలు చేయవద్దంటూ తీర్పు చెప్పాడు. ఈ తీర్పు నేపథ్యం? కొత్తగూడెం- పాల్వంచ కెటిపిఎస్ ఉద్యోగాల విషయం
58. ముల్కీ నిబంధనలు రాజ్యాంగ బద్ధమేనని సుప్రీంకోర్ట్ ఎప్పుడు ప్రకటించింది? 1972 అక్టోబరు 3
59. 1973లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎవరిని సంతృప్తి పరిచేందుకు 6 సూత్రాల పథకాన్ని ప్రకటించారు? జై ఆంధ్ర ఉద్యమాన్ని/ఆంధ్రులని
60. 6 సూత్రాల పథకంలో మొదటి 5 సూత్రాలు ఉద్యోగ నియామకాల కోసం వివిధ రూల్స్‌ను ప్రతిపాదించాయి. అయితే 6వ సూత్రం ఏమిటి? ముల్కీ నిబంధనలు, ప్రాంతీయ కమిటీ రద్దు
61. 6 సూత్రాలకి రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదం తెలిపారు? 1974 మే 3 [1974 జూలై 1నుంచి నూతన చట్టం అమల్లోకి వచ్చింది]
62. హైదరాబాద్ రాజ్యం విలీనం అనంతరం ఏర్పాటయిన మిలట్రీ ప్రభుత్వం జయంత్ నాథ్ చౌదరీని మిలట్రీ గవర్నర్ జనరల్‌గా నియమించుకొంది. అయితే ప్రధాన పౌర పరిపాలన అధికారిగా ఎవరిని నియమించుకొంది? దత్త ప్రసన్న సదాశివ
63. 1950లో సివిల్ అధికారి వెల్లోడి ఏ తేదీన కింగ్ కోఠిలో 7గురు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేశాడు? జూన్ 12
64. 1950లో ప్రముఖ ఆర్థికవేత్త అయిన ఎవరి సూచనలు అమలు చేయడం ద్వారా హైదరాబాద్ [బూర్గుల ప్రభుత్వం] మిగులు బడ్జెట్‌ను సాధించింది? ఎ.డి.గోర్వాలా కమిటీ
65. సాలార్‌జంగ్ ఏ సంవత్సరంలో ముల్కీలకే ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాడు? 1868 [రెండో సాలార్‌జంగ్, మీర్ మహబూబ్ అలీ ఖాన్ కలిసి చదువుకున్నారు. వారు మంచి మిత్రులు. రెండో సాలార్‌జంగ్‌కు, నాన్‌ముల్కీలకు స్నేహం ఉండటంతో 1884లో పర్షియన్ స్థానంలో ఉర్దూను అధికార భాషగా ప్రవేశపెట్టాడు]
66. తెలంగాణ స్టూడెంట్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఎవరి ఆధ్య్వర్యంలో ఏర్పడింది? కె. మనోహర్‌రెడ్డి [1992లో మనోహర్‌రెడ్డి, కృష్ణమోహన్, జగన్‌రెడ్డి తదితర విద్యార్థుల ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. ఓపెన్ కాంపిటీషన్ స్థానికులు, స్థానికేతరుల్లో ఎవరికి అర్హత ఉంటే వారితోనే సీట్లను భర్తీ చేయాలి. కానీ కేవలం సీమాంధ్ర విద్యార్థులకు మాత్రమే సీట్లు ఇచ్చారు. దీనిపై విద్యార్థులు రాజకీయ పార్టీలకతీతంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అయిన కొత్తిరెడ్డి మనోహర్‌రెడ్డి నాయకత్వంలో 1992లో ఓపెన్‌కోటాలో అర్హత కలిగిన తెలంగాణ విద్యార్థులకు సైతం సీట్లు కేటాయించాలని ఉద్యమించారు]
67. తెలంగాణ ఇంఫర్మేషన్ ట్రస్ట్ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడ్డది? తెలంగాణ ప్రభాకర్ [1987లో హైదరాబాద్‌లోని కాచిగూడ బసంత్ టాకీస్‌లో తెలంగాణ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పలువురు వక్తలు తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న నష్టాలను, అన్యాయాలను, ఉల్లంఘనలను మొదలైనవాటిని ఎప్పటికప్పుడు తెలపడం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. ఫలితంగా ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ 1988 జూలై 14న ఏర్పడింది. ఖైరతాబాద్‌లోని ప్రభాకర్ ఇంటినే సంస్థ కార్యాలయంగా ఉపయోగించారు]
68. తెలంగాణ సమస్యలను మరింత స్పష్టంగా వివరించడానికి మా తెలంగాణ మాస పత్రికను స్థాపించింది ఎవరు? [1989లో తెలంగాణ ప్రభాకర్]
69. ప్రాంతీయ మండలి రద్దువల్ల తెలంగాణ ప్రాంతానికి ప్రభుత్వం ఏ రంగానికి ఎంత కేటాయిస్తుందో తెలిసేదికాదు. కాని తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏర్పాటు వల్ల వీలైనంతవరకు తెలంగాణ ప్రాంతానికి జరిగిన వివక్షపూరితమైన కేటాయింపులను, సాగునీటి రంగంలో, విద్యారంగంలో, ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ నిధుల తరలింపుల్లో జరిగిన అన్యాయాలను ఏ పత్రిక ద్వారా తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ వివరించింది? మా తెలంగాణ పత్రిక [తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా తెలంగాణ పత్రిక మొత్తం 4 సంచికలు, 3 అనుబంధాలు ప్రచురించింది]
70. 1992 మార్చిలో విడుదలైన మొండి మొగుడు - పెంకి పెళ్లాం సినిమాలో హీరోయిన్ పాత్ర తెలంగాణ భాషను, సంస్కృతిని, మహిళలను కించపరిచేలా ఉందని ఒక కరపత్రం రాసి సినీ నిర్మాత, దర్శకులను హెచ్చరించిన సంస్థ ఏది? తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్
71. M.A తెలుగు సిలబస్లో ఆధునిక తెలంగాణ సాహిత్యంలో భాగంగా ప్రఖ్యాత రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి రచించిన ప్రజలమనిషిని తప్పనిసరిగా చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌ను ఘోరావ్ చేశారు. దీంతో తలొగ్గిన అధికారులు ఈ నవలను పాఠ్యాంశంలో చేర్చారు. ఈ ఉద్యమం చేసింది ఎవరు? తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్
72. తెలంగాణలోని ఎయిడెడ్ కళాశాలల్లో బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయడానికి 127 మంది ఆంధ్రప్రాంతం వారిని తెలంగాణకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వుల ఉపసంహరణకు 6-10-1994 నుంచి ఓయూలో ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించింది ఏవరు? కె. మనోహర్‌రెడ్డి [తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్-1992]
73. తెలంగాణ ముక్తి మోర్చా-1993 ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడ్డది? మేచినేని కిషన్‌రావు [కే పురుషోత్తం, సీహెచ్ లక్ష్మయ్య, నాగసేనారెడ్డి, మదన్‌మోహన్‌ల ఆధ్వర్యంలో ఏర్పడింది. ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో చిన్నరాష్ర్టాలను ఏర్పాటు చేయాలని ఈ సంస్థ కోరింది]
74. గాదె ఇన్నయ్య తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన గణాంకాలతో సహా ముద్రించిన దగాపడ్డ తెలంగాణ తొలి సంచికను ఏ సదస్సులో ఆవిష్కరించారు? ఫోరం ఫర్ ఫ్రీడం ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ [పాశం యాదగిరి, పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించిన జర్నలిస్టు గులాం రసూల్‌ఖాన్ స్మారకార్థం తెలంగాణ జర్నలిస్టులు ఈ సభను ఏర్పాటుచేశారు. 1997 జనవరి 19న వివేకవర్ధిని కళాశాల పక్కనే ఉన్న అశోకా టాకీస్ లో ఈ సభ జరిగింది]
75. జయశంకర్ రాసిన పుస్తకం "తెలంగాణలో ఏం జరుగుతోంది" ఏ సదస్సులో ఆవిష్కరించారు? ఫోరం ఫర్ ఫ్రీడం ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ - 1997
76. తొలిసారిగా గద్దర్ అమ్మా తెలంగాణమా - ఆకలి కేకల గానమా పాటను పాడింది ఏ సదస్సులో? ఫోరం ఫర్ ఫ్రీడం ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ - 1997
77. నందిని సిధారెడ్డి రాసిన నాగేటి సాళ్లల్ల - నా తెలంగాణ పాట ఏ సభలో వచ్చింది? సిద్దిపేట సదస్సు- 1997 [రచయితలు, ఉద్యోగులు కలిసి తెలంగాణపై సిద్దిపేట పట్టణంలో సదస్సు నిర్వహించారు]
78. "నిజాం వ్యతిరేక పోరాట అమరవీరుల ప్రాంగణం"గా పేరు పెట్టబడిన సభ ఏది? భువనగిరి సభ [తెలంగాణ హక్కుల సమితి ఆధ్వర్యంలో ఈ సదస్సు 1997 మార్చి 8, 9ల్లో జరిగింది. ఈ సదస్సును ప్రజాకవి కాళోజీ నారాయణరావు ప్రారంభించారు]
79. తెలంగాణ ప్రగతి వేదిక-1997 ఎవరి నేతృత్వంలో ఏర్పడ్డది? ప్రముఖ జర్నలిస్టు రాపోలు ఆనందభాస్కర్ [ఈ వేదిక బతుకమ్మ పండగ కాలాన్ని తెలంగాణ సంస్కృతి పరిరక్షణ దినోత్సవాలుగా ప్రకటించి పలుచోట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించి తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని పెంపొందించింది. తెలంగాణ ఐక్యవేదిక ఆవిర్భావంతో తెలంగాణ ప్రగతి వేదిక అందులోని ఒక భాగస్వామ్య సంస్థగా పనిచేసింది]
80. తెలంగాణ స్టడీస్ ఫోరం అధక్షుడు? గాదె ఇన్నయ్య [ఉపాధ్యక్షుడిగా పిట్టల శ్రీశైలం వ్యవహరించారు]
81. తెలంగాణ ఐక్య వేదిక ఎప్పుడు ఏర్పాటు అయ్యింది? 1997, అక్టోబర్ 14 [ఉస్మానియా లైబ్రెరీ భవనంలో]
82. తెలంగాణ కోసం పనిచేసే ఎన్ని సంస్థలు ఒక్కటిగా మారి 1997 అక్టోబర్ 14న ఉస్మానియా లైబ్రెరీ భవనంలో తెలంగాణ ఐక్యవేదికను ఏర్పాటు చేశాయి? 28 సంస్థలు
83. తెలంగాణ ఐక్య వేదికలో ఎన్ని అంచెల కమిటీలు ఎన్ని? 2 అవి: 1) ఆర్గనైజింగ్ కమిటీ 2) స్టీరింగ్ కమిటీ
84. తెలంగాణ మహాసభను స్థాపించింది? మారోజు వీరన్న [భౌగోళిక తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం ఏర్పడాలనే లక్ష్యం, నినాదంతో మారోజు వీరన్న తెలంగాణ మహాసభను స్థాపించారు]
85. తెలంగాణ ఉద్యమ కమిటీ 1997 జూన్ 18న ఎవరి అధ్యక్షతన ప్రారంభం అయ్యింది? ఇంద్రారెడ్డి [ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి]
86. తెలంగాణ ఉద్యమ కమిటీ 1997లో హైదరాబాద్ చంపాపేటలోని సామ నర్సింహారెడ్డి గార్డెన్‌లో తెలంగాణ ఉద్యమ ప్రతినిధుల సదస్సును నిర్వహించింది. దీనికి అతిధిగా వచ్చింది ఎవరు? శిబూసొరెన్ [చంపాపేటలో నిర్వహించిన ఈ సదస్సు తరువాత ఇంద్రారెడ్డి జై తెలంగాణ పార్టీని ప్రారంభించారు]
87. దళిత బహుజన మహాసభను స్థాపించింది ఎవరు? మారోజు వీరన్న
88. భౌగోళిక తెలంగాణలో బహుజన రాజ్యం కావాలనే లక్ష్యంతో ఏర్పడ్డ సంస్థ? తెలంగాణ మహాసభ [మారోజు వీరన్న]
89. హైదరాబాద్‌లోని మదీనా ప్రాంతంలో "బాద్‌షాహీ అశ్రు ఖానా" నిర్మించిన కుతుబ్‌షాహీ సుల్తాన్ ఎవరు? మొహమ్మద్ [కులీ కుతుబ్‌షా] ఇది షియా ముస్లింస్ మొహర్రం సందర్భంగా ఇమాం హుస్సేన్ త్యాగాన్ని తలుచుకుంటూ సంతాపం ప్రకటించుకునే స్థలం . ఇది చార్మినార్ దగ్గర ప్రాంతంలో ఉంది.
90. "దె బర్న్" గ్రంధకర్త ఎవరు? వి. శ్యాంసుందర్
ఏ సంవత్సరం జనాభా లెక్కలలో అంటరానివారు ఆది హిందువులుగా పేర్కొన బడ్డారు? 1931
మొదటి పంచమ కాంఫరెన్స్ ఎక్కడ జరిగింది? 1917, విజయవాడ
మొదటి పంచమ కాంఫరెన్స్ ఛైర్మన్ ఎవరు? భాగ్యరెడ్డి వర్మ
మొదటి పంచమ కాంఫరెన్స్ తన పేరుని ఏమని మార్పు చేస్కున్నది? ఆది-ఆంధ్రుల సదస్సు [భాగ్యరెడ్డి వర్మ సూచనల మేరకు]
ఆది హిందూ మహసభలో పాల్గొన్నాక ఆ ఇన్స్పిరేషన్‌తో ఉన్నవ లక్ష్మీ నారాయణ రాసిన నవల? మాలపల్లి [ఈ నవలకే రచయిత ' సంగ విజయం' అనే పేరు కూడా పెట్టాడు. ఇందులో కథానాయకుని పేరు సంగదాసు]
ఆది హిందూ వాలంటియర్ ఫోర్స్ ఎవరి నాయకత్వంలో హైదరాబాద్‌లో 1906లో ప్రారంభం అయ్యింది? భాగ్యరెడ్డి వర్మ [మొత్తం వాలంటియర్‌లు 35]
"స్వస్తిక్ దళ్" 1912లో స్థాపించింది? భాగ్యరెడ్డి వర్మ
జగన్మిత్ర మండలి ఎప్పుడు ఏర్పడింది? 1906
జగన్మిత్ర మండలి ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలు లింగంపల్లి, ఇసామియా బజార్‌లో ఎప్పుడు ప్రారంభం అయ్యాయి? 1910
సికందరాబాద్‌లో ఆది హిందూ స్కూల్ స్థాపించింది? ఎం.ఎల్ ఆదయ్య
ఏ సంస్థ చైల్డ్ మ్యారెజెస్, జోగిని, దేవదాసి వంటి దురాచారాల అదుపు కోసం పోరాడింది? మన్య సంఘం
దేవదాసి నిర్మూలనా సంఘం స్థాపించింది? భాగ్యరెడ్డి వర్మ
మన్యసంఘం ప్రెసిడెంట్ గా ఎవరు కొనసాగారు? వాల్దాటి శేషయ్య
మన్యసంఘం ఎక్జిక్యూటివ్ సెక్రెటరీ? భాగ్యరెడ్డి వర్మ
"ద పంచమ" అను ఇంగ్లీష్ మాస పత్రిక 1918లో స్థాపించింది? జె.ఎస్ ముత్తయ్య
మన్యసంఘం ఆది హిందూ సోషల్ లీగ్ గా ఎప్పుడు మారింది? 1922
"ఆది ద్రవిడ సంఘం"[1922] ఏర్పాటు చేసింది? బి.ఎస్. వెంకట్రావ్
పుణేలో స్కల్ప్టర్[శిల్పి]గా పనిచేస్తూ, జ్యోతీభా పూలే ఉద్యమంతో స్పూర్తి పొందినది? బి.ఎస్. వెంకట్రావ్
అరుంధతి లీడర్‌గా ప్రసిద్ధి చెందిన వ్యక్తి? సుబేదార్ సాయన్న
ఎవరి ఛైర్మన్‌షిప్‌లో భాగ్యరెడ్డి వర్మ సికందరాబాద్‌లో అనేక ఉద్యమాలు 1925లో చేశాడు? సుబేదార్ సాయన్న
రిసాల తబ్బి [1859] అను పత్రిక ఏ రకమైన పత్రిక? మెడికల్ జొర్నల్ [హైదరాబాద్‌లో జర్నలిజానికి బీజాలు వేసింది]
హైదరాబాద్‌లో మొదటి ఇంగ్లీష్ పత్రిక? దక్కన్ టైమ్స్ [1864]
1870లో వనపర్తి పాలకులచే ప్రారంభించబడిన ప్రింటింగ్ ప్రెస్ పేరు? బ్రహ్మ విద్యా విలాసం
హైదరాబాద్‌లో ఉర్థూ "పునూన్" పత్రికకి తెలుగు అనువాదంగా వచ్చిన మొదటి తెలుగు పత్రిక? సేద్య చంద్రిక [అనువాద పత్రిక, వ్యవసాయ వివరాలు తెలిపేది]
ఉర్దూ జర్నలిజానికి ఆద్యుడుగా చెప్పబడే మౌల్వీ మొహిబ్ హుస్సేన్ 1892లో ముస్లింలలో బుర్కా వేస్కొడానికి వ్యతిరేకంగా, మరియు ముస్లింలలో సంస్కరణలు తీస్కురాడానికి ప్రయత్నించిన పత్రిక? మౌలిం-ఎ-నిస్వాన్
1909లో మధిరలో క్రైస్తవ మత ప్రచారానికి ప్రారంభించబడ్డ పత్రిక? "సమ్యుక్త సంఘ వార్తా మణి"
మొట్ట మొదటి ఇండిపిండెంట్ తెలుగు పత్రిక తెలంగాణ ప్రాంతంలో? హితభోదిని -1913 [ఇది వారపత్రిక]
హితభోదిని ఏ జిల్లాలో ప్రారంభించబడింది? మహబూబ్‌నగర్ జిల్లాలో
హితభోదిని మొదటి ఎడిటర్? బండారు శ్రీనివాస శర్మ
1917లో గౌలిగూడ కేంద్రంగా స్థాపించబడ్డ దివ్యజ్ఞాన సమాజ పత్రిక? ఆంధ్రమాత
ఆంధ్రమాత ఎడిటర్? స్వామీ వెంకటరావ్ [ఇది సంఘం యొక్క మూఢ నమ్మాకాలతో పాటు, నిజాం ప్రభుత్వాన్నీ ప్రశ్నించేది]
ఒద్ది రాజు సోదరులుగా ప్రసిద్ధి చెందినది ఎవరు? సీతా రామచంద్ర రావు, రాఘవ రంగా రావు
"తెనుగు వార పత్రిక"[1922] ప్రారంభించింది? ఒద్ది రాజు సోదరులు [ఇనుగుర్తి, వరంగల్ జిల్లా నుండి]
1952 ముల్కీ కాలంలో జరిగిన సంఘటనలపైన విచారణకై ఏర్పాటుచేసిన కమీషన్? జస్టిస్ జగన్‌మోహన్ రెడ్డి కమీషన్ [తొలుత వరంగల్ విద్యార్థులు 1952, జూన్ 26 నాన్ ముల్కీ గోబ్యాక్ అని ఆందోళన ప్రారంభించారు. ఈ ఉద్యమానికి ముందుగా స్పందించిన వ్యక్తి జీ రామాచారి. ఆయన గుల్బర్గా జిల్లా చించోలి శాసనసభ్యుడైన లాయక్ అలీ (అప్పటి ప్రధాని) దగ్గర పనిచేశారు. న్యాయవాది, రచయిత. మిలటరీ పరిపాలన సలహా సంఘం సభ్యునిగా పనిచేశారు. ఆయన 1952 ఆగస్టులో హైదరాబాద్ హిత రక్షణ సమితిని స్థాపించారు. నాన్ ముల్కీలు పోవాలని నినాదం ఇచ్చారు]
రైతు గ్రంథాలయాన్ని స్థాపించినవారు? రావి నారాయణరెడ్డి [1941-నల్గొండ జిల్లా చిలుకూరు]
శ్రీ హనుమదాంధ్ర గ్రంథాలయాన్ని స్థాపించిన సంస్థ ఏది? ఆంధ్ర సారస్వత పరిషత్తు
రజాకార్ల చేత ధ్వంసమైన గ్రంథాలయం? శ్రీ హనుమదాంధ్ర గ్రంథాలయం
దేశోద్ధారక గ్రంథమాల స్థాపకుడు ఎవరు? వట్టికోట ఆళ్వారుస్వామి [ప్రజల మనిషి]
వేమన ఆంధ్ర భాషా నిలయాన్ని స్థాపించింది ఎవరు? కొండా వెంకట రంగారెడ్డి
రెడ్డి హాస్టల్ గ్రంథాలయ స్థాపకుడు ఎవరు? రాజ బహద్దూర్ వెంకటరామారెడ్డి
ఏ పుస్తకం గ్రంథాలయ నిర్వహణకు, గ్రంథాలయోద్యమ కారులకు చక్కని సూచనలినిచ్చింది ? తెలంగాణాంధ్రుల కర్తవ్యం [రచయిత- సురవరం ప్రతాపరెడ్డి]
విలువైన శాసనాలను, తాళపత్ర గ్రంథాలను, శిల్పాలను సేకరించి శ్రీరాజరాజనరేంద్రాంధ్ర భాషా నిలయంలో భద్రపర్చినవారు ఎవరు? దూపాటి వేంకటరమణా చార్యులు
రావిచెట్టు రంగారావు గారి జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని లక్ష్మీ నరసమ్మ శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయానికి ఎంత విరాళం ఇచ్చింది? 3000
విజ్ఞాన చంద్రికా గ్రంథమండలిని స్థాపించింది ఎవరు? - కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు
తెలుగుసీమలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిన మొదటి సంస్థ? విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి
ఆంధ్రపరిశోధక మండలికి కార్యస్థానంగా పనిచేసింది? శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం
శ్రీరాజరాజనరేంద్రాంధ్ర భాషా నిలయం కార్యదర్శిగా పనిచేసిన వారు? మాదిరాజు రామకోటేశ్వరరావు
1918 నల్గొండలో ఏర్పాటు చేసిన ఆంధ్ర సరస్వతి గ్రంథ నిలయం కార్యనిర్వాహకులు ఎవరు? షబ్నవీసు వెంకట రామనర్సింహారావు
తెలుగు వారిలో గ్రంథాలయోద్యమంలో మొట్టమొదట పేర్కొనదగిన వ్యక్తి? ముదిగొండ శంకరారాధ్యులు [1872లో శంకరానంద గ్రంథాలయం పేరుతో ఒక గ్రంథాలయాన్ని హైదరాబాద్‌లోని కవాడిగూడలో ఏర్పాటు చేశారు. "సార్వజనిక గ్రంథాలయాన్ని" కూడా సికింద్రాబాద్ లో స్థాపించాడు. వరంగల్‌లో స్థాపించిన "శబ్దానుశాసన ఆంధ్ర భాషా" నిలయానికి తన సొంత ఇంటినే దానం చేసిన వ్యక్తి ఈయన]
యంగ్‌మెన్ ఇంప్రూవ్‌మెంట్ సొసైటీని స్థాపించిన వారు? అఘోరనాథ్ ఛటోపాధ్యాయ [1879]
నిజాం ప్రభుత్వం 1880 నుండి నడుస్తున్న ఒక పౌర గ్రంథాలయం స్వాధీనం చేసుకొని దానికి ఏ పేరుతో నామకరణం చేశారు? అసఫియా స్టేట్ లైబ్రరీ
అసఫియా స్టేట్ లైబ్రరీ సంస్థాపకులు ఎవరు? మౌల్వీ అబ్దుల్ ఖయ్యూం
కేసీఆర్ & టీఆర్ఎస్ పార్టీ:
-1983లో మదన్ మోహన్‌కి పోటీగా ఎన్నికలలో నిలబడి ఓటమి చెందాడు
- కేసీఆర్ 1987-88 నుండి "మినిస్టర్ ఆఫ్ డ్రాట్ & రిలీఫ్" గా ఎన్‌టీఆర్ క్యాబినెట్‌లో పనిచేశాడు.
- 1996లో "ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్"గా చంద్రబాబు క్యాబినెట్‌లో పనిచేశాడు
- ఆంధ్రప్రదేశ్ డెప్యుటీ స్పీకర్‌గా 2000-2001 నుండి పనిచేశాడు [2001 ఏప్రిల్ 27న తన డెప్యుటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ స్థాపించాడు]
- 2014 ఎన్నికలలో గజ్వేల్[మెదక్ జిల్లా] నియోజక వర్గం నుండి ఎం.ఎల్.ఎ గా 19,218 మెజారిటీతో గెలిచాడు మరియు మెదక్ నియోజకవర్గం నుండి ఎం.పీగా 3,97,029 మెజారిటీతో గెలిచాడు.
- మొత్తంగా టీ.ఆర్.ఎస్ 119 అసెంబ్లీ సీట్లకి 63 గెల్చుకుంది మరియు లోక్‌సభ సీట్స్ 11 [మొత్తం 17] గెలిచింది.
2015లో CNN-IBN పాప్యులర్ ఛాయిస్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్-2014, రాజకీయ విభాగంలో అవార్డ్ గెలుచ్కున్నది? కేసీఆర్
కేసీఆర్ విద్యార్హత: మాస్టర్స్ డిగ్రీ ఇన్ తెలుగు లిటరేచర్ [ఉస్మానియా విశ్వవిద్యాలయం]
ఆదిలాబాద్ జిల్లాలో కేసీఆర్‌కి ఒక గుడి ఉంది
1952 ముల్కీ ఉద్యమకాలంలో జరిగిన సంఘటనల విచారణకై ఏర్పాటు చేయబడ్డ కమిటీ? జస్టిస్ జగన్మోహన్‌రెడ్డి [3 సెప్టెంబర్1952 నాటి కాల్పులపై విచారణకు సంబంధించిన విధివిధానాలు సవివరంగా ఖరారుచేస్తూ ప్రభుత్వం జస్టిస్ జగన్మోహన్‌రెడ్డికి 10 సెప్టెంబర్1952 రోజున లేఖ రాసింది]
హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో మొత్తం శాసన సభ్యుల సంఖ్య? 175
హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి సాధారణ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించారు? 1952 ఫిబ్రవరి
1952 నాటి ఎనికల్లో కాంగ్రెస్‌పార్టీ పొందిన స్థానాలు? 93
పీపుల్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్ పార్టీ పేరుతో పోటీ చేసిన కమ్యూనిస్టులు ఎన్ని స్థానాలు పొందారు? 42
రావి నారాయణ రెడ్డి ఎం.పి.గా ఏ స్థానం నుండి గెలుపుపొందారు? నల్గొండ
బూర్గుల రామకృష్ణారావు మంత్రిమండలి చేత ప్రమాణస్వీకారం చేయించినవారు? మీర్ ఉస్మాన్ అలీఖాన్
బూర్గుల మంత్రి వర్గంలోని మంత్రుల సంఖ్య ఎంత? 13
బూర్గుల మంత్రి వర్గంలో న్యాయశాఖ మంత్రి? జగన్నాథరావు
హైదరాబాద్ రాష్ట్ర మొదటి స్పీకర్? కాశీనాథరావు వైద్య
బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వంలో ముఖ్య సలహాదారుడు? ఎం.కె. వెల్లోడి
బూర్గుల మంత్రివర్గంలో సరైన జత:
1. మర్రి చెన్నారెడ్డి- పౌర సరఫరా, వ్యవసాయం
2. కె.వి. రంగారెడ్డి- ఎక్సైజ్
తెలంగాణ నుండి చట్ట సభకు ఎన్నికైన తొలి ఆంధ్రుడు? వి.బి.రాజు [కార్మిక, ప్రణాళికశాఖ]
బూర్గుల రామకృష్ణారావు జన్మించిన జిల్లా? మహబూబ్ నగర్
బూర్గుల రామ కృష్ణారావుగారి రచనను గుర్తించండి:
1. ద డ్రీమ్స్ ఆఫ్ పోయేట్స్
2. కృష్ణ శతకం
3. ఉమర్ ఖయ్యూం
1952 ముల్కీ ఉద్యమం మొదట ఏ జిల్లాలో ప్రారంభమైంది? వరంగల్
ముల్కీ ఉద్యమం సందర్భంగా వరంగల్ లో ఏ తేదీన మొదట విద్యార్థులు ర్యాలీని నిర్వహించారు? 26 జులై 1952
వరంగల్ జిల్లాలో ఏర్పడిన విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి ముల్కి ఉద్యమం పై ఎప్పుడు తీర్మానం చేసింది? 28 జులై 1952
ముల్కీ ఉద్యమంలో భాగంగా విద్యార్థి ఐకాస వరంగల్ లో ఎప్పుడు శాంతియుత ర్యాలీని నిర్వహించింది? 27 ఆగస్టు 1952
'నాన్‌ముల్కీ గోబ్యాక్' ఇడ్లీ సాంబార్ ఘర్‌కోజాన్' నినాదాలతో హైదరాబాద్‌లో, 1952లో ఎప్పుడు ముల్కీ ఉద్యమ ర్యాలీ జరిగింది? సెప్టెంబర్ 2, 1952
హైదరాబాద్ సిటీి కాలేజి సంఘటన ఎప్పుడు జరిగింది? 3 సెప్టెంబర్1952
సిటి కాలేజి సంఘటనతో చెలరేగిన ఆందోళనలను శాంతింపజేయుటలో పాలు పంచుకున్న ప్రముఖుడెవరు?
1. పద్మజానాయుడు 2. డా.జయసూర్య నాయుడు 3. వెంకటస్వామి
ముల్కీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఫతేమైదాన్ బహిరంగ సభ ఎప్పుడు జరిగింది? 1952 సెప్టెంబర్ 5
బూర్గుల ప్రభుత్వం ముల్కీ నిబంధనల పరిశీలనకు మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఎప్పుడు నియమించింది? 7 సెప్టెంబర్ 1952
7 సెప్టెంబర్ 1952 ముల్కీ నిబంధనల పరిశీలన కమిటీలో వారిని గుర్తించండి:
1. కె.వి.రంగారెడ్డి
2. డా.మెల్కోటే
3. పూల్‌చంద్‌గాంధీ
1952 ఆగస్టులో "హైదరాబాద్ హిత రక్షణ సమితి"ని స్థాపించినది? రామాచారి
రామాచారి నేతృత్వంలోని ముల్కీ ఉద్యమాన్ని ప్రోత్సహించిన వారు? హయగ్రీవాచారి
"ది జుడిషియరీ ఐ సర్వడ్" ఎవరి ఆత్మకథ? జస్టిస్ పింగళి జగన్మోహనరెడ్డి
హైదరాబాద్‌లో ముల్కీ ఉద్యమం సందర్భంగా పి.డి. యాక్ట్ కింద అరెస్ట్ అయిన శాసనసభ్యుడు? సయ్యద్ అక్తర్ హుస్సేన్
3 సెప్టెంబర్ 1952 నాటి ముల్కీ ఉద్యమ కారులపై కాల్పుల సంఘటన రిపోర్టులో జస్టిస్ జగన్మోహన్‌రెడ్డి కమిటీ రిపోర్టు పొందుపరిచిన అంశం ఏది.?
1. నాయకులు, ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయ లోపం
2. విద్యార్థులు కొన్ని అపోహలు, భయాల దృష్ట్యా ఆందోళనకు దిగారు
3. రాజకీయ పార్టీలు ఆందోళనలు ప్రారంభించి , విద్యార్థులను ముందుకు తోసారు
సురవరం ప్రతాపరెడ్డిగారు 1951 ఆగస్టులో ఏ పత్రికకు 'తెలంగాణ -తెలుగు పత్రికలు'వ్యాసం రాశారు? సుజాత
మొదటి విశాలాంధ్ర మహాసభ 1950లో ఎవరి అధ్యక్షతన జరిగింది? టి. హయగ్రీవాచారి [వరంగల్ లో]
1954 నాటి రెండో విశాలాంధ్ర మహాసభ అధ్యక్షులెవరు? శ్రీశ్రీ [హైదరాబాద్ లో]
1954 జూన్ 7,8 తేదీలలో ఎక్కడ హైదరాబాద్ కాంగ్రెస్‌లోని తెలంగాణ సభ్యులు 'తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం' తీర్మానాన్ని చేశారు? హైదరాబాద్
విశాలాంధ్ర నినాదాన్ని వ్యతిరేకించిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకుడు?
1. కె.వి.రంగారెడ్డి 2. మర్రి చెన్నారెడ్డి 3. జె.వి. నర్సింగరావు
1952నాటి హైదరాబాద్ శాసనసభ్యులు 175 మందిలో విశాలాంధ్రను సమర్థించిన శాసనసభ్యులెందరు? 103
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును పరిశీలించుటకు ఎస్.కె. థార్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1948
6 సూత్రాల పథకం [21-09-1973] ప్రకారం ఏ అధికరణ సవరణ చేశారు? 32వ సవరణ ద్వారా 371-డి ప్రకారం ఉమ్మడి రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించారు. దీన్ని రద్దు చేయాలని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నది.
చార్మినార్ వాస్తుశిల్పి? మీర్ మొమీన్ అస్త్రాబాదీ
"నిజాం రాష్ట్ర జనసంఘం" మొదటి అధ్యక్షుడు? K V Rangareddy
"గ్రంథాలయోద్యమమే తెలంగాణలో తొలి ఉద్యమం" అన్నది? సురవరం ప్రతాపరెడ్డి
1934 నుంచి 1948 వరకు ఖమ్మం జిల్లాలో గ్రంథాలయోద్యమం వ్యాప్తి చేయడానికి ఎనలేని రీతిన కృషిచేసినది? కోదాటి నారాయణరావు
నిజాం రాష్ట్ర గ్రంథాలయ ప్రథమ మహాసభలు 1925లో ఎక్కడ జరిగాయి? మధిరలో [వడ్డేపల్లి దేశ్‌ముఖ్ పింగళి వేంకటరామారెడ్డి అధ్యక్షతన]
హైదరాబాద్‌లోని రెసిడెన్సీ భవనంపై కాంగ్రెస్ పతాకాన్ని ఎగురవేసిందెవరు? పద్మజా నాయుడు [ఈమె ముత్యాల గోవిందరాజులు నాయుడు మరియు సరోజినీ దేవిల కుమార్తె. పౌరుల స్వేచ్ఛ కొరకు, జాగిర్ధారీ వ్యవస్థకు వ్యతిరేకంగా స్థాపించబడిన స్వదేశీ లీగ్ అనే సంస్థకు అధ్యక్షురాలిగా పనిచేశారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే, ఆమె తన సంపాదకత్వంలో వన్ వరల్డ్ అనే పత్రికను నడిపింది. 1935లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు, రైతుల దుర్భర పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకరావడానికి ఏర్పడిన హైదరాబాద్ సహాయక సంఘానికి ఆమె అధ్యక్షురాలుగా వ్యవహరించారు.
1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. పద్మజ తన కవితా సంకలనం "ది ఫెదర్ ఆఫ్ డాన్" పేరుతో ప్రచురించింది. భారతజాతికి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆమెకు పద్మవిభూషణ్ పురస్కారం దక్కింది]
తెలంగాణ ప్రజాసమితిలో ముఖ్య భూమిక పోషించిన నాయకురాలెవరు? టి.సదాలక్ష్మి
20009లో తెలంగాణ ఉద్యమాన్ని రగిలిచిన సంఘటన ఏది? పోలిస్ నియామక ప్రక్రియలో హైదరాబాద్‌ని ఫ్రీ జోన్‌గా ప్రకటించడం
‘విముక్తి కోసం’ సినిమా నిర్మాత పేరు? నారదాసు లక్ష్మణరావు
తెలంగాణ సాధన కోసం పార్లమెంటు భవనం దగ్గర ఆత్మహుతి చేసుకున్న యువకుడి పేరు? యాదిరెడ్డి
పెద్దమనుషుల ఒప్పందంలోని 14 అంశాలలో 9వ అంశంగా తెలంగాణ ప్రాంతీయ మండలిని ప్రతిపాదించారు. ఈ పెద్దమనుషుల ఒప్పందానికి చట్టభధ్రత కల్పించటానికి [ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసే సంధర్భంలో] "నోట్ ఆన్ సేఫ్‌గార్డ్స్" పేరుతో ప్రవేశపెట్టిన బిల్లుని పార్లమెంట్ ఆమోదించింది. 1956, ఆగష్ట్ 31న రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ ఆమోదముద్ర పడి చట్టంగా మారింది. అయితే ఒప్పందంలోని తెలంగాణ ప్రాంతీయ మండలి కాస్తా, తెలంగాణ ప్రాంతీయ కమిటీగా మారింది.
ఎస్.ఆర్.సీ [రాష్ట్రాల పునర్విభజనా సంఘం] సిఫార్సుల మేరకు 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా రాజ్యంగంలో పేర్కొన్న ఎబిసిడి రాష్ట్రాల వర్గీకరణని[హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనం అయినాక బి గ్రూప్ రాష్ట్రంగా ఉండేది] రద్దు చేసి 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలని [14+6=20, ఎస్.ఆర్.సీ సిఫార్స్ ప్రకారం] ఏర్పాటు చేశారు. 1958లో రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా "తెలంగాణ ప్రాంతీయ కమిటీని" ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రాంతీయ కమిటీకి కార్యవర్గాన్ని ఏర్పరచలేదు. 1958లో కమిటీ ఏర్పడ్డపటికినీ, 1960లో కార్యవర్గం ఏర్పాటయ్యింది.
ఈ కమిటీలో మొత్తం 20 మంది ఉంటారు. ఒక చైర్మన్, డిప్యూటి చైర్మన్ ఉంటారు. వీరిని తెలంగాణకి చెందిన శాసనసభ్యులు ఎన్నుకుంటారు. తొలి చైర్మన్: కె.అచ్యుతరెడ్డి, తొలి డిప్యూటి చైర్మన్: మాసుమా బేగం. [రెండవ చైర్మన్:హయగ్రీవాచారి, చివరి చైర్మన్:కె.రాజమల్లు]
కమిటీ విధులు/అధికారాలు కొన్ని:
1.తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయభూముల అమ్మకానికి ఈ కమిటీ ఆమోదం తప్పనిసరి.
2.తెలంగాణ ప్రాంత ప్రాథమిక, మాధ్యమిక విధ్యాభివృద్ధిని పరిశీలించి అవసరమైన అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తుంది.
3.తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగ నియామకాలని పరిశీలిస్తుంది.
4.తెలంగాణకి సంభంధించిన బిల్లులు ఈ కమిటీ ఆమోదం పొందాలి. ఈ ప్రాంతానికి సంభంధించి ఆర్థిక సంభంధంలేని బిల్లులు[ప్రాంతీయ బిల్లులు] శాసనసభలో ప్రవేశపెట్టే ముందు తప్పనిసరిగా కమిటీ ఆమోదం పొందాలి.
"నోట్ ఆన్ సేఫ్‌గార్డ్స్" చట్టం ప్రకారం ప్రాంతీయ కమిటీకి విస్తృతమైన అధికారాలిచ్చారు. ఇది 1958లొ రాష్ట్రపతి ఉత్తర్వుద్వారా కలిగింది. అయితే మొదటి, రెండవ అధ్యక్షులు [అచ్యుతరెడ్డి,హయగ్రీవాచారి] తెలంగాణకి జరుగుతున్న అన్యాయాలు పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినా, ఆంధ్రపాలకులు నిర్లక్ష్యం చేశారు.
1969, ఏప్రిల్ 11న ఇందిరాగాంధీ తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం "8 సూత్రాల పథకం" చేసింది. ఈ 8 అంశాల్లో 5వ అంశంగా తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధికారాలు పెంచటం జరిగింది. ఇంతలో 1972లో ముల్కి నిబంధనలు "రాజ్యాంగ బద్ధమే" అని సుప్రీం కోర్ట్ తీర్పు చెప్పింది.
దీంతో ఆంధ్రప్రాంతం వాళ్ళు "జై ఆంధ్రా" ఉద్యమం లేవనెత్తారు. ఇక ఈ దెబ్బతో ఇందిరాగాంధి ప్రభుత్వం 1973, సెప్టెంబర్ 21న "6 సూత్రాల పథకం" ద్వారా 1)ముల్కి నిభంధనలనీ 2)తెలంగాణ ప్రాంతీయ కమిటీని రద్ధు చేసింది. ఇలా 1958లో ఏర్పాటైన కమిటీ, 1973లో రద్దు అయ్యింది. అంటే 15 సంవత్సరాల కాలం ఇది పనిచేసింది.
సాలార్జంగ్ దివాన్ అయ్యేటప్పటికి వయసు 24 సంవత్సరాలు. దివాన్ కాకమునుపే ఏ ఇంగ్లీష్ అధికారి వద్ద పరిపాలనా పద్దతులు నేర్చుకొన్నాడు? డైటన్
"సాలార్‌జంగ్ నిజాం రాజ్యవ్యవస్థని పునరుజ్జీవింప చేశాడు" అని వ్యాఖ్యానించింది? విలియం డిగ్బీ
సాలార్జంగ్ ప్రధాని అయ్యే నాటికి నిజాం స్వంత ఖర్చులకి కూడా డబ్బులు లేక స్వంత భూములు, వజ్రాలు వంటివి రోహిలా వర్తకుల వద్ద తాకట్టు పెట్టి ఎన్ని కోట్లు అప్పు చేశాడు? 3కోట్లు
సాలార్జంగ్-1, గతంలో ఉన్న పాలనా విభాగాలని రద్దు చేసి జినాం రాజ్యాన్ని 5 సుభాలుగా చేశాడు. దీన్ని మరలా ఎన్ని జిల్లాలుగా విభజించాడు? 17
సాలార్జంగ్ 1868లో మొత్తం విధులని 4 శాఖలుగా చేసి ఒక్కో శాఖకి ఒక్కో మంత్రిని నియమించాడు. ఈ 4 మంత్రులని "సదర్ ఉల్ మహల్" అని పిలిచేవాళ్ళు. ఈ 4 శాఖలు ఏవి? 1)పోలీస్ 2)న్యాయ 3)రెవెన్యూ 4)ప్రజాసంక్షేమం
విద్య,ఆరోగ్యం,స్థానిక సంస్థలు, తాలుకాదార్ వ్యవస్థని పర్యవేక్షించడానికి సాలార్జంగ్ ప్రారంభించిన పాలనా బోర్డ్? "మజ్లిస్-ఇ-మల్-గుజారి"
బ్రిటీష్ వారికి నిజాం బకాయిపడ్డ ఎన్ని రూపాయల్ని సాలార్జంగ్ రద్దు చేయించాడు? 50 లక్షలు
నిజాం రాజ్యాన్ని సాలార్జంగ్ మొత్తం ఎన్ని రెవెన్యూ జిల్లాలుగా విభజించాడు? 17 [ఈ రెవెన్యూ జిల్లాలని 5 ప్రాంతీయ మండలాలుగా ఏర్పాటు చేశాడు]
జిల్లా న్యాయస్థానాల తీర్పులపైన అప్పీలుకు హైదరాబాద్‌లో స్థాపించబడ్డ ఉన్నత న్యాయస్థానం? "అదాలత్-ఇ-పాదుషాహి"
హైదరాబాద్‌కి ప్రత్యేకంగా ఎన్ని సివిల్ కోర్ట్‌లని సాలార్జంగ్ స్థాపించాడు? 2 సివిల్ కోర్ట్‌లను ["బుజుంగీ దివానీ అదాలత్","కుర్ధ దివానీ అదాలత్"]
సాలర్జంగ్ స్థాపించిన క్రిమినల్ కోర్ట్? "షాందార్ అదాలత్" [ప్రధాన న్యాయమూర్తిని "నాజియా" అని పిలిచేవారు]
సాలార్జంగ్ ఏర్పాటు చేసిన పోలిస్ శాఖకి పేరు? "మహాకాయ్-ఇ-కొత్వాలి" [1867లో రెవెన్యూ శాఖనుండి పోలీస్ శాఖని వేరుచేశాడు. "సోవర్స్" అను పోలీస్‌లని కూడా ప్రతీ జిల్లాకు నియమించాడు]
సాలార్జంగ్ ఏ సంవత్సరంలో నిజాం నాణాలపైన మొఘల్ చక్రవరి పేరు తొలగించి నిజాం నవాబు పేరుతో నాణేలు చలామణి చేశాడు? 1858లో
హైదరాబాద్‌లో మొదటి రైల్వే లైన్ సికింద్రాబాద్-వాడి మధ్య ప్రారంభించబడి, ఎప్పుడు పూర్తి అయ్యింది? 1878లో
సాలార్జంగ్ ఇంగ్లాండ్ వెళ్ళి బీరార్ విషయంలో చేసిన ప్రయత్నాలు తెలిసి నాటి ఏ వైస్రాయ్ ఆగ్రహం తెప్పించాయి? లిట్టన్‌కి
సాలార్జంగ్ మరణానంతరం చాదర్‌ఘాట్ పాఠశాలలోని ఇంటర్మీడియట్ తరగతులని మదర్సా ఇ ఆలియాలో విలీనం చేస్తూ 1887లో ఏర్పడ్డ సంస్థ? నిజాం కాలేజి
గరుడ గంగ అని పిలవబడే ఆలయం? దుర్గాభవాని ఆలయం, నాగసాని పల్లి [ఏడుపాయల జాతర]
ఏడుపాయల జాతర ఎన్ని రోజులు జరుగుతుంది? 3 రోజులు
తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర? నల్లగొండ గొల్లగట్టు జాతర/దురాజ్‌పల్లి జాతర [పెద్దగట్టు జాతర అని కూడా అంటారు. యాదవులు తమకు ఆరాధ్య దైవమైన లింగమంతుల స్వామికి మొక్కులు తీర్చుకోవడానికి ప్రతి రెండేండ్లకోసారి నిర్వహిస్తారు]
నల్లగొండ గొల్లగట్టు జాతర/దురాజ్‌పల్లి జాతర ఎన్ని రోజులు జరుగుతుంది? 4 రోజులు
తేగడ జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? ఖమ్మం
మహబూబ్‌నగర్ కురుమూర్తి జాతర ఎన్ని రోజులు జరుగుతుంది? 19 రోజులు
మన్నెంకొండ జాతర మహబూబ్‌నగర్ జిల్లాలోని మన్నెంకొండ వద్ద జరుగుతుంది. ప్రముఖ దైవం? ఆంజనేయస్వామి
నాగోబా జాతరలో దర్బార్ ఏర్పాటు చేసిన ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త? ప్రొఫెసర్ హైమన్‌డార్ప్ (1946).
హనుమంతుడు ఒకవైపు నర్సింహస్వామి ముఖంతో, ఇంకోవైపున ఆంజనేయస్వామి ముఖంతో రెండు ముఖాలను కలిగి ఉన్న ప్రదేశం ఏది? కొండగట్టు జాతర
20 రోజులపాటు వరంగల్ జిల్లాలో జరిగే జాతర? కొరివి జాతర
టెంపుల్ అల్వాల్ మెవరు నిర్మించారు? చందులాల్ [నసీరుద్దౌలా బహదూర్ దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసినాడు]
రాష్ట్రాల పునర్విభజన కమిషన్ తెలంగాణాకోసం ఏం చెప్పింది? రెండు తెలుగు ప్రాంతాలను కలపడం ఆవశ్యమైతే 1961లో జరిగే శాసనసభ ఎన్నికల తర్వాత తెలంగాణ శాసనసభలోని 2/3వ వంతు మంది సభ్యుల ఆమోదంతో ఆంధ్రాలో విలీనం చేయాలని
కాంగ్రెస్ సూచించిన పేరుని కాదని ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్రానికి పేరుపెట్టింది ఎవరు? పార్లమెంట్ సెలెక్ట్ కమిటీ
1971లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో టీపీఎస్ పార్టీ (పార గుర్తు) ఎన్ని పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది? 10. తర్వాత అది కాంగ్రెస్ పార్టీలో విలీనం అయింది.
తెలంగాణ రీజనల్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది? 1958 [కమిటీ స్థాపించినప్పటి నుండి మొత్తం 4 గురు చేర్మన్‌లుగా ఉన్నారు. వాళ్ళు వరుసగా: అచ్యుత్ రెడ్డి, చెన్నారెడ్డి, హయగ్రీవాచారి, చొక్కారావు ]
తెలంగాణ రీజనల్ కమిటీ అధికారాలను ప్రభుత్వం విస్తృతం చేస్తూ చేసిన పథకం? 8 సూత్రాల పథకం
‘ది మీనింగ్ అండ్ ఎండ్ ఆఫ్ రిలీజియన్’ అనే గ్రంథంలో తెలంగాణ సాయుధ పోరాటం గురించి ప్రస్తావిస్తూ, చైనా తర్వాత ఆసియాలో మరెక్కడా ఇంత పెద్ద ఉద్యమం జరగలేదని పేర్కొన్న రచయిత? విల్‌ఫ్రెడ్ కాంట్‌వెల్ స్మిత్ [కెనడా]
హైదరాబాద్ రాజ్యంలోని ప్రజల వాక్, సభా, పత్రికా స్వాతంత్య్రాలను హరించిన చట్టం? ‘గస్తి నిషాన్-53’
కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేసింది [సీఎస్‌పీ]? ఆచార్య నరేంద్ర
దేవ[ప్రెసిడెంట్] మరియు జయప్రకాశ్ నారాయణ్ [జనరల్ సెక్రెటరీ]-1934
"తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డా నర్సయ్య" పుస్తకం రాసింది? గుజ్జల వీరారెడ్డి
1921లో ఏర్పాటైన ఆంధ్ర జనసంఘం మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 1922 ఫిబ్రవరి 14న
ఆంధ్ర జనసంఘం పేరును నిజాం రాష్ర్ట ఆంధ్ర జనసంఘంగా ఏ సమావేశంలో మార్చారు? మొదటి సమావేశం
నిజాం రాష్ర్ట ఆంధ్ర జనసంఘం ఏ సంవత్సరంలో ఆంధ్ర మహాసభగా రూపొందింది? 1930 [తొలి ఆంధ్ర మహాసభ, జోగిపేట, మెదక్‌లో. అధ్యక్షుడు: సురవరం ప్రతాపరెడ్డి గారు.]
రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, హనుమయ్యలకు ఎన్జీ రంగా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలపై శిక్షణ ఎక్కడ ఇచ్చారు? కృష్ణా జిల్లా, కంకిపాడులో
1.5 లక్షల ఎకరాలు ఉన్న నల్గొండ జిల్లా సూర్యాపేట భూస్వామి? జన్నారెడ్డి ప్రతాపరెడ్ది
తెలంగాణలో సాయుధ పోరాటానికి మొదటి స్ఫూర్తినిచ్చిన సంఘటన? షేక్ బందగీ హత్య
షేక్ బందగీ అన్న? అబ్బస్ అలీ
కమ్యూనిస్టులు విజయవాడను ఏమని పిలుచుకునేవారు? స్టాలిన్ గ్రాడ్
ప్రజా నాట్య మండలి ఏ నాటకం ద్వారా తెలంగాణలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని కొనసాగించింది? మా భూమి, ముందడుగు
నిజాం ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వంతో యథాతథ ఒప్పందం [Stand Still Agreement] కుదుర్చుకున్నది ఎప్పుడు? 1947 నవంబర్ 29న
నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది ఎప్పుడు? 1948 మే 4న
హైదరాబాద్ భారతదేశంలో విలీనమైనప్పటికీ, సాయుధ పోరాటాన్ని భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగించాలని పిలుపిచ్చిన కేంద్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి ఎవరు? బీటీ రణదేవ్
కమ్యూనిస్టులు ఏ తేదీని బ్లాక్ డే లేదా విద్రోహదినం గా జరుపుతారు? సెప్టెంబర్ 17ను [పోలీస్ చర్య ముగిసిన రోజు]
రష్యా సలహా మేరకు కమ్యూనిస్టులు తమ సాయుధ పోరాటాన్ని ఏ తేదీనుండి విరమిస్తున్నట్టు ప్రకటించారు? 1951 అక్టోబర్ 21న
దొడ్డి కొమురయ్య స్వగ్రామం? కడివెండి
తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్ల చేతిలో హత్యకు గురైన తొలి ఆర్యసమాజ కార్యకర్త? డాక్టర్ నారాయణ రెడ్డి
గోండు వీరుడు, గిరిజన జాతి ముద్దుబిడ్డ, కొమరం భీంను నిజాం పోలీసులు హత్య చేసిన తేది? 1940 సెప్టెంబర్ 1
రజాకార్లకు శిక్షణ ఇచ్చే వ్యక్తి పేరు? మీర్‌కాజ్
‘మా భూమి’ అనే ప్రసిద్ధ నాటకాన్ని రాసిన వారు? వాసిరెడ్డి భాస్కరరావు, సుంకర సత్యనారాయణ.
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకత్వం చేపట్టినవారు? పీసీ జోషి
నిజాం సంస్థానంలో అధికారిక రేడియో పేరు? దక్కన్ రేడియో
‘తెలంగాణ ప్రజల సాయుధ పోరాటం’ గ్రంథ రచయిత? దేవులపల్లి వేంకటేశ్వరరావు
భారతదేశంలో సంస్థానాలను రద్దు చేసిన సంవత్సరం? 1956
భాగ్యనగర్ రేడియోను నిర్వహించిన వారు? గడియారం రామకృష్ణారావు
‘ట్రైబల్ హైదరాబాద్’ గ్రంథ రచయిత? హైమన్ డార్ఫ్
తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ సొంత గ్రామం? పాలకుర్తి
భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీలో తొలిసారిగా చీలిక ఏర్పడిన సంవత్సరం? 1964
పాలకుర్తి కుట్రకేసులో నిందితుల తరఫున వాదించిన లాయర్? కొండా లక్ష్మణ్ బాపూజీ
నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతంలో గ్రామాలకు అధికారులు వచ్చినప్పుడు చేసే ఏర్పాట్లను ప్రజలు ఏ పేరుతో పిలిచే వారు – సరభరాహ
తెలంగాణ ప్రాంతీయ సంఘాన్ని పెద్ద మనుషుల ఒప్పందంలో ఏ నిబంధన ప్రకారం ఏర్పాటు చేశారు? 9వ నిబంధన
1958లో చట్టబద్ధంగా ఏర్పడిన తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1960లో; 1973లో ఆ కమిటీ రద్దయింది.
తెలంగాణ ప్రాంత మిగులు నిధులను ఖర్చుపెట్టి అయినా సరే తెలంగాణలోని పాఠశాలల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ ప్రాంతీయ సంఘం ఏ సంవత్సరంలో ప్రభుత్వానికి సిఫారసు చేసింది? 1964
తెలంగాణ ప్రాంతీయ సంఘానికి రెండో అధ్యక్షుడిగా పని చేసింది ఎవరు?హయగ్రీవాచారి
1975 రాష్ట్రపతి ఉత్తర్వు ప్రకారం జోనల్ ఉద్యోగాల్లో స్థానికేతరులకు ఎంత శాతం వరకూ ఉద్యోగాలు కల్పించవచ్చు? 15%
బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణానది నీటిని సమైక్య ఏపికి 811 టిఎమ్‌సిలు కేటాయించగా తెలంగాణ వాటా ఎంత? 299 టిఎమ్‌సిలు
శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతినిచ్చిన ముఖ్యమంత్రి ఎవరు? టంగుటూరి అంజయ్య
ఏ జిల్లా వాసులకు తాగునీటిని అందించేందుకు శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టు లక్ష్యం? నల్లగొండ
భార్గవ కమిటీ పేర్కొన్న ప్రత్యేక తెలంగాణ మిగులు నిధులకుగాను కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లను అదనంగా కేటాయించింది? 17 కోట్లు
1969 ఏప్రిల్ 11లోగా తెలంగాణ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతూ ____ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు? ఆదిరాజు వెంకటేశ్వరరావు
తెలంగాణ సాధన సమితి ఏర్పాటు చేసింది? ఆలె నరేంద్ర
2009 ఎన్నికలలో తెలుగుదేశం తో పొత్తు పెట్టుకున్న తెరాస పోటీ చేసిన 45 MLA సీట్లకి ఎన్ని సీట్లు గెలుచుకుంది? 10 మాత్రమే [2 లోక్‌సభ సీట్స్]
శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్‌లోని అధ్యాయాలు ఎన్ని? 9 [8 వివాదాస్పదం అయిన అధ్యాయం]
నాగిని శిల్పం, ఒక స్త్రీ కాలికి ముల్లు గుచ్చితే తీస్తున్నట్లు చెక్కిన శిల్పం లాంటివి చెక్కింది? రామప్ప
తెలుగులోనే మొదటి శతకం? వృశాధిప శతకం [పాల్కురికి సోమన]
తెలుగులో అచ్చతెనుగు కావ్యం? పొన్నగంటి తెలగన రాసిన యయాతి చరిత్ర
సింహాసన ద్వాత్రింశిక అనే కావ్యం రాసింది? కొరవి గోపరాజు
షట్‌చక్రవర్తి చరిత్ర రాసింది? మల్లారెడ్డి రాజు
వరవరరావు రాసిన ఏ కవిత సంపుటిని అప్పటి ప్రభుత్వం నిషేధించింది? భవిష్యత్తు చిత్రపటం
విష్ణుకుండినులు తెలంగాణాలోని కీసరగుట్ట [హైదరాబాద్ దగ్గర] ప్రాంతాన్ని రాజధాని చేస్కొని పరిపాలించారు
బహమనీలపైనా, కృష్ణరాయలపైనా పోరాడినవాడు? షితాబ్ఖాన్
నిజాం ప్రభువులని, మరాఠాలనీ ఎదిరించినది? రాణి శంకరమ్మ
హరిశ్చంద్ర హెడ, జ్ఞానకుమారి హెడ స్థాపించిన సంఘం- "హరిజన సేవక్ సమాజ్" [హరిజనసేవక్ సంఘ్ గాంధీ స్థాపించాడు.]
తెలంగాణ స్థానం రాజ్యాంగం ప్రకారం? 4వ షెడ్యూల్‌లో తమిళనాడు కింద 25వ స్థానంలో [ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం]
ఆదిలాబాద్ జిల్లాలో? మాంగనీస్ నిక్షేపాలు ఉన్నాయి
స్వాతాంత్ర్యానికి పూర్వం నిజాం సంస్థానంలో 16 జిల్లాలుండేవి. వీటిలో 8 తెలుగు, 5 మరాఠీ, 3 కన్నడ మాట్లాడే ప్రాంతాలు [8+5+3=16].
ప్రస్తుతం తెలంగాణాలో? 459 మండలాలున్నాయి
మెదక్‌ని 200ల సంవత్సరాలు పాలించిన సదాశివరెడ్డి తన పుత్రుని పేరున "సంగారెడ్డి" ప్రాంతాన్ని అభ్హివృద్ధి చేశాడు. దస్ఖిణ భారత్‌లోనే అతి పెద్ద చర్చ్ ఇక్కడ ఉంది. దీన్ని చార్ల్స్ వాకర్ ఫాస్నెట్ 1914-24 మధ్య నిర్మించాడు.
మెదక్ జిల్లాలోని "కొండాపూర్" ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంగా ఉండేది. పాపన్నపేట మండలం, నాగసానిపల్లిలో ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం ఉంది. ఇక్కడ "మంజీర" నది ఏడు పాయలుగా చీలిపోవటంవల్ల దీనికి ఏడుపాయల జాతర అని పేరు. శివరాత్రి రోజు ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. సింగూరు జలాశయాన్ని మంజీర నదిపైన నిర్మించారు. ఈజిల్లాలో మొసళ్ళు, పక్షుల సమ్రక్షణ కోసం "మంజీర సమ్రక్షణా కేంద్రం" ఉన్నది. ఐఐటీ ఇక్కడుంది. మన రాష్ట్రంలో అత్యధిక పరిశ్రమలు ఉన్న ఇండస్త్రియల్ ఏరియా మెదక్.
నల్గొండ జిల్లా శాతవాహనుల కాలంలో? "నీలగిరి"గా పిలవబడేది
ఆలేరు సమీపంలోని కొనలుపాక[కుల్ పాక్] జైన క్షేత్రంలో 24 తీర్థంకరుల విగ్రహాలున్న_____ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది? జేడ్ విగ్రహం
ఏ జిల్లాలో అత్యధికంగా సున్నపురాళ్ళున్నాయి? నల్గొండ అందువల్ల సిమెంట్ ఉత్పాదనలో ఈ జిల్లా మొదటిస్థానంలో ఉంది
"ఛాయా సోమేశ్వరాలయం"[నల్గొండ] ప్రత్యేకత? ఆలయ లింగంపైన పడే నీడ పగలంతా ఒకే చోట కదలకుండా కనిపిస్తుంది
అమ్రాబాద్ పులుల అభయారణ్యం ఏ జిల్లాల మధ్యలో ఉంది? మహబూబ్‌నగర్, నల్గొండ
తెలంగాణాలో మొదటి లిఖిత గ్రంధంగా దేన్ని చెప్తారు[క్రి.పూ 2వ శతాబ్ధం]? గుణాడ్యుడి బృహత్కథని
"రాజ గోండ్"లులో ఉపతెగలు ఏవి? 3 అవి: "మరియాలు, కొంద మరియాలు, భిషోహార్"
భవిష్యత్తుని ఊహించి చెప్పడంలో కొలాములు శ్రేష్ఠులు అనే విశ్వాసం ఎవరిలో ఉన్నది? గోండులలో
గోండుల వీరగాథలు ఇతివృత్తాంతాలుగా పాటలు పాడటం, జన్మవృత్తాంతాలు చెప్పడం, వ్యవసాయం ఏ తెగ వారి ప్రధాన వృత్తులు? పరధాన్లు
దేవతలతో మాట్లాడే "వెజ్జు"[మంత్రగాళ్ళు] ఏ తెగలో కనిపిస్తారు? కొండరెడ్లు [ఖమ్మం]
కోయలు ఎవరిని ఆరాధిస్తారు? సూర్య చంద్రులని
ఏ తెగ వారు తాము భీముని సంతానం అని నమ్ముతారు? కోయలు [కోయలు చిలక జోస్యం చెబుతారు]
ప్రతాపరుద్రున్ని ఎదురించిన కోయవీరుడు ఎవరు? జంపన్న
చెంచుల దేవత? గారెల మైసమ్మ
లంబాడీలను ఏ సం. నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించింది? 1976 [వీళ్ళు కొడుకు పుట్టాలని 'జల్ మాత ' ని పూజిస్తారు]
గిరిజనులు - జాతరలు:
కోయలవారు- సమ్మక్క సారలమ్మ జాతర
గోండులు - నాగోబా, నాగశేష జాతర, పెర్సాపెస్ జాతర
బంజారాలు - శీతల భవానీ, శరభయ్య జాతర
చెంచు వారు - గారెల మైసమ్మ, భగవంతరు జాతర
2015లో తెలంగాణా ప్రభుత్వం ఖైతి లంబాడీ,వాల్మీకి బోయ కులాలని షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించే విషయంలో విచారణకి నియమించిన కమీషన్? "చెల్లప్ప కమీషన్"
"డోక్రా కాస్టింగ్స్", "చేరియాల్ పెయింటింగ్స్", "బంజార అద్దకపు దుస్తులు", "చెక్క నగిషీ రూపాలు" ఏ జిల్లా గిరిజనుల ప్రత్యేకం? ఆదిలాబాద్ గిరిజనుల
నిర్మల్‌లో తయారయ్యే కళాత్మక బొమ్మలు,చిత్రాలు,వస్తువులని తయారు చేసే వర్గాలని ఏమని పిలుస్తారు? "నకాష్"లు అని పిలుస్తారు
నిర్మల్ చేతివస్తువులు, ఇంటి సామాగ్రి, నిర్మల్ పెయింటింగ్స్ అన్నిటిని కలిపి? "నిర్మల్ ఆర్ట్‌వేర్" అంటారు
పౌరాణిక గాధలని కళ్ళకి కట్టినట్టు విశదీకరించే "చెర్యాల్ స్క్రోల్ పెయింటింగ్స్"కు ప్రసిద్ధి? తెలంగాణా. ఈ చెర్యాల్ పెయింటింగ్ కళాకారులని "నకాషీలు" అని పిలుస్తారు. వీటిని "థీం పెయింటింగ్స్" అని కూడా అంటారు.
స్వాతంత్ర్యానంతరం హైదరాబాద్‌కి చెందిన "బబ్బన్ ఖాన్" అనే కళాకారుడు ఉర్థూ భాషలో రాసి, ప్రదర్శించి, గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించిన నాటకం? "అద్రక్క్‌పంజే" ["కుటుంబ నియంత్రణ" కథా వస్తువు]
కాకతీయ రాజైన గణపతిదేవుని బావమరిది, గజసేనాధ్యక్షుడైన జాయపసేనాని నృత్యరత్నావళిలో పేర్కొన్న రెండు నృత్యసాంప్రదాయాలు? "మార్గి, దేశి"
బోనాల్ పండుగ సందర్భలో అమ్మవారి పూజారిణిగా ఏ కులస్తులు బోనాల రోజు ఉపవాసం చేసి తరువాతరోజు "రంగం" పేరుతో భవిష్యవాణి చెబుతారు? ముదిరాజ్ కులస్థులు
'మా భూమి' సినిమా దర్శకుడు ఎవరు? గౌతం ఘోష్ [గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా ఇది. కిషన్ చందర్ రచించిన హిందీ (ఉర్దూ) నవల "జబ్ ఖేత్ జాగే" ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది. ఈ సినిమా మొదటిసారి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం-1980లో ప్రదర్శితమైంది. జూలై 1980లో నిర్వహించిన కార్వే వారీ చలనచిత్రోత్సవంలో, కైరో మరియు సిడ్నీ చలనచిత్రోత్సవాల్లో భారతదేశపు అధికారిక ఎంట్రీ. సిఎన్ఎన్-ఐబీఎన్ వారి వంద గొప్ప భారతీయ చలనచిత్రాల జాబితాలో ఈ సినిమా చోటుచేసుకుంది. ఈ సినిమా క్యాప్షన్: "ఎదురు తిరిగితే ఏముంది? తరతరాల దౌర్జన్యం మట్టి కరుస్తుంది" బి. నర్సింగరావు ఈ సినిమాకి నిర్మాతగా, కథకుడిగా, సంగీత దర్షకుడిగా, నటుడిగా పనిచేశారు]
ప్రముఖ సంఘసంస్కర్త, శ్రీనారాయణ ధర్మపరిపాలనాయోగ విశ్వైద్యాలయ స్థాపకుడు? మహర్షి కార్వే
భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం తర్వాత 1950లో ఏర్పడిన ఎ.డి. గోర్వాలా కమిటీ సూచనల మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అనేక సూచనలు అమలుచేసి మిగులు బడ్జెట్ ఏర్పరుచుకోగలిగిమది అని వీ.పి. మీనన్, తాను రచించిన ఏ గ్రంథంలో చెప్పాడు? "ద స్టోరి ఆఫ్ ది ఇంటెగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్"
రెవెన్యూ బోర్డు స్థానంలో కలెక్టర్ల పరిపాలనా విధానం అమల్లోకి వచ్చిన సంవత్సరం? 1794
హైదరాబాద్‌లో రెడ్డి బాలికల వసతిగృహం స్థాపించుటకు ప్రథమ కారకులు ఎవరు? ఆరుట్ల రామచంద్రారెడ్డి
ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్‌ను నెలకొల్పిన వాడు? కేశవరావ్ కోరాట్కర్
మునగాల జమీందారు నాయని వెంకట రంగారావుకి 'కళాప్రపూర్ణ' బిరుదునిచ్చింది ఎవరు? ఆంధ్రవిశ్వవిద్యాలయం
'విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి' అందించిన మొదటి గ్రంథం? అబ్రహంలింకన్
'విశ్వవిద్యాలయం' అనే పదాన్ని వాడుకలోకి తీసుకువచ్చినవారు? కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
చరిత్రకారులకు గని వంటిది తెలంగాణ అన్నది?- కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
వెయ్యి ప్రదర్శనలకు పైగా వేసిన 'గెలుపు నీదే' నాటకం రచయిత? - కోదాటి లక్ష్మీనరసింహారావు
1969లో తెలంగాణా ప్రాంతానికి చెందిన ఎవరిని ఉపముఖ్యమంత్రిగా నియమించారు? జె.వి.నర్సింగరావును
1959లో నీలం సంజీవ రెడ్డి ప్రభుత్వంలో కేవీ రంగారెడ్డి ఏ పదవిలో పని చేశాడు? రెవెన్యూ మంత్రిగా
ఇందిరా సేవా సదన్ సొసైటీని స్థాపించింది? సంగం లక్ష్మీ బాయి
శాసనసభ ఎన్నికలలో చెన్నారెడ్డి అక్రమ పద్ధతులకు పాల్పడ్డాడనే ఆరోపణతో ఆయన చేతిలో ఓడిపోయి కోర్టులో దావా వేసినది ఎవరు? వందేమాతరం రామచంద్రరావు
వశిష్ట భార్గవ కమిటీలోని సభ్యులు:1. విహారి మాథుర్ 2.హరిభూషణ్
వశిష్ట భార్గవ కమిటీ సిఫారసులు:
1. రాష్ట్రం మొత్తం కేటాయింపుల్లో తెలంగాణకు 40 శాతం నిధులను సమకూర్చాలి
2. పెద్దమనుషుల ఒప్పందాన్ని క్రమబద్ధ్దీకరించాలి
3. 1956-68 మధ్యకాలంలో తెలంగాణ ప్రాంతానికి వాస్తవంగా రావాల్సిన రూ. 44 కోట్లను నాలుగో ప్రణాళికలో ఖర్చు చేయాలి
2009 ఎన్నికలలో టీఆర్ఎస్ "మహాకూటమి": [టీడీపీ,సి.పి.ఎం,సి.పి.ఐ]తో పొత్తుగా పోటీ చేసింది.
- మహాకూటమి ఈ ఎన్నికలలో ఓడిపోయింది
- 9 లోక్‌సభ, 50 అసెంబ్లీ స్థానాలకి పోటీచేసి కేవలం 2 లోక్‌సభ,10 అసెంబ్లీ స్థానాలు గెల్చుకుంది
- ఈ ఓటమితో కేసీఆర్‌కి అత్యంత సన్నిహితుడైన దిలీప్ కుమార్ 2009, ఆగష్ట్ 23న టీఆర్ఎస్ నుండి బయటకి వచ్చి "తెలంగాణ విమోచన సమితి"ని స్థాపించాడు
వైఎస్ఆర్ మరణించాక CM అయ్యింది? రోశయ్య
ఏ రోజున హైదరాబాద్ "ఫ్రీ జోన్" అంటూ సుప్రీం కోర్ట్ డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది? 2009, అక్టోబర్ 9న [హైదరాబాద్‌ని "ఫ్రీ జోన్"గా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు 2009 అక్టోబర్ 21న సిద్ధిపేటలో "ఉద్యోగ ఘర్జన"కి పిలుపునిచ్చాయి]
హైదరాబాద్‌ను మరో జోన్‌గా పరిగణించి రాష్ట్రపతి ఉత్తర్వుకు తూట్లుపొడిచారు. మిగిలిన చట్టాల్లో ఏమి ఉన్నప్పడికీ 371డి మాత్రమే చెల్లుతుందని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. కాని దానికి భిన్నంగా ఏ పేరాను చేర్చి, హైదరాబాద్ పోలీసు చట్టం కింద నియామకాలకు మినహాయింపు ఇచ్చారు? 14-F
ఉద్యోగ సంఘాలు ఏ తేదీన సిద్ధిపేటలో "ఉద్యోగ ఘర్జన"కి పిలుపునిచ్చాయి? 2009 అక్టోబర్ 21న [దీనికి ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ హాజరై తన మద్దతు పలికాడు]
కేసీఆర్ "తెలంగాణ వాలే జాగో, ఆంధ్రా వాలే భాగో" నినాదం ఏ సభలో ఇచ్చారు? 2009 అక్టోబర్ 21, సిద్ధిపేటలో "ఉద్యోగ ఘర్జన"
[కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష [నవంబర్ 29, సిద్దిపేటలో] ప్రకటన చేసింది కూడా ఈ మీటింగ్‌లోనే]
"ఇక కేసీఆర్ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో జరిగిపోవాలి", "కేసీఆర్ శవయాత్రలో పాల్గొంటారో, తెలంగాణ జైత్రయాత్రలో పాల్గొంటారో తేల్చుకోవాల్సింది తెలంగాణ ప్రజలు" అని కేసీఆర్ ఆవేశపూరితంగా ఏ సభలో ప్రసంగించారు? 2009 నవంబర్ 22న కాకతీయ విశ్వవిద్యాలయంలో భారీ బహిరంగ సభ
సిద్దిపేట "ఉద్యోగ ఘర్జన" అనంతరం హైదరాబాద్ ఫ్రీజోన్ వ్యవహారాన్ని రద్దు చేయాలని, అందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని ఏ తేదీన "జైల్ భరో" కార్యక్రమాన్ని తెరాస నిర్వహించింది? 2009, అక్టోబర్ 28న
ఉద్యమానికి ప్రధాన కారణమైన 14[ఎఫ్]ని తొలగిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది? డిసెంబర్ 6న
జేఏసీ తొలిసారి తెలంగాణ బంద్‌కి ఎప్పుడు పిలుపు ఇచ్చింది? 2009, డిసెంబర్ 30న
కాంగ్రెస్ 2010 జనవరి 5న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశానికి గుర్తింపు పొందిన ఎన్ని పిలిచింది? "8 పార్టీలని"
శ్రీకృష్ణ కమిటీ:
- డిసెంబర్ 30, 2010న నివేదిక అందించింది
- ఈ కమిటీ కోసం కేంద్రం 20కోట్లు ఖర్చు చేసింది
- ఈ రిపోర్ట్‌లో 668 పేజీలు, 9 అధ్యాయాలున్నాయి
శ్రీకృష్ణ కమిటీలోని సెక్షన్ 8 ఎవరి పిటిషన్ వల్ల బయటకి వచ్చింది? శ్రీనారాయణ రెడ్డి పిటిషన్ మేరకు [నిజామాబాద్ ఎంపి] హైకోర్ట్ తీర్పుతో బయటకి వచ్చింది
మలిదశలో సాగరహారం సందర్భంగా పోలిసుల టియర్ గ్యాస్ ద్వారా మరణించినది? రాజారెడ్డి
అమరులు:
- శ్రీకాంతా చారి [డిసెంబర్ 3, 2009]
- వేణుగోపాల్ రెడ్డి [2010, జనవరి 19]
- యాదయ్య [2010,ఫిబ్రవరి 21]
- ఇషాంత్ రెడ్డి[2010 ఆగష్ట్ 1]
- ఢిల్లీలో యాదిరెడ్డి [2011, జులై 20]
ఇటీవల తెలంగాణలోని ఏ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిల్వలు బయటపడ్డాయి? బయ్యారం
తెలంగాణలో ‘ఎనుమాముల’ దేనికి ప్రసిద్ధి? ధాన్యం మార్కెట్
ఖడ్గ నృత్యం ఏది? దేస్మా నృత్యం
హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో:
- కాంగ్రెస్ పార్టీ = 97 స్థానాలు
- పి.డి.ఎఫ్. పార్టీ = 42 స్థానాలు
- స్వతంత్రులు = 16 స్థానాలు
ఎస్.ఆర్.సి నివేదికలో తెలంగాణ అనుకూల వాదనలు ఎందులో పొందుపరిచారు? పేరా 375-380
తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితిలో సభ్యులు.
ఎ. మల్లికార్జున్ బి. పుల్లారెడ్డి సి. శ్రీధర్‌రెడ్డి
ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని కొండా లక్ష్మణ్ బాపూజీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1969 మార్చి 29
తెలంగాణ ప్రజాసమితి డిమాండ్ డే సందర్భంగా జరిగిన చార్మినార్ ఊరేగింపునకు ఎవరు సారథ్యం వహించారు? కేశవరావు జాదవ్
ముల్కీ నిబంధనలు రాజ్యాంగ నమ్మతమేనని హైకోర్టు ఎప్పుడు తీర్పు ఇచ్చింది? 1969 ఫిబ్రవరి 20
రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఎంతమంది స్థానికేతరులు ఉద్యోగాలు పొందారని ‘జయ భారత్’ కమిటీ తన నివేదికలో పేర్కొంది? 58,962
1962లో ఎవరి ఆధ్వర్యంలో వేలాది ఎకరాల బినామీ భూములు ఉన్న భూస్వాములకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు నిర్వహించారు? బెంగాల్ కిసాన్ సభ
కామ్రేడ్స్ అసోసియేషన్ ప్రథమ సమావేశం ఎక్కడ జరిగింది? హుష్‌మంత్ గంజ్ (మార్వాడి పాఠశాల)
సరైన వాక్యాలు:
ఎ. సిపిఐ పార్టీకి చారుమజుందార్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు
బి. సిపిఐ రష్యాను సమర్థిస్తుంది
సి. సిపిఐ(M) చైనాను సమర్థిస్తుంది
డి. సిపిఐ నుంచి సిపిఐ(M) 1964లో విడిపోయింది
తెలంగాణ సాధన సమితి ఏ రోజున ఏర్పాటైంది? 2001 సెప్టెంబరు 19
‘పల్లెటూరి పిల్లగాడ-పసులగాసే మొనగాడా’ అనే గీతాన్ని రాసిన కవి? సుద్దాల హన్మంతు
ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ నియామక వివాదం కింది ముఖ్యమంత్రి కాలంలో జరిగింది? కాసు బ్రహ్మానందరెడ్డి
2013 సెప్టెంబరు 29లో జేఏసీ ఏ పేరుతో నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించింది? సకల జనభేరి
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖ రరావు 2014 ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి గెలుపొందారు? గజ్వేల్
‘లార్డ్ రిప్పన్’ ఏ నిజాం కాలంలో హైదరాబాద్‌ను సందర్శించాడు? మహబూబ్ అలీఖాన్
"తెలంగాణ సాంస్కృతిక వేదిక" తరపున వచ్చిన బృహత్ కవితా సంకలనం ఏది? మత్తడి
అమెరికాలో తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధిగా 2009లో ఎవరు పనిచేశారు? మేరెడ్డి రవిప్రకాశ్
తెలంగాణ ఉద్యమ తీవ్రతను ఢిల్లీకి తెలియచేయాలని విద్యార్థులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, వివిధ సంఘాలు ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమం? సంసద్ యాత్ర
తెలంగాణలో టీజేఏసీ నిర్వహించిన ‘సడక్ బంద్’ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగింది? శంషాబాద్ నుంచి అలంపూర్ వరకు
గద్దర్ సారథ్యంలో స్థాపించిన ‘తెలంగాణ ప్రజా ఫ్రంట్’కి జనరల్ సెక్రటరీగా ఎన్నికైనవారు? నలమాస కృష్ణ
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఖమ్మం జిల్లాను కోస్తాంధ్రాలో కలిపేస్తాను’ అని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి? జలగం వెంగళరావు
‘పోరు తెలంగాణ’ యాత్రను నిర్వహించిన బీజేపీ నాయకుడు? జి.కిషన్‌రెడ్డి
1956-60 మధ్య కాలంలో బూర్గుల రామకృష్ణారావు ఏ రాష్ర్టానికి గవర్నర్‌గా పనిచేశాడు? తమిళనాడు
తెలంగాణ విద్యార్థి యువజన మహాసభ అధ్యక్షుడు ఎవరు? బెల్లయ్య నాయక్
2005 సెప్టెంబరు 20న టిఆర్‌ఎస్ పార్టీ ఏ పేరుతో కార్యకర్తలకు శిక్షణ ఇచ్చింది? తెలంగాణ రాష్ట్ర జాగరణ సేన
1997 నుంచి ఏ సంస్థ తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో తెలంగాణ భావజాల వ్యాప్తికి పోరాడుతూ కృషి చేసింది? తెలంగాణ ప్రజావేదిక
రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌లో భూమి బదలాయింపు రెగ్యులేషన్ చట్టం 1959, 1970లో మార్పు చేశారు. దాన్ని ఏ పేరుతో పిలుస్తారు? 1/70
తెలంగాణ యువతలో సాహిత్య చైతన్యాన్ని, తెలంగాణ యాస, భాష పట్ల చైతన్యాన్ని తీసుకు రావడం కోసం ఏర్పాటు చేసిన సంస్థల జత:
భారతీయ సాహిత్య సమితి(1917)- కరీంనగర్
చైతన్య భారతి- ఆదిలాబాద్
నీలగిరి సాహితీ సమితి- నల్గొండ
హైదరాబాద్‌లో స్థాపించిన మొట్టమొదటి వార్తాపత్రిక? దక్కన్ టైమ్స్
1980లో రైతులు సిర్పూర్ తాలూకాలో మక్తేదారులకు వ్యతిరేకంగా పోరాడి 600 ఎకరాల భూమిని ఆక్రమించిన పోరాటాన్ని ఏమని పిలుస్తారు? కొయ్యమన్నె రైతాంగ పోరాటం
AIMIM 1927 నవంబరు 9న ఎవరి గృహంలో ప్రకటించారు? మౌల్వీ మహమ్మద్ నవాజ్‌ఖాన్
1997 మార్చి 8,9 తేదీల్లో ఎక్కడ జరిగిన సభను ‘దగాపడ్డ తెలంగాణ’ పేరుతో నిర్వహించారు? భువనగిరి
‘అమ్మా తెలంగాణ ఆకలి కేకల గానామా’ పాటను గద్దర్ మొదటిసారి ఏ సభలో పాడాడు? ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఎక్స్‌ప్రెషన్ సభ
తెలంగాణ వాణిని వినిపించడానికి 1996 నవంబరు 20న సిద్దిపేటలో సభను నిర్వహించిన సంఘం? మంజీర రచయితల సంఘం
‘ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్’ను ఏర్పాటు చేసినవారు ఎవరు? ఎం.వేదకుమార్
శ్రీకృష్ణ కమిటీ కార్యదర్శి ఎవరు? వి.కె. దుగ్గల్
ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు ప్రమాణ స్వీకారం చేశారు? 3
విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకించింది? ఆదిలాబాద్ ఎంపీ మాధవ రెడ్డి
పెద్ద మనుషుల చర్చల్లో(1956) ఏకాభిప్రాయం కుదరని అంశాలు? రాష్ట్రం పేరు, హైకోర్టు బెంచ్
1969 ఉద్యమ సమావేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తీర్మానాన్ని ప్రవేశపెట్టింది? ఆదిరాజు వెంకటేశ్వర రావు
లష్కర్ బోనాలు అంటే? సికింద్రాబాద్ బోనాలు
ఏ ‘డిక్లరేషన్’ తెలంగాణ ప్రాంత సమస్యలను తన తీర్మానాల ద్వారా వెలుగులోకి తెచ్చింది? వరంగల్ -1997
2006 ఆగస్టు 24న కెసిఆర్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేసిన ఒక రోజు నిరాహార దీక్షను విరమింపజేసింది? శరద్ పవార్
తెలంగాణ రాష్ట్రానికి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అత్యధిక ప్రభుత్వ భూములు ఉండటానికి కారణం? నిజాం సోంత భూమి సర్ఫేఖాస్ ప్రభుత్వ అధీనంలోకి వచ్చింది
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014లోని 94వ ప్రకటనను అనుసరించి రెండు రాష్ట్రాల సహజ వనరులు, ఉత్పత్తులపై కేంద్రానికి ఆదేశాలు జారీ చేసే అధికారం ఏర్పడింది. మిగిలిన 27 రాష్ట్రాలకు లేని ఈ నిబంధన విమర్శకుల దృష్టిలో? ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దమైనది
1952 ముల్కీ ఉద్యమ నేపథ్యంలో కింది సంఘటనల వరస క్రమం:
ఎ. వరంగల్ మర్కజీ(సెంట్రల్ స్కూల్) సంఘటన
బి. సిటీ కాలేజ్ విద్యార్థులపై కాల్పులు
సి. జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి విచారణ
డి. ఎమ్మెల్యే అక్తర్ హుస్సేన్‌పై పిడి. చట్టం నమోదు
తెలంగాణ వ్యవసాయ భూముల పరాయికరణకు ప్రధాన కారణం?
1) 20వ శతాబ్ది తొలి అర్థ భాగంలోనే ప్రాజెక్టుల నిర్మాణం
2) 1968లో హైదరాబాద్ కౌలుదారు చట్టంలోని 47 - 50 సెక్షన్స్ రద్దు
3) ఆదివాసీ చట్టాల అమలు లోపభూయిష్టంగా ఉండటం
1969 మే 20న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన మేధావుల సదస్సు అభిప్రాయాలు సమర్పించిన ప్రతులు ఏ గ్రంఽథం ద్వారా తెలిశాయి? తెలంగాణ మూవ్‌మెంట్ - ఇన్వెస్టిగేటివ్ ఫోకస్
1864లో హైదరాబాద్ కేంద్రంగా విడుదలైన తొలి ఆంగ్ల పత్రిక? దక్కన్ టైమ్స్
‘సత్యశోధన’ గ్రంథ రచయిత? సి.హెచ్.రాజేశ్వరరావు
హైదరాబాద్‌లో 1969 ఉద్యమానికి మద్దతు నిచ్చిన తొలి జాతీయ నాయకుడు? భారతీయ క్రాంతిదళ్ - చౌదరి చరణ్‌సింగ్
తెలంగాణ నిధుల మళ్లింపుపై విచారణకు కుమార్ లలిత్ కమిటీని ఏర్పాటు చేసింది? రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో కేంద్ర ప్రభుత్వం
‘ముల్కీ నిబంధనలకు సంపూర్ణ చట్టబద్దత ఉంది అవి చెల్లుతాయి’ అని పేర్కొన్న సుప్రీంకోర్టు చివరి తీర్పు ఎప్పుడు విడుదలయింది? 1972 అక్టోబరు 3
అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటించిన 6 సూత్రాల పథకాన్ని వ్యతిరేకించిన తెలంగాణ ప్రాంత ఎంపీలు? మల్లిఖార్జున్, హసీం, ఎస్.బి.గిరి
2012 డిసెంబరు 28న అప్పటి కేంద్ర హోం మంత్రి షిండే ఏర్పాటు చేసిన సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిథిగా తెలంగాణ ప్రాంతం నుంచి హాజరైన ఆ పార్టీ నాయకుడు? సురేష్ రెడ్డి
2009 డిసెంబరు 9న కేంద్ర ప్రభుత్వ ప్రకటనకు ప్రాతిపదికగా గుర్తించిన సమావేశం:
2009 డిసెంబరు 7 - అఖిల పక్ష సమావేశం - అధ్యక్షుడు రోశయ్య
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 118(1)కి లోబడి లోక్‌సభ రూల్‌బుక్‌ను తయారు చేశారు. దీనిలో ఏ రూల్ ప్రకారం మూజువాణి ఓటును తెలంగాణ బిల్ పాస్ కావడానికి ఉపయోగించారు? రూల్ 367
‘ఓల్డ్ హిస్టరీ - న్యూ జాగ్రఫీ-బైఫర్‌కేటింగ్ ఆంధ్రప్రదేశ్’ గ్రంథ రచయిత? జైరాం రమేష్
ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నప్పుడు ఏ ప్రజాసమస్యలపై అప్పటి ప్రభుత్వానికి లేఖలు రాశారు?
1) విద్యుత్ కోతలు 2) రైతుల ఆత్మహత్యలు 3) తెలంగాణపై వివక్ష
1997 ఆగస్టు 11న సూర్యాపేటలో మారోజు వీరన్న, డాక్టర్ చెరుకు సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సభ పేరు? దోఖా తిన్న తెలంగాణ
జత:
ఎ. చిన్న రాష్ట్రాలపై సదస్సు - తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్
బి. ‘మా తెలంగాణ’ పత్రిక - తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్
డి. తెలంగాణ సంఘర్షణ సమితి - బెల్లయ్య నాయక్
కింది ప్రవచనాల్లో సరి:
1) ‘జలదృశ్యం’ - కొండా లక్ష్మణ్ బాపూజీ నివాస గృహం
2) తెలంగాణ ఐక్య వేదిక కార్యాలయంగా ఉపయోగపడింది
3) టిఆర్‌ఎస్ తొలి ఆవిర్భావ సభ అక్కడే జరిగింది
ప్రణబ్ ముఖర్జీ కమిటీని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పరిశీలన కోసం ఏర్పాటు చేశారు:
- ఈ కమిటీ 8 వారాల్లో తన నివేదికను సమర్పిస్తానని ప్రకటించింది
- 36 రాజకీయ పార్టీలు, నలుగురు మాజీ ప్రధానులు అనుకూలతను వ్యక్తం చేశారు
- ఈ కమిటీకి తెలంగాణకు వస్తున్న మద్దతు లేఖలతో అప్పటి సిఎం వైఎస్సార్, టిఆర్‌ఎస్‌ను బలహీన పరిచే ప్రయత్నం చేశారు.
‘మా ప్రభుత్వం ఏర్పడితే వంద రోజుల్లో తెలంగాణ’ అని ప్రకటించింది? బిజెపి
సత్య ప్రవచనం:
- 14(ఎఫ్)ను సబార్డినేట్ రూల్స్ పేరుతో దారి మళ్లించారు
- సుప్రీంకోర్టు దీని అనుసారం హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా ప్రకటించింది
- హైదరాబాద్‌ను 6వ జోన్‌లో భాగంగానే హైకోర్టు చూడమంది
ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలోని JAC కార్యక్రమాలు:
- ఇందిరా పార్క్ వద్ద రాజకీయ ప్రతినిథుల నిరాహార దీక్షలు - 2009
- వైఎస్.జగన్ యాత్రను నిరసిస్తూ వరంగల్ బంద్ - 2010
- జెఎసి ఆధ్వర్యంలో సకల జనుల సమ్మె - 2011
- సికింద్రాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జాతీయ పార్టీలతో సమావేశం - 2013
నేషనల్ ఫ్రంట్ ఫర్ న్యూ స్టేట్స్‌కు కన్వీనర్‌గా వ్యవహరించింది? కె. చంద్ర శేఖర రావు
లోక్‌సభ, రాజ్యసభల్లో ‘భాషా ప్రయుక్త రాష్ట్ర నినాదం’తో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించింది? CPI[M]/ భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు)
‘రాయల తెలంగాణ’ నినాదం ఎవరిది? AIMIM
తెలంగాణ యువకుల ఆత్మహత్యలపై విచారిస్తూ రాసిన గీతం ‘ఎందుకు రాలిపోతావు - ఎందుకు కాలిపోతావు’ రచయిత? మిత్ర
తెలంగాణకు సంఘీభావంగా ఆంధ్ర కవులు రాసిన సంకలనం? కావడి కుండలు
అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణ జిల్లాల పర్యటనలో ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మాకు మరేం వద్దు’ అని తిరుగుబాటు బావుటా ఎగురవేసిన 'మహిళల పోరుకు' వేదికగా గుర్తింపుపొందింది? రాయినిగూడెం గ్రామం - వరంగల్
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనడం కోసం గ్రూప్ - 1 స్థాయి ఉద్యోగాన్ని వదిలివేసిన మహిళ? నళిని
మలిదశ ఉద్యమంలో భాగంగా 2010 ఫిబ్రవరి 8న నిజాం కాలేజ్ గ్రౌండ్‌లో ముస్లిం గర్జన నిర్వహించింది? జమాత్ ఇస్లామి హింద్
2010 ఫిబ్రవరి 22న పార్లమెంటు ముట్టడి సందర్భంగా ఢిల్లీ పోలీసులతో ఘర్షణ పడి జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించిన ఉద్యమం? న్యాయవాదుల ఉద్యమం
తెలంగాణ ఉద్యమంలో 2011 జూన్ 21? ప్రొ. జయశంకర్ మరణించిన రోజు
2010 జనవరి 23న విద్యార్థి రణభేరి సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసింది? సుష్మాస్వరాజ్
‘స్టేట్ అడ్వయిజరీ’ పత్రిక సంపాదకుడు? బి.సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని "9వ" విభాగం జలవనరుల నిర్వహణ గురించి వివరిస్తుంది:
1) గోదావరి - కృష్ణా జలాల పంపిణిపై శిఖరాగ్ర మండలి అమల్లోకి వస్తుంది.
2) తుంగభద్ర బోర్డులో తెలంగాణ రాష్ట్రానికి భాగస్వామ్యం ఉంటుంది
3) పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తారు
ప్రవచనం:
1) విభజన చట్టంలోని 5వ షెడ్యూల్ 59 కులాలను షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించింది
2) విభజన చట్టంలోని 6వ షెడ్యూల్ 32 తెగలను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించింది
4) విభజన చట్టంలోని 3వ షెడ్యూల్ "విధాన మండలి" నియోజక వర్గాల సర్దుబాటు ఉత్తర్వులను ప్రకటించింది
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రూపొందించిన డాక్యుమెంట్? ఆంధ్రప్రదేశ్ విభజన, ఉపశమనమా- కష్టాల ఆరంభమా
రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును సమర్థిస్తూ ప్రసంగించిన సిపిఐ నాయకుడు? డి. రాజా
1996లో హైదరాబాద్ వివి కాలేజ్ ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఎక్స్‌ప్రెషనల్ అనే తెలంగాణ సదస్సులో ఏ పుస్తకాన్ని ఆవిష్కరించారు? దగాపడ్డ తెలంగాణ
చలో అసెంబ్లీ కార్యక్రమం రోజున ఉస్మానియా యూనివర్సిటీ ఎన్‌సిసి గేటు వద్ద ఆత్మ బలిదానం చేసుకొన్న విద్యార్థి? యాదయ్య
జత:
1) హుస్సేన్ సాగర్ - 1562
2) మీరాలం చెరువు - 1806
3) ఉస్మాన్ సాగర్ - 1920
జత:
1) తెలంగాణ ఉద్యమ చరిత్ర - వి. ప్రకాష్
2) పడి లేచిన తెలంగాణ - గౌతమ్ పింగ్లే
3) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం: సూత్రధారులు - పాత్ర ధారులు - కొమ్మినేని శ్రీనివాస రావు
టిఆర్‌ఎస్ పార్టీ, శ్రీ కృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలో కృష్ణానది ప్రవాహం 68.5% తెలంగాణలో భౌగోళిక ప్రాంతంలో ఉన్నందున తమకు ఎన్ని టిఎంసిల నీరు కావాలని కోరింది? ఏపీకి కేటాయించిన 811 టిఎంసీల్లో 400 నుంచి 555 టిఎంసీల వరకు
నాగార్జునసాగర్ విషయంలో కింది అన్యాయాలు జరిగాయని ప్రొఫెసర్ జయశంకర్ పేర్కొన్నారు:
ఎ) ఎడమ కాల్వ నిర్మాణంలో ఉద్దేశ పూర్వక అన్యాయం జరిగింది.
బి) ఎడమ కాల్వను మళ్లించి కుడి కాల్వలో కలపడం వల్ల అన్యాయం జరిగింది
డి) తెలంగాణకు వాస్తవ కేటాయింపు 132 టిఎంసిలు కాగా అందుతుంది 90 టిఎంసిలేనని పేర్కొన్నారు
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ విషయంలో సత్య ప్రవచనాలు:
ఎ) ఏడో నిజాం కాలంలో 330 టిఎంసిల నిర్మాణం లక్ష్యంగా ఉండేది
బి) సిల్ట్ ట్రాప్ నిర్మాణం, రెండో దశ నిర్మాణం నేటికీ పూర్తి కాలేదు
సి) 110 టిఎంసిల సామర్థ్యంలో ఉన్నప్పటికీ ఇసుక మేటల వల్ల 90 -75 టిఎంసిల నీరు మాత్రమే నిల్వ ఉంటుంది.
డి) వరద కాలువ నిర్మాణం పూర్తి అయితేనే నిజామాబాద్‌కు న్యాయం జరుగుతుంది
ప్రస్తుతం కాళేశ్వరం వద్ద గోదావరి నీటి లభ్యత వ్యాప్‌కోస్ ద్వారా నిర్ధారించింది? 414.5 టిఎంసిలు
సీతారాముల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఖమ్మం జిల్లా ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి గుర్తించిన స్థలం? రాళ్లపాడు
తెలంగాణ మిగులు 1969 ఉద్యమ కాలం వరకు
1) భార్గవ కమిటీ - 28.54 కోట్లు
2) కుమార్ లలిత్ కమిటీ - 34.10 కోట్లు
ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం 2018 నాటికి విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని ఎంతగా ప్రకటించింది? 25,000 మెగా వాట్స్
1969 ఉద్యమం అనంతరం విజయవాడకు తరలించిన తెలంగాణ విద్యుత్ ప్రాజెక్ట్? మణుగూరు
గిర్‌గ్లాని నివేదికను అనుసరించి:
1) కారుణ్య నియామకాల్లో స్థానికతను పాటించలేదు
2) స్కూల్ సర్టిఫికెట్‌ను అనుసరించి స్థానికతను నిర్ధారించాలి
3) హైదరాబాద్‌ను ఆరో జోన్‌లో భాగంగా చూడాలి
ఆఫీసర్స్ కమిటీకి తెలంగాణ ఎన్‌జిఓలు ఇచ్చిన నివేదికను అనుసరించి ఉద్యోగుల్లో తెలంగాణేతరులు దాదాపుగా? 60వేలు
నీలం సంజీవరెడ్డి నిలిపివేసిన ప్రాజెక్టు:
1) ఇచ్చంపల్లి
2) రేవునూరు
3) ప్రాణహిత
1949 ముల్కి రెగ్యులేషన్‌లోని ఏ నిబంధనలు అవసరంలేదని వెల్లోడి ప్రభుత్వం భావించింది? 1[A] & 1[C]
ముల్కీ లీగ్‌తో సంబంధం:
1) బూర్గుల రామకృష్ణారావు 2) పద్మజా నాయుడు 3) నవాబ్ అలీ నవాజ్ జంగ్
1955 నవంబరు 2న హైదరాబాద్ కాంగ్రెస్ తెలంగాణ డెలిగేట్లలో మెజారిటీ సభ్యులు ప్రత్యేక తెలంగాణ తీర్మానాన్ని? ఆమోదించారు
పెద్ద మనుషుల ఒప్పందాన్ని అనుసరించి తోలంగాణలోని మిగులు ఆదాయం తెలంగాణ అభివృద్ధికి కేటాయించాలి. ఈ ఒప్పందం?
ఎ. ఐదేళ్ల తరవాత సమీక్షకు వస్తుంది
బి. శాసన సభలోని తెలంగాణ సభ్యులు కోరితే మరో ఐదేళ్లు పొడిగిస్తారు
ప్రవచనం:
1) ప్రాంతీయ మండలి స్థానంలో ప్రాంతీయ కమిటీ రావడంతో స్వీయ నిర్ణయాధికారాన్ని కోల్పోయింది
3) ఎస్‌ఆర్‌సి చట్టం ప్రకారం రాష్ట్ర ప్రాజెక్టులు కొనసాగించాలి.
4) ఉద్యోగ నియామకాలకు ఇరు ప్రాంతాల జనాభా ప్రాతిపదికగా తీసుకొన్నారు
తెలంగాణ ఉద్యోగుల అంశాన్ని ప్రాంతీయ కమిటీ పరిధిలోకి? చేర్చలేదు
రిపబ్లికన్ ఎంప్లాయిమెంట్ యాక్ట్ - 1957 ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న ఏ రాష్ట్రాలకు వర్తిస్తుంది?
1) ఆంధ్రప్రదేశ్ 2) హిమాచల్‌ప్రదేశ్ 3) మణిపూర్ - త్రిపుర
1968 జూలై 10 తెలంగాణ ఉద్యమంలో ఉన్న ప్రత్యేకత? టిఎన్‌జిఓ యూనియన్ దాన్ని హామీల దినంగా ప్రకటించింది
ప్రత్యేక తెలంగాణను అర్థరహిత కోర్కెగా అభివర్ణించింది? రామానంద తీర్థ
1969 ఉద్యమంలో తొలి అమరులు? శంకర్ - కృష్ణా
1969 తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడంలో కీలక పాత్ర పోషించిన అప్పటి హోంమంత్రి? జలగం వెంగళరావు
1969 ఉద్యమ వైఫల్యానికి ప్రధాన కారణాలు:
1) నూతన దేశంగా బంగ్లాదేశ్ ఆవిర్భావంతో కేంద్ర ప్రభుత్వం ఆ అంశంపై నిమగ్నం కావడం
2) కాసు బ్రహ్మానందరెడ్డి రాజీనామా - పివి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం
3) కాంగ్రెస్‌లో టిపిఎస్ విలీనం కావడం
1972 ఫిబ్రవరి 14న హైకోర్టు తీర్పులో మెజారిటీ న్యాయమూర్తుల తీరును విభేదించింది? కొండా మాధవ రెడ్డి
రాష్ట్రపతి పాలన కాలంలో [1973 జనవరి 18 నుంచి డిసెంబరు 10 వరకు] తెలంగాణకు అన్యాయం చేస్తూ ఏ సూత్రాలు అమల్లోకి వచ్చాయి? 6 సూత్రాలు
రాష్ట్రపతి ఉత్తర్వులు (ప్రెసిడెన్షియల్ ఆర్డర్) ఎప్పుడు విడుదలైన తేదీ? 1975 అక్టోబరు 18న
రాష్ట్రపతి ఉత్తర్వుల మినహాయింపునకు సంబంధించి సరి జత?
1) 14 ఎ - సచివాలయం
3) 14 ఎఫ్ - సిటీ పోలీసుల్లోని కొన్ని పోస్టులు
4) 14 డి - ప్రత్యేక కార్యాలయాలు
'14'లో ఏముంది?
రాష్ట్రపతి ఉత్తర్వుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్నా పెద్ద కార్యాలయాలను, పోస్టులను లోకల్, జోనల్, స్టేట్ కేడర్‌గా వర్గీకరించారు. ఏయే కార్యాలయాలు ఈ నిబంధనల పరిధిలోకి రావో రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పేరా 14లో వివరించారు. 14వ పేరాలో A నుంచి F వరకు మొత్తం 6 క్లాజ్‌లు ఉన్నాయి. అవి:
14A: ఈ క్లాజ్ ప్రకారం సచివాలయంలోని ఏ పోస్టూ రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి రాదు.
14B: అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లో అన్ని పోస్టులకూ రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఇచ్చారు.
14C: స్పెషల్ ఆఫీసులు, సంస్థల్లోని మొత్తం పోస్టులను మినహాయించారు.
14D: రాష్ట్రస్థాయి కార్యాలయాల్లోని పోస్టులను మినహాయించారు.
14E: భారీ అభివృద్ధి ప్రాజెక్టుల్లోని ఎన్జీవోలు మినహా మిగిలిన పోస్టులకు మినహాయింపు వర్తిస్తుంది.
14F: హైదరాబాద్ పోలీసు చట్టంలోని సెక్షన్ 3, క్లాజ్-బి కింద నిర్వచించిన పోలీసు అధికారుల పోస్టులు రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి రావు.
రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ప్రస్తావించని శాఖలు?
1) కార్పొరేషన్స్ 2) యూనివర్సిటీలు 3) ప్రభుత్వ గ్రాంట్ పొందే సంస్థలు
తెలంగాణకు ఆంధ్ర నుంచి వలసలు 4 దశల్లో వచ్చాయని పేర్కొన్న కమిటీ? శ్రీకృష్ణ
రవీంద్రనాథ్ ఖమ్మంలో దీక్ష నిర్వహించగా, హైదరాబాద్‌లో దీక్ష చేసిన విద్యార్థి నాయకుడు? మల్లిఖార్జున్
తెలంగాణలో పర్యావరణాన్ని పరిరక్షించడానికి రూపొందించిన ‘హరిత హారం’ పథకాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ రంగారెడ్డి జిల్లా చిల్కూరులో ఎప్పుడు ప్రారంభించారు? 2015 జూలై 3
జగిత్యాల, సిరిసిల్ల కేంద్రాలుగా ప్రజలను చైతన్యం చేసిన ప్రజాసంఘం? రైతు కూలి సంఘం
‘ఇంద్రవెల్లి కాల్పుల సంఘటన’[ఆదిలాబాద్] నమోదైన తేదీ? 1981 ఏప్రిల్ 20 [అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య]
సుప్రీంకోర్టు ‘ముల్కీ నిబంధనలు’ రాజ్యాంగబద్దమే అని ప్రకటించడానికి ప్రధాన కారణం? ఆర్టికల్ 35(బి)
అడ్మినిస్ట్రేషనల్ ట్రిబ్యునల్ ఏర్పాటు దేని సూచనల ప్రకారం జరిగింది? 6 సూత్రాలు
6 జోన్‌లోని కొన్ని పోస్టులను హైదరాబాద్ నగరానికి పరిమితం చేశారు. ఇక్కడ హైదరాబాద్ నగరం అంటే? హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం ప్రాంతం
1980 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ గెలిచిన స్థానం? మెదక్
జాతీయ ఎమర్జెన్సీ అనంతరం నక్సలైట్ల ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపిన కమిషన్? జస్టిస్ తార్కుండె
షెడ్యూల్డ్ ఏరియాకు, ఏజెన్సీ ఏరియాకు ప్రధాన వ్యత్యాసం? మొదటిదాన్ని రాష్ట్రపతి గుర్తించగా రెండోదాన్ని రాష్ట్రం ప్రకటిస్తుంది
తొలిసారిగా ఐటి టెక్నాలజీ పార్క్, హైదరాబాద్‌లో ఏర్పడినపుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి? నేదురుమల్లి జనార్థన్ రెడ్డి
సరళీకరణ విధానాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ:
1) హితెన్ భయ్యా కమిటీ - విద్యుత్ రంగం
2) సుబ్రహ్మణ్యం కమిటీ - పబ్లిక్ రంగ సంస్థలు
3) కోనేరు రంగారావు కమిటీ - ఉన్నత విద్యా సంస్కరణలు
ప్రొఫెసర్ కోదండరామ్ తొలుత ఏ వేదిక ద్వారా తెలంగాణ చైతన్యం కోసం కృషి చేశాడు? తెలంగాణ విద్యావంతుల వేదిక
ఏపీ పునర్విభజన (సవరణ) చట్టం 2014 ద్వారా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలించిన గ్రామాల సంఖ్య? 337
'హైదరాబాద్‌లోని ఉద్యోగాలు హైదరాబాదీలకే' అనే నినాదం ఎప్పుడు వచ్చింది? 1888
'మా ఉద్యోగాలన్నీ అపహరించి మీ వారికి అప్పగించావు, నీ కుట్రలన్నీ అమలైతే ఇక చిరుద్యోగాలే మాకు గతి' అనే కవిత ముల్కీ ఉద్యమ గీతంగా ప్రసిద్ధి. దీన్ని ఉర్దూ భాషలో ఎవరిని ఉద్దేశించి రాశారు? కాసన్ వాకర్
'ది నిజాం సబ్జెక్ట్ లీగ్' లేదా 'ముల్కీలీగ్' లేదా జమీయత్ రిఫాయామే నిజాం ఏర్పడిన సంవత్సరం? 1935
'హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్' అని నినాదం ఇచ్చినవారు? నవాబ్ నిజామత్ జంగ్
‘‘ముల్కీ ఉద్యమ గాడ్‌ఫాదర్’’గా ఎవరిని పిలుస్తార్? కిషన్ పర్‌షాద్
నిజాం ప్రజల సంఘం నిర్వీర్యం కాడానికి కారణం? మజ్లిస్ పార్టీ రాక
హైదరాబాద్ హితరక్షణ సమితి: పూర్వపు నైజాం ప్రభుత్వంలోని లాయక్ అలీ మంత్రివర్గంలో పనిచేసి, 1952లో శాసనసభ్యుడిగా ఉన్న రామాచారి అనే నాయకుడు 1952 ఆగస్టు చివరి వారంలో "హైద్రాబాద్ హితరక్షణ సమితి"ని స్థాపించి గైర్ ముల్కీలంతా వెనక్కు పోవాలనే నినాదాన్ని ప్రారంభించాడు. వరంగల్‌లో హయగ్రీవాచారి ఆ ఉద్యమాన్ని ప్రోత్సహించాడు.
వరంగల్‌లో ఉద్యమానికి శ్రీకారం: మొదట ఈ ఉద్యమం విద్యార్థుల ఆధ్వర్యంలో 1952 జూన్ 26న వరంగల్‌లో ప్రారంభమైంది. 5 రోజులు కొనసాగి జూలై 31న ఉద్యమాన్ని విరమించారు.
మంత్రివర్గం ఉపసంఘం: గైర్ ముల్కీ గో బ్యాక్ ఆందోళన ఉధృతిని గమనించి, 1952 సెప్టెంబరు 7న ముల్కీ నిబంధనల పరిశీలన కోసం 4 మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. దానిలో సభ్యులు 1. మెహదీ నవాబ్ జంగ్ బహదూర్ 2. కె.వి. రంగారెడ్డి 3. డాక్టర్ మెల్కోటే 4. పూల్‌చంద్ గాంధీ
అమలులో ఉన్న ముల్కీ నిబంధనలను పరిశీలించడం, విద్యార్థులను ఇతర సంస్థలను కలుసుకుని వివిధ అభిప్రాయాలను సేకరించి, నివేదిక సమర్పించడం ఆ ఉపసంఘం బాధ్యత.
'యంగ్ మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ సొసైటీ' స్థాపించిన సంవత్సరం? 1879
సంఘసంస్కర్త 'మౌల్వీ మొహీబ్ హుస్సేన్'కు సంబంధించి:
1) ఇతడు హైదరాబాద్‌లో స్త్రీ విద్య వైతాళికుడిగా గుర్తింపు పొందాడు
2) ఇతడిని హైదరాబాద్‌లో జర్నలిజానికి రూపశిల్పిగా పేర్కొంటారు
3) ఇతడు స్థాపించిన 'మౌల్లం-ఎ-షఫిక్' పత్రికను నిజాం ప్రభుత్వం మూసివేయించింది
1902లో 'బీరార్ ఒప్పందం'పై సంతకం చేసిన బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? లార్డ్ కర్జన్
'హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ'ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1918
అఘోరనాథ్ ఛటోపాధ్యాయతో కలిసి స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించిన సంఘసంస్కర్త? ముల్లా అబ్దుల్ ఖయ్యూం
స్వదేశీ ఉద్యమంలో భాగంగా బొంబాయి నుంచి చరఖాలను తెప్పించిన ప్రొఫెసర్? బద్రుల్ హసన్
'హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్'ను ఏ తేదీన ఏర్పాటు చేశారు? 1938 జనవరి 29
స్వదేశీ ఉద్యమ కాలంలో ఏర్పాటు చేసిన సంస్థ- అంజుమన్ ఇక్వాన్-సఫా
హైదరాబాద్‌లో 'ఖిలాఫత్ ఉద్యమం' ఎవరి నాయకత్వంలో జరిగింది? కేశవరావు కోరట్కర్, నవాబ్ అస్గర్‌యార్ జంగ్
నిజాం రాజ్యంలో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పడాలనే లక్ష్యంతో 'నైజాం పౌరసంఘం'ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1935
'నైజాం పౌరసంఘం' మొదటి అధ్యక్షుడు? నిజామత్ జంగ్
సుభాష్ చంద్రబోస్ స్థాపించిన 'ఆజాద్ హింద్ ఫౌజ్'లో చేరిన హైదరాబాద్ జాతీయోద్యమ ముస్లిం నాయకులెవరు? ఆబిద్ హుస్సేన్, సప్రానీ
చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం.. భారతదేశంలో మొదటి బ్రిటిష్ వ్యతిరేక జాతీయోద్యమం ఏది? వహాబీ ఉద్యమం
పంజాబ్‌లో సిక్కుల ప్రభుత్వం, దేశంలో ఆంగ్లేయుల ప్రభుత్వం పోవాలనేది ఏ ఉద్యమ లక్ష్యం? వహాబీ ఉద్యమం ['తెలంగాణలో మొదటి రాజకీయోద్యమం']
బొల్లారం (హైదరాబాద్)లో కంటింజెంట్ సైన్యంలో అలజడి జరిగి బ్రిగేడియర్ మెకంజీపై దాడి ఏ సంవత్సరంలో జరిగింది? 1885
చాందా రైల్వే పథకాన్ని లండన్ నుంచి తెచ్చిన అప్పుతో కాకుండా స్థానిక వనరులతో నిర్మించాలని 1883లో ఎవరి ఆధ్వర్యంలో ఉద్యమం చేశారు?
అఘోరనాథ్ ఛటోపాధ్యాయ
హైదరాబాద్ రాజ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన మొదటి ప్రజా ఉద్యమం ఏది? చాందా రైల్వే పథక వ్యతిరేక ఉద్యమం
జాతీయత అనేది హైదరాబాద్ రాజ్యానికి ముప్పుగా పరిణమిస్తుంది' అని ఎవరు పేర్కొన్నారు? మోహిసిన్ ఉల్‌ముల్క్
హైదరాబాద్‌లో రాజకీయ చైతన్యానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) 1882లో 'థియోసోఫికల్ సొసైటీ'ని స్థాపించారు
2) 1896లో బొల్లారంలో ఆల్ బర్డ్ 'రీడింగ్ రూం' ఏర్పాటు చేశారు
3) 1900లో 'హిందూ సోషల్ క్లబ్', 'సికింద్రాబాద్ క్లబ్' స్థాపించారు
కింది వాటిలో నిజాం ప్రభుత్వ నిర్బంధం వల్ల మూతపడిన పత్రిక ఏది? ది హైదరాబాద్ రికార్డ్
1892లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఆర్య సమాజ్ శాఖకు అధ్యక్ష, కార్యదర్శులుగా ఎవరు వ్యవహరించారు? కంటప్రసాద్, లక్ష్మణ్‌దేశ్‌జీ
హైదరాబాద్‌లో తొలిసారిగా గణేశ్ ఉత్సవాలను ఏ సంవత్సరంలో నిర్వహించారు? 1897
73. 1918లో 'హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ'ని ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు? వామన్ నాయక్
72. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌కు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) 1938 సెప్టెంబర్ 7న ప్రభుత్వం దీన్ని నిషేధించింది
2) 1946లో ప్రభుత్వం దీనిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది
3) ప్రథమ మహాసభను 1947 మేలో నిర్వహించారు
71. 'ఇత్తేహాద్-ఉల్-ముస్లిమీన్' సంస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1927
[నవాబ్ సదర్‌యార్ జంగ్- తొలి అధ్యక్షుడు]
- రజాకారు దళం: ప్రతి 30 మంది రజాకార్లకు సాలార్ నాయకుడు. తాలూకా స్థాయి రజాకార్ల దళానికి అధిపతి సాలార్-ఇ-సగీర్. జిల్లా అధిపతి సాలార్-ఇ-కబీర్. రజాకార్ల కేంద్ర సంఘానికి అధ్యక్షుడిగా అఫ్సర్-ఎ-అలా ఉండేవాడు. రజాకార్లకు సైనిక శిక్షణ ఇవ్వడానికి ‘మీర్ కాజ్’ అనే అధికారి ఉండేవాడు. ఈయన వారిని క్రమశిక్షణలో ఉంచేవాడు. రజాకార్లు ఖాకీ సైనిక షర్టు, ఖాకీ ప్యాంటు ధరించి బెల్టు పెట్టుకోవాలి. కత్తి బాకు ధరించాలి. నల్ల ఫెజ్ టోపీ పెట్టుకోవాలి.
70. 'ఇత్తేహాద్-ఉల్-ముస్లిమీన్'కు సంబంధించి:- నవాబ్ బహదూర్ యార్ జంగ్ అనల్ మాలిక్ 'నేను పాలకున్ని' అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు
- బహదూర్ అలీజంగ్ రజాకార్ వ్యవస్థకు రూపమిచ్చాడు
- దీనికి 1946లో కాశీం రజ్వీ అధ్యక్షుడయ్యాడు
- ఇత్తెహాద్-ఉల్-ముస్లిమీన్: హైదరాబాద్ ప్రభుత్వ మత శాఖకు డైరెక్టర్‌గా ఉన్న నవాబ్ సదర్ యార్ జంగ్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని తోహెద్ మంజిల్‌లో ఒక సమావేశం జరిగింది. అందులో చేసిన తీర్మానాన్ని అనుసరించి ‘ఇత్తెహాదుల్ జైనుల్ ముస్లిమీన్’ సంస్థ/పార్టీని 1927, నవంబరు 9న స్థాపించారు. 1929లో జైనుల్ అనే పదాన్ని తొలగించి మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌గా మార్చారు. దీనికి మొదటి అధ్యక్షుడు నవాబ్ సదర్ యార్ జంగ్. ఈ సంస్థ మొదట్లో సాంస్కృతిక అంశాలకే పరిమితమై ఉండేది. 1938 వరకు నామమాత్రంగా పనిచేసింది. 1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయం మత శాఖాధిపతి అయిన ప్రొఫెసర్ అబ్దుల్ ఖాదర్ సిద్ధిఖ్ ఈ సంస్థకు రెండో అధ్యక్షుడైన తర్వాత పరిస్థితి మారింది. ముస్లింల ప్రత్యేక హక్కుల పరిరక్షణ కోసం పని చేయడం ప్రారంభించింది. 1939లో నవాబ్ బహదూర్ యార్ జంగ్ అధ్యక్షుడు కావడంతో సంస్థ మరింత బలపడింది. ప్రతి ముస్లిం స్వయంగా ఒక రాజు అనే ‘ఆనల్ మాలిక్ (నేనే రాజు)’ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. బహదూర్ యార్ జంగ్ ఈ సిద్ధాంతాన్ని అబ్దుల్ ఖాదర్ సిద్దిఖ్ 1938లో ఇచ్చిన ఉపన్యాసం నుంచి గ్రహించాడు. బహదూర్ యార్ జంగ్‌కు ఇస్లాం మత సిద్ధాంతాలపై బాగా పట్టుండేది. నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఇతడి ప్రతిభను గుర్తించి ‘యార్ జంగ్’ అనే బిరుదు ఇచ్చాడు. బహదూర్ యార్ జంగ్ అధ్యక్షుడైన అనంతరం ఈ సంస్థ నిజాంను శాసించే స్థాయికి చేరింది. హైదరాబాద్ రాజ్య కాంగ్రెసు ఏర్పాటును కూడా వ్యతిరేకించింది.
69. నిజాం ప్రభుత్వం వందేమాతర ఉద్యమాన్ని నిషేధించిన తేదీ ఏది? 1938 నవంబర్ 28
68. 'ఆహారపు రేషన్.. ప్రజల ప్రజాతంత్ర హక్కు' అని పేర్కొంటూ కరపత్రాన్ని వేసిన సంస్థ ఏది? కామ్రేడ్స్ అసోసియేషన్
67. 10వ ఆంధ్ర మహాసభలో.. ప్రజలకు తిండి ప్రధాన అవసరం అని పేర్కొని తొలిసారిగా వర్గ పోరాటం గురించి ఎవరు ప్రస్తావించారు? డాక్టర్ జయసూర్య
66. వందేమాతర ఉద్యమం నిర్వహించినందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం బహిష్కరించిన విద్యార్థులు ఏ విశ్వవిద్యాలయంలో చేరారు? ఆర్ట్స్ విద్యార్థులు జబల్‌పూర్, సైన్స్ విద్యార్థులు నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో చేరారు*
65. కమ్యూనిస్టు పార్టీకి సంబంధించి:- 1940లో 'నిజాం రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ'ని ఏర్పాటు చేశారు
- 1940లో కమ్యూనిస్టు పార్టీ 'కిసాన్ సభ'ను స్థాపించింది
- 1940లో తునికిపాడులో చండ్ర రాజేశ్వరరావు రాజకీయ పాఠశాలను నిర్వహించాడు
64. గౌడ పురాణాన్ని ద్విపదగా రాసింది - మల్లికార్జున సిద్ధయోగి
63. యంగ్‌మెన్స్ ఇంప్రూమెంట్ సొసైటీ: దీన్ని 1886, ఆగస్టు 8న అఘోరనాథ ఛటోపాధ్యాయ హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో స్థాపించారు. నాటి యువతలో నవీన భావాలను ప్రేరేపించడానికి ఈ సొసైటీ కృషి చేసింది.
62. థియోసాఫికల్ సొసైటీ: వయోవృద్ధుల్లో జాతీయ భావాలను పెంపొందించేందుకు రామస్వామి అయ్యర్ 1882, డిసెంబరు 26న చాదర్‌ఘాట్‌లో థియోసాఫికల్ సొసైటీని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ హైదరాబాద్‌లోని హనుమాన్ టేక్డీ ప్రాంతంలో సొంత భవనాన్ని నిర్మించుకుంది. దాన్ని అనిబిసెంట్ 1906లో ప్రారంభించారు.
61. హిందూ సోషల్ క్లబ్: 20వ శతాబ్దం ఆరంభంలో ఉన్నత విద్య కోసం యువత హైదరాబాద్ నుంచి ఇంగ్లండ్‌కు వెళ్లేది. వీరికి నిజాం ప్రభుత్వం వేతనాలిచ్చి ఆర్థికంగా సహాయపడేది. అయితే ప్రభుత్వం ముస్లిం విద్యార్థులను మాత్రమే ప్రోత్సహించేందుకు, హిందూ విద్యార్థులను నిరుత్సాహపరిచే లక్ష్యంతో సనాతనుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ దురుద్దేశాన్ని గ్రహించిన రాజా మురళీ మనోహర్ చాదర్‌ఘాట్‌లో ‘హిందూ సోషల్ క్లబ్’ స్థాపించి హిందూ విద్యార్థులను ప్రోత్సహించారు. మాల్‌వాలా సభ అనే సంస్థను కూడా ఆయనే ఏర్పాటు చేశారు. చార్మినార్ వద్ద ఉండే మాల్‌వాలా ప్యాలెస్ అనే దేవిడీలో సమావేశాలు ఏర్పాటుచేసి ప్రముఖులతో ప్రసంగాలు ఇప్పించి నాటి యువతలో ధైర్యం, ఉత్సాహం నింపారు.
60. హ్యుమానిటేరియన్ లీగ్: ప్రముఖ సంఘసంస్కర్త రాయ్ బాలముకుంద్ అధ్యక్షతన 1913లో హైదరాబాద్‌లో ‘హ్యుమానిటేరియన్ లీగ్’ సంస్థ ఏర్పాటైంది. కలప వర్తకులైన లాల్‌జీ మేఘ్‌జీ, గణేశ్‌మల్ ఈ సంఘానికి కార్యదర్శులుగా ఉండేవారు.
- సోషల్ సర్వీసు లీగ్ అనే సంస్థను వామన్‌నాయక్, కేశవరావు 1915లో హైదరాబాద్‌లో స్థాపించారు.
59. 1864లో సికింద్రాబాద్‌లో ‘దక్కన్ టైమ్స్’ మొదలైంది. నిజాం రాజ్యంలో ఇది మొదటి ఆంగ్ల పత్రిక.
58. 1885లో ‘హైదరాబాద్ రికార్డ్’ అనే ఇంగ్లిష్ పత్రిక ఏర్పాటైంది. బ్రిటిష్ రెసిడెంట్‌ను స్థానిక సీజర్‌గా అభివర్ణించినందుకు ఈ పత్రికను ప్రభుత్వం 1892లో నిషేధించింది
57. 1886లో ‘శేద్య చంద్రిక’ పత్రికను వ్యవసాయ సమాచారం కోసం ఏర్పాటు చేశారు. ఇది ఉర్దూ పత్రిక పుమాన్‌కు అనువాదం
56. మౌల్వీ మొహిబ్ హుస్సేన్ పత్రికా రంగం పితామహుడిగా పేరు పొందారు. ఈయన 1892లో ‘మొవాలియే విశ్వాన్’ అనే పత్రికను స్థాపించి ముస్లిం మహిళల విద్య కోసం, పర్దా పద్ధతి తొలగించడానికి పోరాడి సంఘసంస్కర్తగా ప్రసిద్ధి చెందారు. ఈయన నడిపే మౌల్లిం-ఎ-షఫిక్ పత్రికను ప్రభుత్వం నిషేధించడంతో 1904లో ‘ఇల్మ్-ఓ-అమల్’ అనే ఉర్దూ వార పత్రికను ప్రారంభించారు.*
55. 1909లో ‘సంయుక్త సంఘ వర్ధమాని’ అనే పత్రిక ఖమ్మం జిల్లాలో క్రైస్తవ మత ప్రచారం కోసం వెలువడింది.
54. 'పయామ్’ పత్రిక ఖాజీ అబ్దుల్ గఫార్ సంపాదకత్వంలో హైదరాబాద్ నుంచి ప్రచురితమయ్యేది. ఇది రజాకార్ల దురంతాలను ఖండించింది.*
53. 1927లో ‘రయ్యత్’ ఉర్దూ పత్రిక మందముల నరసింగరావు సంపాదకత్వంలో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. షోయబుల్లా ఖాన్ మొదట ఈ పత్రికలోనే పనిచేసి తర్వాత 1947లో ‘ఇమ్రోజ్’ పత్రికను స్థాపించారు. రజాకార్ల చేతిలో హత్యకు గురయ్యారు. ఇమ్రోజ్‌కు అర్థం నిప్పు కణిక.
52. 1912లో ‘సరోజినీ విలాస్’ అనే తెలుగు పత్రిక మహబూబ్‌నగర్ నుంచి వెలువడింది. ఇది తెలంగాణ తొలి తెలుగు పత్రిక. *
51. 1913లో ‘హితబోధిని’ పత్రిక బండారు శ్రీనివాస శర్మ సంపాదకత్వంలో మహబూబ్‌నగర్ నుంచి ప్రచురితమైంది.
50. 1922లో నీలగిరి పత్రిక (తొలి తెలుగు రాజకీయ పత్రిక) షబ్నవీస్ వెంకట నరసింహారావు సంపాదకత్వంలో నల్గొండలో ప్రారంభమైంది
- 1925లో ‘గోలకొండ’ పత్రిక సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో హైదరాబాద్‌లో మొదలైంది. ఇది అర్ధ వార పత్రిక. 1947లో వనపర్తి సంస్థానాధీశులు శ్రీ రాజారామేశ్వరరావు, నూకల నరోత్తంరెడ్డిలు లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుచేసి గోలకొండ పత్రికను దినపత్రికగా నడిపేవారు. ఈ పత్రిక 1966 వరకు కొనసాగింది. గోలకొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి కృషి వల్ల 1934లో గోలకొండ కవుల సంచిక వెలువడింది. ఇది ఆధునిక కాలంలో ప్రచురించిన మొదటి తెలుగు కవితా సంకలనం.
49. 1941లో ‘మీజాన్’ అనే పత్రిక ఇంగ్లిష్, ఉర్దూ, తెలుగు భాషల్లో వచ్చేది. దీని యజమాని గులాం మహ్మద్. తెలుగులో ఈ పత్రికకు అడవి బాపిరాజు సంపాదకుడు.
- 1834లో సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ అనే మొదటి ఆంగ్ల పాఠశాల హైదరాబాద్‌లో ఏర్పడింది. 1839లో బొల్లారంలో మొదటి మెడికల్ స్కూల్‌ను స్థాపించారు. 1915లో మిర్ అక్దర్ అలీ కొందరు పట్టభద్రులైన యువకులతో కలిసి హైదరాబాద్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్‌ను స్థాపించారు. ఫలితంగా 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడింది. 49. 1906లో కేశవరావు కొరాట్కర్ వివేకవర్ధని విద్యాసంస్థను స్థాపించారు
48. ఆంధ్ర సారస్వత పరిషత్తు అభివృద్ధిలో దేవులపల్లి రామానుజరావు కీలకపాత్ర పోషించారు.
47. ‘నవ్య సాహితీ సమితి’ని రావి నారాయణరెడ్డి*
46. ‘తెలంగాణ రచయితల సంఘాన్ని’ దాశరథి కృష్ణమాచార్య*
45. ‘వైతాళిక సమితి’ని కాళోజీ నారాయణరావు స్థాపించారు.*
44. సురవరం ప్రతాపరెడ్డి రచించిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’,
43. చిలుకూరి వీరభద్రరావు ‘ఆంధ్రుల చరిత్ర’,
42. రావి నారాయణరెడ్డి ‘వీర తెలంగాణ నా అనుభవాలు’,
41. ఖండవల్లి లక్ష్మీరంజనం ‘ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి’ వంటి రచనలు గత చరిత్ర వైభవాన్ని తెలియజేశాయి
40. విద్యారంగంలో, "హైదరాబాద్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్" ను ఎవరు స్థాపించారు? మౌల్వీ ముర్తజా
39. హైదరాబాద్ రాజ్యంలో స్వదేశీ లీగ్ ఉద్యమ నాయకులు: ?
ఎ) శ్రీవజ సి) పద్మజానాయుడు డి) శ్రీహమాన్
- అంజుమన్ ఇక్వాన్-సఫా (ది బ్రదర్‌హుడ్ సొసైటీ) అనే సంస్థ నిజాం రాజ్యంలో స్వదేశీ ఉద్యమాన్ని ప్రచారం చేసింది.
- హైదరాబాద్ నగరంలో ‘ఫక్త్ ఆఫ్ రూల్స్’ అనే సంస్థ స్వదేశీ వస్తువులనే వాడాలని తెలుపుతూ బహిరంగంగానే కరపత్రాలు విడుదల చేసింది.
- మహారాష్ట్రలో బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన స్వదేశీ ఉద్యమ ప్రభావం హైదరాబాద్ ప్రజలపై పడింది. అందులో భాగంగానే 1906-1907లో సమావేశాలు జరిపి స్వదేశీ ఉద్యమ ప్రచారం నిర్వహించారు. విదేశీ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. స్వదేశీ ఉద్యమంలో ఆర్య సమాజ నాయకులైన కేశవరావు కొరాట్కర్, దామోదర్ సత్వలేకర్ కీలకపాత్ర పోషించారు. నిజాం ప్రభుత్వం తమకు రాజ్య బహిష్కరణ శిక్ష విధించనుందని తెలుసుకున్న దామోదర్ సత్వలేకర్, అప్పాజీ తులజా పూరేకార్‌లు స్వచ్ఛందంగా హైదరాబాద్‌ను వదలి మహారాష్ట్రకు వెళ్లిపోయారు
38. తెలంగాణలో ప్రప్రథమంగా ఆంగ్ల, తెలుగు పత్రికలు ప్రచురణలు చేసింది? రామానుజాచార్యులు
37. సాయంకాల పత్రిక ఏది? గారిసన్
36. దేవులపల్లి రామానుజారావు సంపాదకత్వంలో వెలువబడిన 'శోభ' పత్రిక ముఖ్య కేంద్రం? వరంగల్
35. 'చార్మినార్ గాసిప్' శీర్షికతో ఏ పత్రికలో వ్యాసాలు వచ్చేవి? శోభ
34. 1969 ఫిబ్రవరి 4న జీవో 36కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేసినవారు? AV నర్సింహారావు
33. 'పంచసూత్ర' ప్రణాళిక (1972 నవంబర్ 27) లోని ముఖ్యాంశం? హైదరాబాద్ - సికింద్రాబాద్‌లో సమ్మిళిత పోలీస్ దళం
32. తెలంగాణలో ఎంతమంది స్థానికేతరులు ఉద్యోగాలు పొందారో తొలిసారి గణాంకాలతో తేల్చిన కమిటీ? జయ భరత్ రెడ్డి
31. హైదరాబాద్(నిజాం) రాజ్య విస్తీర్ణం ఎంత? 82,698 చ.మైళ్లు
30. 'నిజాం సబ్జెక్ట్స్ లీగ్' అనే సంస్థను నెలకొల్పినవారు? బూర్గుల రామకృష్ణారావు
29. ఆది హిందువుల చేతి వృత్తుల నైపుణ్యం ప్రదర్శించడానికి 'హైదరాబాద్‌లో చేతి వృత్తుల ప్రదర్శన'ను ఎప్పుడు నిర్వహించారు? 1925
28. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని సంజీవయ్యపార్కులో భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇందుకోసం నిర్మించిన జెండా స్థూపం ఎత్తు? 291 అడుగులు; దీన్ని రూపొందించిన కంపెనీ: స్కిప్పర్ కంపెనీ రూపొందించింది.
27. హీనయాన శాఖకు చెందిన బౌద్ధ స్థూపం ఇటీవల ఎక్కడ బయల్పడింది? ధూళికట్ట
- బౌద్ధంలో రెండు ప్రధాన విభాగాలున్నాయి - మహాయానం[పెద్ద బండి] థేరవాదం [పూర్వవాదం లేదా సనాతనవాదం].
- తూర్పు ఆసియా, టిబెట్ ప్రాంతాలలో మహాయానం (వజ్రయానంతో కలిపి) అధికంగా ప్రాచుర్యంలో ఉంది. గౌతమ బుద్ధుడు బోధించిన ధర్మ సూత్రాలు బౌద్ధానికి మూలాధారం. త్రిపిటకములు అనే శాస్త్ర గ్రంథం బౌద్ధానికి ప్రధాన ఆధారమని అధికులు విశ్వసిస్తారు. ఇందుకు అదనంగా మహాయాన బౌద్ధులు "మహాయాన సూత్రాలు" అనే రచనను విశ్వసిస్తారు. దీనిని థేరవాదులు అంగీకరించరు.
- థేరవాదం (పూర్వవాదం లేదా సనాతనవాదం) అనేది బౌద్ధంలో అన్నింటికంటే ప్రథమ దశలో ఆవిర్భవించిన సిద్ధాంతాలకు సమీపంలో ఉన్న సంప్రదాయం. క్రీ.పూ.250లో జరిగిన 3వ బౌద్ధ మండలి సమావేశంలో ఇతరులతో విభేదించిన స్థవిరులు (విభజ్జన వాదులు) క్రమంగా థేరవాదులయ్యారు. భారతదేశంలో ఈ వాదం క్షీణీంచినప్పటికీ శ్రీలంక, ఆగ్నేయ ఆసియాలలో ఇప్పటి బౌద్ధమతం థేరవాదుల మార్గానికి సమీపంగా ఉంది.
- థేరవాదుల విశ్వాసాలు, ఆచరణలు ఆరంభంలో వెలువడిన పాళి సూత్రాలకు, వాటిపై వచ్చిన వ్యాఖ్యలకు పరిమితమై ఉంటాయి. కొన్ని శతాబ్దాలు మౌఖికంగా ఉండిపోయిన వీరి సూత్రాలు క్రీ.పూ.1వ శతాబ్దంలో శ్రీలంకలో గ్రంథస్తం చేయబడ్డాయి. ఆ సమావేశాన్నే థేరవాదులు "నాలుగవ బౌద్ధమండలి"గా భావిస్తారు. మౌలిక సూత్రాలైన సుత్త పిటకం, వినయపిటకం, త్రిరత్నాలు వంటి సిద్ధాంతాలకు థేరవాదులు సంకలనం చేసిన రచనలే ఆరంభదశలోని బౌద్ధ సిద్ధాంతాలకు అతి సమీప ఆధారాలుగా పండితులు భావిస్తారు.
- థేరవాదులు విభజ్జన వాదము (విశ్లేషణా బోధన)ను సమర్ధిస్తారు. గ్రుడ్డి నమ్మకాలకు బదులు సాధకుల అనుభవం, విమర్శనాత్మక పరిశీలన, హేతువిచారణ ద్వారానే జ్ఞానం లభిస్తుందని థేరవాదుల సిద్ధాంతం. వీరి బోధనల ప్రకారం కామం, క్రోధం, మోహం వంటి మాలిన్యాలవలన సుఖలాలసత్వం, అందుమూలంగా దుఃఖం కలుగుతాయి. అష్టాంగమార్గ సాధన ద్వారా ఈ మాలిన్యాలను తొలగించి, మోహాన్నుండి బయటపడి దుఃఖాన్నుండి విముక్తులు కావచ్చును. అష్టాంగ మార్గం ద్వారా నాలుగు మహోన్నత సత్యాలు అవగతమౌతాయి. తద్వారా జ్ఞానము, నిర్వాణము లభిస్తాయి. నిర్వాణమే థేరవాదుల పరమార్ధం.
- థేరవాదం ప్రస్తుతం ప్రధానంగా శ్రీలంక, మయన్మార్, లావోస్, థాయిలాండ్, కంబోడియా దేశాలలోను, కొద్దిభాగం చైనా , బంగ్లాదేశ్, వియత్నాం, మలేషియాలలోను ఆచరణలో ఉంది. ఐరోపా, అమెరికా ఖండాలలో కూడా థేరవాదం పట్ల ఆకర్షణ పెరుగుతున్నది.
- మహాయానం అనే విభాగం సనాతన బౌద్ధ సూత్రాలకు మరికొన్ని సూత్రాలను జోడించడం ద్వారా విస్తరించింది. మహాయానులు "బోధిసత్వ" భావానికి ప్రాముఖ్యత ఇస్తారు. సాధన ద్వారా దుఃఖం నుండి విముక్తి పొందడం అనే ప్రాథమిక లక్ష్యం కంటే మహాయాన సాధకులు లోకంలో ఉండి అందరినీ దుఃఖాన్నుండి విముక్తులను చేయాడమనే లక్ష్యాన్ని ఎన్నుకుంటారు. బోధిసత్వులు సకల జీవులకూ నిర్వాణాన్ని పొందడంలో తోడ్పడతారని వారి విశ్వాసం. అవధులు లేని "మహా కరుణ"యే బోధిసత్వుల లక్షణం. అదే అందరికీ నిర్వాణాన్ని ప్రసాదిస్తుంది.
- శూన్యత, ప్రజ్ఞాపారమిత, తథాగతత్వము అనే ఉన్నత తత్వాలు మహాయానంలో తరచు ప్రస్తావించబడుతాయి. తథాగత గర్భ సూత్రాలు పరమ సత్యాన్ని, ధర్మాన్ని, ఇదే అన్నింటికంటే గొప్ప సత్యమనీ మహాయానుల విశ్వాసం. అయితే ప్రస్తుతం చైనాలో అన్ని సూత్రాలకు సమానమైన ప్రాముఖ్యత ఉన్నట్లుగా అనిపిస్తుంది. మహాయాన సంప్రదాయంలో కొన్నిమార్లు బుద్ధుడు లేక ధర్మం ప్రత్యక్షం అవుతారని సూచనలున్నాయి. ఇది "దేవుడు" అనే భావానికి మహాయానంలో స్థానం కల్పిస్తుంది. మహాయానంలో త్రిపిటకాలకు అదనంగా మహాయాన సూత్రాలు, పద్మ సూత్రాలు, మహాపరినిర్వాణ సూత్రాలు ఉన్నాయి. వీటి సాధన ద్వారా బుద్ధత్వం పొందవచ్చునని వారి విశ్వాసం.
- ప్రస్తుత కాలంలో చైనా, టిబెట్, జపాన్, కొరియా, సింగపూర్ దేశాలలోను, కొద్ది భాగం రష్యాలోను, వియత్నా అధిక భాగంలోను అనుసరించే బౌద్ధాన్ని స్థూలంగా క్రింది విభాగాలుగా విభజింపవచ్చును.
- బుద్ధుని పరినిర్వాణం తరువాత కొద్ది కాలానికే మొదటి బౌద్ధ మండలి సమావేశమయ్యంది. బుద్ధుని అమూల్య బోధనలు కలుషితం కాకుండా వాటిని గ్రంథస్తం చేయడం ఈ మండలి సంకల్పం. బుద్ధుని సన్నిహితుడైన ఆనందుడు తెలిపిన సూత్రాలు సుత్త పిటకం అనీ, మరొక శిష్యుడు ఉపాలి చెప్పిన విషయాలు వినయ పిటకం అనీ ప్రసిద్ధి చెందాయి.సుత్త పిటకంలో బుద్ధుని సూక్తులు ఉన్నాయి. వినయ పిటకంలో బౌద్ధ సంఘంలో ఉండేవారి లక్షణాల గురించి చెప్పబడింది (భిక్షువుల ధర్మాలు). రెండవ బౌద్ధ మండలి తరువాత బౌద్ధంలో వివిధ శాఖలు పొడసూపనారంభించాయని పరిశోధకులు భావిస్తున్నారు.అశోకుని తరువాతనే ఈ శాఖా భేదాలు బలవంతమయ్యాయని కొందరి అభిప్రాయం
26. హైదరాబాద్ రాష్ట్ర పత్రికా రచయితల సంఘం ప్రథమ అధ్యక్షుడు ఎవరు? మందుముల నరసింగరావు
25. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఒక బౌద్ద క్షేత్రమే కాకుండా? భక్తరామదాసు జన్మస్థలం
24. సుమతీ శతక కర్త బద్దెనకుగల బిరుదు? కమలాసన
23. గుల్ ఎ తర్ (తాబీపూవు/ తాజా రోజా), సుర్ఖ్ సవేరా (అరుణోదయం) అనే ఉర్దూ కావ్య సంపుటాలను వెలువరించినది? మఖ్దుం మొయినొద్దీన్ *
- మఖ్దుం మొయినొద్దీన్ కమ్యూనిస్టు, మరియు కవి
- 1934లో బెర్నార్డ్ షా నాటకానికి ‘హోష్ కె నా ఖూన్’ అనే ఉర్దూ అనుసరణ రాసి హైద్రాబాద్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ సమక్షంలో ప్రదర్శించాడు
- అక్తర్ హుస్సేన్ రాయ్‌పురి, సిబ్తె హసన్‌లతో కలిసి హైద్రాబాద్‌లో ‘అభ్యుదయ రచయితల సంఘం’ స్థాపించాడు.
- చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ, బట్టల గిర్నీ, అల్విన్, షాబాద్ సిమెంట్, ఎన్ ఎస్సార్ రైల్వే ఎంప్లాయిస్, ఎలక్ట్రిసిటీ, సి.డబ్ల్యు.డి. మున్సిపాలిటీ, బటన్ ఫ్యాక్టరీ వంటి వందల కంపెనీల్లోని కార్మిక సంఘాలకు మఖ్దూమ్ అధ్యక్షుడయ్యాడు
- హైద్రాబాద్ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ శాఖకు తొలి కార్యదర్శిగా పనిచేశాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రపంచ ప్రసిద్ధ తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య పాత్రధారిగా ఉన్నాడు
- ఆయన రాసిన ‘ఏ జంగ్ హై జంగే ఆజాదీ’ ‘ఎక్ చంబేలీకె మండ్వే తలే’ అనే గీతాలు ప్రసిద్ధి పొందాయి
- 'ఫిర్ ఛిడీ బాత్, బాత్ ఫూలోం కి' అను గజల్ (గేయం) సుప్రసిధ్ధి.
- 1944లో సుర్ఖ్ సవేరా (అరుణోదయం),
- 1961లో గుల్ ఎ తర్ (తాబీపూవు),
- 1966లో బిసాతే రక్స్ (నాట్య వేదిక) పేర మూడు కవితా సంపుటాలను రచించాడు.
- 1944-51 మధ్యకాలంలో 'తెలంగాణ' అనే కవిత రాశాడు.1969, ఆగష్టు 25 తేదీన గుండెపోటుతో ఢిల్లీలో చనిపోయాడు
22. మారన మార్కండేయ పురాణాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించినది ఎవరు? ప్రతాపరుద్ర చక్రవర్తి సేనాని గన్నయ్య
21. మహబూబాబాద్ జిల్లా బయ్యారం చెరువును నిర్మించినది ఎవరు? మైలాంబ
20. పాండవుల గుట్ట ఏ జిల్లాలో ఉంది? జయశంకర్ భూపాలపల్లి జిల్లా
19. అబుల్ హసన్ తానీషా.. అక్కన్న, మాదన్నలకు ఇచ్చిన బిరుదులు ఏవి? సూర్యప్రకాశరావు - అఫ్పర్ బహదూర్*
18. వట్టికోట ఆళ్వారుస్వామి దేశోద్దారక గ్రంథమాలను ఎప్పుడు స్థాపించారు? 1938*
17. ప్రథమ తెలుగు చలనచిత్ర హీరోయిన్ సురభి కమలా బాయి ఎక్కడ జన్మించారు? హైదరాబాద్
16. 1915లో హైదరాబాద్‌లో ఏర్పడిన సోషల్ రీఫార్మ్స్ అసోషియేషన్‌కు అధ్యక్షుడు ఎవరు? కేశవరావు కోరాట్కర్*
15. దాశరథీ కరుణా సుధానిధీ మకుటంతో దాశరథి శతకం రాసిందెవరు? రంగరాజు కేశవరావు
14. చెరబండరాజు పేరు? బద్దం భాస్కర్ రెడ్డి*
13. వరంగల్‌లోని అజంజాహీ మిల్లు ఎప్పుడు ప్రారంభమైంది? 1931*
12. తెలంగాణ జన రణ శంఖం అని ఎవరిని అంటారు? రావి నారాయణరెడ్డి*
11. ఏ సినిమావల్ల హైదరాబాద్ నుంచి ధీరేన్ గంగూలీ నిజాంచేత వెళ్లగొట్టబడ్డారు? రజియా బేగం
10. ఫాదర్ ఆఫ్ ది హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఎవరిని అంటారు? ధీరేన్ గంగూలీ*
9. మరణానంతరం కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి పొందిన కవి? గడియారం రామకృష్ణ శర్మ*
8. అంపశయ్య నవీన్ అసలు పేరు? దొంగరి మల్లయ్య *
7. హైదరాబాద్‌లో అక్కన్న మాదన్నల ఆలయం ఎక్కడ ఉంది? శాలిబండ
6. ప్రజానాట్యమండలి ఎప్పుడు ప్రారంభమైంది? 1943
5. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఎప్పుడు, ఎవరి చేతుల మీదుగా ప్రారంభమైంది? 1969- సర్వేపల్లి రాధాకృష్ణ
4. దూరవిద్యను ప్రవేశపెట్టిన తెలంగాణ విద్యావేత్త? ప్రొ. జీ రామిరెడ్డి
3. ఏ సభకు దగాపడ్డ తెలంగాణ అని పేరుపెట్టారు? భువనగిరి
2. తెలంగాణ కళాసమితి స్థాపకురాలు ఎవరు? బెల్లి లలిత
1. ఆంధ్రమహా సభ తొలి సమావేశం మార్చి 1930లో జోగిపేటలో జరిగింది. ఈ సభకు అధ్యక్షతన వహించిన వారు? సురవరం ప్రతాపరెడ్డి
ముల్కీ కింద పరిమిత ఉపాధి రక్షణలు 1980 డిసెంబరు చివరి వరకు తెలంగాణ ప్రాంతంలో అమలులో ఉంటాయి. హైదరాబాద్, సికింద్రాబాదు విషయంలో ఈ రక్షణలు 1977 డిసెంబరు చివరి వరకు మాత్రమే కొనసాగుతాయి. దేని ప్రకారం ఇది జరుగుతుంది? పంచ సూత్రాల ప్రణాళిక
ప్రధాని ఇందిరా గాంధీ 1972 నవంబర్ 27న 5 పాయింట్ల ఫార్ములాను ప్రకటించారు.
8 పాయింట్ ఫార్ములా-1969:
ఏప్రిల్ 11, 1969న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1969 తెలంగాణ ఉద్యమాన్ని చల్లార్చేందుకు ఎనిమిది పాయింట్ల ఫార్ములాను రూపొందించారు.
ఈ ఫార్ములాలో 5 కమిటీల నియామకం ఉంటుంది:
తెలంగాణ ఆర్థిక మిగులును గుర్తించేందుకు హైపవర్డ్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రణాళిక అమలు కమిటీ
తెలంగాణ అభివృద్ధి కమిటీ
ప్రభుత్వ ఉద్యోగుల ఫిర్యాదులను పరిశీలించేందుకు కమిటీ
రక్షణ చర్యలపై న్యాయనిపుణుల కమిటీని సంప్రదించాలి.
సిక్స్ పాయింట్ ఫార్ములా-1973:
సిక్స్ పాయింట్ ఫార్ములాగా పిలవబడే ఒక పథకం, రెండు ప్రాంతాలకు చెందిన పార్లమెంటులోని కాంగ్రెస్ సభ్యులకు KCP పంత్ సమర్పించారు, 21 సెప్టెంబర్, 1973న వారి ఆమోదం పొందింది.
చట్టపరమైన సమస్యలను నివారించడానికి రాజ్యాంగం సవరించబడింది (32 సవరణ) ఆరు పాయింట్ల ఫార్ములాకు చట్టపరమైన పవిత్రతను ఇస్తుంది.
ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగింది.
రాష్ట్రపతి ఉత్తర్వు-1975:
రాజ్యాంగంలోని ఆర్టికల్ 371-డి ద్వారా అందించబడిన అధికారం కింద 1975 అక్టోబరు 18న "ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (లోకల్ క్యాడర్‌ల సంస్థలు మరియు ప్రత్యక్ష నియామకాల నియంత్రణ) ఆర్డర్ - 1975"ను రాష్ట్రపతి జారీ చేశారు.
ఈ ఉత్తర్వు ప్రెసిడెన్షియల్ ఆర్డర్-1975గా ప్రసిద్ధి చెందింది.
ఈ ఉత్తర్వును AP ప్రభుత్వం 20 అక్టోబర్, 1975న GO 674 ద్వారా జారీ చేసింది.
-----------------------------------------------------------------------------------
తెలంగాణా పోరాటం 1946-51 మధ్యన కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు వ్యతిరేకంగా జరిగింది.
- ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది తెలంగాణ ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు.హైదరాబాద్ స్టేట్‌లో అంతర్భాగంగా తెలంగాణ ప్రాంతం బ్రిటిష్ పాలనతో ఎలాంటి సంబంధం లేకుండా ఆసఫ్ జాహీల పాలనలో ఉంది.నిజాం హాలీ సిక్కా, ఇండియా రూపాయి రెండూ వేర్వేరు.
- 1948లో కలకత్తాలో అఖిలభారత కమ్యూ నిస్టు పార్టీ మహాసభ "సంస్థానాలను చేర్చుకోవడానికి ఒత్తిడి చేసే అధికారం యూనియన్ ప్రభుత్వానికి లేదు' అని తీర్మానించింది.
- మఖ్దుం మొహియుద్దీన్ సహా మరో ఐదుగురు కమ్యూనిస్టు నాయకులపై ఉన్న వారంట్లను నిజాం ప్రభుత్వం ఎత్తివేసింది.కమ్యూనిస్టు పార్టీ మీద ఉన్న నిషేధాన్ని తొలగించింది. హైదరాబాద్ రాజ్యం స్వతంత్రంగా ఉండాలని, అదే కమ్యూనిస్టు పార్టీ విధానమని రాజబహదూర్ గౌర్ ప్రకటించారు.ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు, దేశ్ ముఖ్ లు, జమీందారులు, దొరలు గ్రామాలపై పడి నానా అరాచకాలు సృష్టించారు. ఫలితంగా ఆనాటి నుంచి కమ్యూనిస్టుల వైఖరిలో మార్పు వచ్చింది.
- హైదరాబాద్ రాజ్యంలో పాలకుడు ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ స్థాయి నుంచి గ్రామాల్లోని దొరల వరకూ సాగిన అణచివేత విధానాలకు నిరసనగా ఈ పోరాటం మొలకెత్తింది. వెట్టి చాకిరి, భావవ్యక్తీకరణపై తీవ్ర ఆంక్షలు, మాతృభాషలపై అణచివేత, మతపరమైన నిరంకుశ ధోరణులు వంటి ఎన్నో పరిణామాలు నేపథ్యంగా నిలిచాయి. ఇవే కాక ప్రభుత్వం ప్రజలపై బలవంతులైన దొరలు, ఇతర శక్తులు దౌర్జన్యం చేయడాన్ని అడ్డుకోలేదు
- 1830ల్లోనే హైదరాబాద్ రాజ్య స్థితిగతుల గురించి తన కాశీయాత్రచరిత్రలో వ్రాసిన తొలి తెలుగు యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ విషయాలు ప్రస్తావించారు. 1820-30ల నడుమ రెండు సార్లు హైదరాబాద్ రాజ్యాన్ని, నగరాన్ని సందర్శించిన ఆయన హైదరాబాద్ నగరంలో ఆయుధపాణులైన వ్యక్తులు మెత్తనివారిని (బలహీనులను) కొట్టి నరికే పరిస్థితి వుందని, అందుకు గాను యాత్రికులు విధిగా కొందరు బలవంతులైన ఆయుధపాణులను తీసుకునే బయట తిరగాల్సివుంటుందని వ్రాశారు. సుంకాల వసూలు వ్యవస్థ గురించి వ్రాస్తూ హైదరాబాద్ నగరంలో సుంకాలు వసూలుచేసేవారు సరిగా ఇవ్వనివారిని చంపినా అడిగే దిక్కులేదని వ్రాసుకున్నారు
- వెట్టి చాకిరి సమస్య: గ్రామాలపై పెత్తనం వహించే దొరలకు, గ్రామాధికారులకు గ్రామాల్లోని వివిధ వృత్తులవారు వెట్టి చాకిరీ చేసే పరిస్థితులు నిజాం పాలన కాలంలో నెలకొన్నాయి. దొర ఇళ్లలో జరిగే వివిధ వేడుకలకు, శుభకార్యాలకు గ్రామంలోని అణచివేయబడ్డ కులాల వారి నుంచి మొదలుకొని వ్యాపారస్తులైన కోమట్ల వరకూ ఉచితంగా పనిచేయవలసి రావడం, డబ్బుతో పనిలేకుండా సంభారాలు సమకూర్చడం వంటివి జరిగేవి. గ్రామంలోకి పై అధికారులు వచ్చినప్పుడు జరిగే విందు వినోదాలకు ధాన్యం, మాంసం, కాయగూరలు వంటివి ఇవ్వడానికి ఊరందరికీ బాధ్యతలు పంచేవారు. వంట పని, వడ్డన పని మొదలుకొని అన్ని పనులూ పంచబడేవి. ఇదే కాక నిత్యం దళిత కులాలకు చెందిన వెట్టివారు అధికారులు, దొరల ఇళ్ళలో వెట్టిపని చేసి దయనీయంగా జీవితాన్ని గడపవలసి వచ్చేది. తెలంగాణా సాయుధ పోరాటం ప్రారంభమయ్యాకా ప్రజలను ఉత్తేజపరిచే పోరాటగీతాల్లో కూడా విరివిగా వెట్టిచాకిరీ సమస్య చోటుచేసుకుంది.
- భావ వ్యక్తీకరణపై ఆంక్షలు: ఏడవ నిజాం పరిపాలించిన ప్రాంతంలో తెలుగువారు, కన్నడిగులు, మరాఠీ వారు, గణనీయమైన సంఖ్యలో తమిళులు ఉండగా కేవలం ఉర్దూ భాషను మాత్రమే ప్రోత్సహించి మిగిలిన భాషలను అణచివేసే ప్రయత్నం చేశారనే విమర్శలు ఉన్నాయి. విద్య విషయంలోనూ, ఉద్యోగాల విషయంలోని ఉర్దూభాషకే ప్రోత్సాహం, ఆ భాషను నేర్చినవారికే అవకాశాలు దక్కుతూండేది. ఈ కారణంగా ఇతర భాషలు మాతృభాషగా కలిగినవారు ఉర్దూను నేర్చుకునేవారు. నిజానికి ఉర్దూ భాష విదేశీభాష కానీ, ఒక మతానికి చెందిన భాష కానీ కాదని అది దక్కన్ ప్రాంతంలో అభివృద్ధి చెందిన దేశీయభాషేనని ఆ ప్రాంతీయులు అభిమానించారు. ఉర్దూను ఆదరించి నేర్చి ఆ భాషలో కవిత్వం చెప్పినవారు ఉన్నారు. ఉర్దూపై వ్యతిరేకత లేకున్నా తమ మాతృభాషలను అణచివేయడం అసంతృప్తిగా మారింది. భాష, సంస్కృతుల అణచివేతను వ్యతిరేకిస్తూ ప్రారంభమైన వివిధ సంస్థలు, భాషోద్యమం, గ్రంథాలయోద్యమాలతో ప్రజాజీవితం ప్రారంభించిన పలువురు నాయకులు సాంఘిక సమస్యలపై చివరకు రాజకీయంగా నిజాం పాలనను వ్యతిరేకిస్తూ చేసిన పోరాటాల్లో కీలకపాత్ర పోషించారు. నిజాం పాలనలో చివరికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నా ముందస్తు అనుమతులు అవసరమయ్యే పరిస్థితి నెలకొని ఉండేది. పత్రికలను చదవడాన్ని కూడా ఒప్పుకోని జాగీర్దారులు ఉండేవారని దాశరథి రంగాచార్యులు రచించిన మోదుగపూలు వంటి సాహిత్యాధారాలు పేర్కొంటున్నాయి.
- ఆర్థిక కారణాలు: అధికవడ్డీలతో దోపిడీచేసి భూవసతి దోచుకోవడం, ఎక్కువ భూములు కొందరు భూస్వాముల వద్దే ఉండిపోయి సామాన్య రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి స్థితిగతులు ఈ పోరాటానికి మూలకారణమని పలువురు కమ్యూనిస్టు చరిత్రకారులు, ఉద్యమకారులు పేర్కొన్నారు. ఈ వాదన ప్రకారం తెలంగాణా సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం సామాన్యుల తిరుగుబాటు. ప్రపంచంలోని రైతుల తిరుగుబాట్లన్నిటిలోకీ అగ్రస్థానం పొందిందనీ తెలంగాణా సాయుధ పోరాటం చూసి ప్రపంచమే విస్తుపోయిందనీ పుచ్చలపల్లి సుందరయ్య వంటి కమ్యూనిస్టు నేతలు పేర్కొన్నారు. ఆర్థికపరమైన విషయాలే సాయుధపోరాటానికి ముఖ్యమైన కారణాలని చాలామంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.
- మతపరమైన స్థితిగతులు:
- తొలిదశ: 1921 నవంబరు 12న హైదరాబాద్‌లోని టేకుమట్ల రంగారావు ఇంట్లో తెలుగు భాషా, సంస్కృతులను పరిరక్షించుకునే లక్ష్యంతో ఆంధ్ర జనసంఘం ఏర్పాటుచేశారు. మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, ముందుముల నరసింగరావు, ఆదిరాజు వీరభద్రరావు, రామస్వామి నాయుడు, టేకుమట్ల రంగారావు తదితర 11మంది యువకులతో ఆ సంఘం ఏర్పాటైంది. తెలుగు భాష వ్యాప్తికి ప్రచారం చేస్తూ క్రమక్రమంగా నిజాం పాలనలో ప్రజలపై అమలవుతున్న ఆంక్షలను వ్యతిరేకించడం ప్రారంభించింది. వెట్టిచాకిరీ నిర్మూలన వంటి సామాజిక సమస్యలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడం వంటివి ప్రారంభించింది. ఆ సంస్థ 1930కల్లా ఆంధ్రమహాసభగా రూపుదిద్దుకుంది.
- రెండవ దశ: దొడ్డి కొమరయ్య మరణం. నైజాం అల్లరి మూకలు, విసునూర్ తుపాకి తూటాలకు నేలరాలిన అరుణతార, తెలంగాణ విప్లవంలో చెరగని ముద్రవేసుకున్నాడు దొడ్డి కొమరయ్య. 1946 జూలై 4న విసునూర్ నైజాం అల్లరి మూకలు రౌడీలతో 40 మంది వాచ్చారు. ప్రజలంతా ఏకమై కర్రలు, బడిశెలు, గుతుపలు అందుకుని విసునూర్, నిజాం, రజాకర్లను తరిమికొట్టారు. కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి, విసునూర్ దేశ్‌ముఖ్‌ల దౌర్జన్యం నశించాలంటూ నినాదాలు చేస్తూ మరింత ముందుకు సాగుతున్నారు. అశేష ప్రజానీకమంతా ధైర్య సహాసాలతో ప్రాణాలకు బరితెగించి రజాకర్లను ఎదుర్కోవడనికి బోడ్రాయి వరకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ కాపు కాసిన నైజాం అల్లరి మూకలు ఎకపక్షంగా కాల్పులు జరిపారు. ఊరేగింపులోఅగ్ర భాగంగా ఉన్న దొడ్డి కొమరయ్యకు తుపాకి తూటాలు కడుపులో దిగడంతో కమ్యూనిస్టుపార్టీ వర్ధిల్లాలి, జౌ ఆంధ్ర మహాసభ అంటూ కుప్పకూలినాడు దొడ్డి కొమరయ్య . తోటి కార్యకర్తలు నైజాం అల్లరి మూకలపై దాడులకు పూనుకుంటున్నారు. భూస్వామి విసునూర్‌లకపై అణిగిమనిగిఉన్న ప్రజల కోపం కట్టలుతెచ్చుకుంది. ప్రజలంతా మూకుమ్మడిగా విసునూర్ భూస్వాముల గడీలపై దాడులు చేసి రజాకార్ల గుండాలను తరిమి తరిమి కొట్టారు. దొడ్డి కొమురయ్య వీర మరణంతో సాయుధ పోరాటం మరింత పోరాట రూపం దాల్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయములో చదువుతున్న పానుగంటి సీతారామారావు, అనిరెడ్డి రామిరెడ్డి, చలసాని శ్రీనివాసరావు, గాది మధన్‌రనెడ్డి, గంగసాని చేరి తిరుమలరెడ్డి సాయుధ పోరాటం చేసి ఆయుధాలు ధరించారు. వందలాదిమంది విద్యార్థులు పోరాటంలో చేరి ఆయుధాలు ధరిచారు. వందలాది మంది విద్యార్థులు ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ తెలంగాణ ప్రజానికానికి అండై నిలిచారు. శత్రుదాడులను ఎదుర్కునేందుకు ప్రజలు ఎప్పుడు తమ చేతుల్లో కారంపొడి రోకలిబండలు, కర్రలు పట్టుకుని సిద్దంగా ఉండేవారు. దొడ్డి కొమరయ్య నాయకత్వం వహిస్తే దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో వేలాది మంది తమ ప్రాణాలను తృణ ప్రాయంగా వదిలారు. నాలుగువేల ఐదొందలమంది నేలరాలారు.
- సాయుధ పోరాటం: కమ్యూనిస్టుల నాయకత్వంలో గెరిల్లా యుద్ధ తంత్రంతో 3000 లకు పైగా గ్రామాలను విముక్తం కాబడ్డాయి. ఈ ప్రాంతంలోని జమీందారులను దొరికిన వారిని దొరికినట్టుగా చంపి వేసారు. చావగా మిగిలిన వారు పారి పోయారు. విముక్తి చేయ బడిన గ్రామాల్లో సోవియట్ యూనియన్ తరహా కమ్యూన్లు ఏర్పరచారు. ఈ కమ్యూన్లు కేంద్ర నాయకత్వం క్రింద పని చేసేవి. ఈ పోరాటానికి 'ఆంధ్ర మహాసభ' పేరుతో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించింది. ఈ పోరాటానికి నాయకత్వం వహిచిన వారిలో మగ్దూం మొహియుద్దీన్, రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, హసన్ నాసిర్, మల్లు వెంకట నరసింహారెడ్డి లు ముఖ్యులు.
- అదే సమయంలో నిజాం నవాబు హైదరాబాద్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. భారత ప్రభుత్వం సెప్టెంబరు 1948 లో నిజాం పైకి తన సైన్యాన్ని పంపింది.
- రజాకారు సేనను తయారు చేసి మత విద్వేషాన్ని రెచ్చగొట్టి, దాడులు, హత్యలు, హత్యచారాలు నిర్వహించిన వాడు కాశీం రజ్వీ. ప్రోత్సాహించినవాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్. 1947 ఆగస్టు15 నుంచి 1948 సెప్టెంబరు 17 వరకు ఈ రాజాకార్లకు గ్రామాల్లో దొరలు, పెత్తందార్లు నాయకత్వం వహించారు.ఈ దొరలు, పెత్తం దార్లు 1948 సెప్టెంబరు 17 దాకా షేర్వానిలు, చుడేదార్ పైజామాలు వేసుకుని కుచ్చుటోపీలు పెట్టుకొని నైజాం సేవ చేశారు. 1948 సెప్టెంబరు 17 తర్వాత గ్రామాల్లో ఖద్దరు బట్టలు, గాంధీ టోపీలతో ప్రవేశించి ప్రజలు స్వాధీనం చేసుకున్న భూమిని అక్రమించి 1951 అక్టోబరు దాకా యూనియన్ సైన్యాలు కమ్యూనిస్టులను వేటాడడంలో సహకరించారు. ముస్లింలను వేటాడడంలో పురికొల్పారు. ముఖ్యంగా మరట్వాడలో లక్షలాదిమంది ముస్లింలను హత్య చేయడంలో కేంద్ర బలగాలకు అండగా నిలిచారు. 1956 దాకా మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజప్రముఖ్‌గా ఉన్నట్లుగానే- జమీందారీ, జాగీర్దారీ చట్టం రద్దయి రక్షిత కౌల్దారీ చట్టం వచ్చేదాకా-దేశ్‌ముఖ్, దేశ్‌పాండే, ముక్తేదార్‌లుగా దొరలు కొనసాగారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజభరణాలు ప్రభుత్వం నుంచి పొందినట్లుగా వీళ్లు నష్టపరిహారాలు, ఇనాములు పొందారు.
- పోరాట ఫలితం :కమ్యూనిస్టులు హైదరాబాదుని ఆక్రమించే చివరి దశలో ప్రాణాలపై ఆశ వదులుకున్న నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగి పోతున్నట్టుగా ప్రకటించాడు. తద్వారా 1948, సెప్టెంబరు 17న హైదరాబాదు రాష్ట్రం భారతదేశంలో కలవడం, తెలంగాణా సాయుధ పోరాటానికి ముగింపు జరిగాయి.1952 మార్చి 6 న హైదరాబాద్ రాజ్యంలో బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని 1948 సెప్టెంబర్ 17న విరమించలేదు.
1969, ఫిబ్రవరి 28న తెలంగాణ ప్రజా సమితి పార్టీ స్థాపించబడింది. అనంతుల మదన్ మోహన్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాడు. మొదటి కార్యక్రమంగా మార్చి 3 న తెలంగాణ బందును జరిపింది. 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలోని 11 స్థానాలలో 10 స్థానాలను తెలంగాణ ప్రజా సమితి పార్టీ గెలుచుకుంది. 1971, సెప్టెంబరు టిపిఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. దాంతో ప్రత్యేక తెలంగాణ ఆందోళనలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. పివి నర్సింహారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు
ఆచార్య జయశంకర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ సమాజానికి జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికి 2001లో కల్వకుంట్ల చంద్రశేకర్రావు ( కేసీఆర్) తెలుగు దేశం పార్టీ నుంచి బయటకు వచ్చి ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పార్టీని స్థాపించారు.
1969 జనవరి 13న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విద్యార్థులందరూ కలిసి ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడినారు.
ప్రత్యేక తెలంగాణ సమస్యను పరిష్కరించడం లో భాగంగా కేంద్ర ప్రభుత్వం శ్రీ కృష్ణ కమిటీని 2010 ఫిబ్రవరి 3 న ఏర్పాటు చేశారు. శ్రీ కృష్ణ కమిటీ తన నివేదికను కేంద్ర హోం శాఖకు సమర్పించిన తేది 2010 డిసెంబర్ 30.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి 2013 ఆగష్టు 6 న కేంద్ర ప్రభుత్వం ఆంటోని కమిటీని ఏర్పాటు చేసినది.
తెలంగాణ ప్రాంతంలో 1952 ఆగష్టు 5 న ముల్కీ ఉద్యమం ప్రారంభమైనది. వరంగల్‌లో మూకుమ్మడిగా జరిగిన ఉపాధ్యాయ బదిలీలకు వ్యతిరేకంగా ప్రారంభమైన ముల్కీ ఉద్యమం హైదరాబాద్ రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు వ్యాపించడం, మూడు వారాలకు పైగా విద్యార్థులు ఆందోళన చేయడం, తరగతులు బహిష్కరించి ప్రదర్శనలు నిర్వహించడం, నాన్ ముల్కీలకు వ్యతిరేకంగా ఇచ్చిన నినాదాలు, అక్కడక్కడ (వరంగల్, నల్లగొండ, జంటనగరాలు) నాన్ ముల్కీలకు విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణలు, బెదిరింపు చర్యలు, వ్యక్తిగత దాడులు హైదరాబాద్‌లో సెప్టెంబర్ 3,4 తేదిల్లో సిటీ కాలేజీ, అప్జల్‌గంజ్ ప్రాంతాలలో ఎవరు పిలవకున్నా సుమారు 30 వేల నుంచి 40 వేల మంది ప్రజలు, విద్యార్థులు పాల్గొన్న మహోద్యమం.
Comments
Post a Comment